TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/suma-trivikramae6479ac-0767-498e-a6c6-efaf5b2011bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/suma-trivikramae6479ac-0767-498e-a6c6-efaf5b2011bc-415x250-IndiaHerald.jpgయాంకర్ గా ఇండస్ట్రీలో బిజీగా మారిన సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విధంగా బుల్లితెరపై వరుస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ఏదైనా ప్రత్యేక ఈవెంట్ లో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా రిలీజ్ ఉందంటే చాలు ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి వాటిని సక్సెస్ చేయడంలో ఈమె ముందు ఉంటుంది. ఈ విధంగా సుమా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాదు సోషల్ మీడియాలో కూడా యSUMA;TRIVIKRAM{#}suma;suma kanakala;Onam;trivikram srinivas;Event;Success;Interview;Cinemaటీవీ: ఆ డైరెక్టర్ డైలాగ్.. ప్రాణాలు మీదకు తెచ్చింది అంటున్న సుమ..!టీవీ: ఆ డైరెక్టర్ డైలాగ్.. ప్రాణాలు మీదకు తెచ్చింది అంటున్న సుమ..!SUMA;TRIVIKRAM{#}suma;suma kanakala;Onam;trivikram srinivas;Event;Success;Interview;CinemaSat, 02 Sep 2023 02:00:00 GMTయాంకర్ గా ఇండస్ట్రీలో బిజీగా మారిన సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విధంగా బుల్లితెరపై వరుస కార్యక్రమాలకు యాంకర్ గా వ్యవహరించడమే కాకుండా ఏదైనా ప్రత్యేక ఈవెంట్ లో కూడా సందడి చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది. ముఖ్యంగా సినిమా రిలీజ్ ఉందంటే చాలు ఆ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుకొని ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా చిత్ర బృందాన్ని ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసి వాటిని సక్సెస్ చేయడంలో ఈమె ముందు ఉంటుంది. ఈ విధంగా సుమా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాదు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.

ఇప్పుడు తాజాగా ఓనం ఫెస్టివల్స్ సందర్భంగా యాంకర్ల అందరిని పిలిచి తన ఇంట్లో విందు భోజనం కూడా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట చాలా వైరల్ గా మారాయి.తాజాగా సుమ ఒక వీడియో షేర్ చేయగా అందులో త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పిన డైలాగ్ గురించి ఆమె తెలిపారు. "రెండు చేతులు జోబులో పెట్టుకొని అలా లేచి వెళ్ళిపోయాను" అనే త్రివిక్రమ్ డైలాగు ఎంత ఫేమస్ అయిందో అందరికీ తెలుసు.

అయితే ఒక వ్యక్తి ఇలా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగులు ఫాలో అవుతూ ప్రాణాలు మీదికి తెచ్చుకున్నారు. అందుకు సంబంధించిన వీడియోని సుమా షేర్ చేస్తూ.. ఆ వీడియోలో ఒక వ్యక్తి చేతికి బ్రాస్లెట్ వేసుకొని ఫాంట్ జేబులో తన చేయి పెట్టుకోవడం వల్ల ఆ బ్రేస్ తన ఫాంట్ కి  చిక్కుకోవడంతో తన చేయి బయటకు రాక కాసేపు ఇబ్బంది పడ్డారు. దీనిని సుమా షేర్ చేస్తూ ఇకపై ఎవరూ కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్లు జేబులో చేతులు పెట్టుకోకండి.. ముఖ్యంగా బ్రేస్లెట్ ధరించిన వారు అస్సలు పెట్టుకోకండి అంటూ వీడియోని షేర్ చేసింది. ఇక సుమ షేర్ చేసిన ఈ వీడియో వైరల్ గా మారుతోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాయలసీమ : అఖిల నిర్ణయం తీసేసుకున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>