DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/india617bca29-7942-4f04-bad4-0faaa1ea4c92-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/india617bca29-7942-4f04-bad4-0faaa1ea4c92-415x250-IndiaHerald.jpgభూటాన్ మన సరిహద్దు దేశం. ఇంకా చెప్పాలంటే భారత్ కు చైనాకు మధ్య ఉండే దేశం. కానీ ఆ భూటాన్ లోని డోక్లాం లోయలో వాళ్లని అటాక్ చేయడానికి సిద్ధమైనప్పుడు మన భారతీయులే వెళ్లి వాళ్ళని కాపాడుకు వచ్చారట. అయినా దానికి భారతదేశం అంటే కృతజ్ఞత లేకుండా పోయింది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే తాజాగా చైనా అలాగే భూటాన్ దేశాల మధ్య సమావేశం జరిగినట్లుగా తెలుస్తుంది. ఈ సమావేశం పై మొన్నటి వరకు ప్రతిపాదన మాత్రమే ఉండగా, ఇప్పుడు వీరి సమావేశం కార్యరూపం దాల్చిందని తెలుస్తుంది. చైనా హనీ ట్రాప్, అలాగే మనీ ట్రాప్ ద్వారాINDIA{#}Bhutan;Shatru;Indiaఇండియాకు ద్రోహం చేసిన పొరుగు దేశం?ఇండియాకు ద్రోహం చేసిన పొరుగు దేశం?INDIA{#}Bhutan;Shatru;IndiaSat, 02 Sep 2023 11:00:00 GMTభూటాన్ మన సరిహద్దు దేశం. ఇంకా చెప్పాలంటే భారత్ కు చైనాకు మధ్య ఉండే దేశం. కానీ ఆ భూటాన్ లోని డోక్లాం లోయలో వాళ్లని అటాక్ చేయడానికి సిద్ధమైనప్పుడు మన భారతీయులే వెళ్లి వాళ్ళని కాపాడుకు వచ్చారట. అయినా దానికి భారతదేశం అంటే కృతజ్ఞత లేకుండా పోయింది. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే తాజాగా చైనా అలాగే భూటాన్ దేశాల మధ్య సమావేశం జరిగినట్లుగా తెలుస్తుంది.


ఈ సమావేశం పై మొన్నటి వరకు  ప్రతిపాదన  మాత్రమే ఉండగా, ఇప్పుడు వీరి సమావేశం  కార్యరూపం దాల్చిందని తెలుస్తుంది. చైనా హనీ ట్రాప్, అలాగే మనీ ట్రాప్ ద్వారా పక్క వాళ్ళని ఆడించే  విషయంలో  దిట్ట అని అంటారు. ఒక దేశం తన దేశపు సరిహద్దులు దాటి వేరే దేశాన్ని లోపలికి అనుమతిస్తుందంటే అది ఖచ్చితంగా  ఒక ట్రాప్ అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.


అయితే భూటాన్ ఇప్పుడు కృతజ్ఞత మరిచి శత్రు దేశాలతో కలుస్తుందని తెలుస్తుంది. ప్రత్యేకించి భూటాన్ చైనా దేశంతో చేతులు కలుపుతుందని తెలుస్తుంది. మరి చైనా భూటాన్ ని  తన చెప్పు చేతల్లో ఉంచుకోవడం కోసం  ఎటువంటి ట్రాప్ వేసిందో మాత్రం అర్థం అవడం లేదు. అయితే భూటాన్ ఇప్పుడు  మనకు చేస్తున్న నమ్మకద్రోహం వల్ల మన శత్రువు వచ్చి మన పక్కనే  కూర్చునే ప్రమాదం ఉంది.


ఒకవేళ చైనా భూటాన్ లోని డోక్లాం ని కానీ ఆక్రమించుకుంటే గనుక సెవెన్ సిస్టర్స్ అని పిలవబడే ఏడు ఈశాన్య రాష్ట్రాలను పక్కకు నెట్టి చైనా మన పక్కకు వచ్చి కూర్చుంటుందని అంటున్నారు రాజకీయ నిపుణులు.  భారతదేశం తనను కాపాడింది అనే కృతజ్ఞత కూడా లేకుండా భూటాన్ చేస్తున్న ఈ నమ్మక ద్రోహం  మాత్రం అత్యంత దారుణమైన విషయం. తాను పాలు పోసిన పాము తననే కాటు వేసినట్లుగా తయారైంది భారత్ పరిస్థితి అంటున్నారు భూటాన్ పద్ధతి చూసిన వాళ్లు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నితిన్ తమ్ముడిలో ఒకప్పటి హీరోయిన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>