MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood764c08ac-e61e-436d-9a9e-50803f48332d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood764c08ac-e61e-436d-9a9e-50803f48332d-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాల అప్డేట్ కోసం ఆయన అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో అన్నది చెప్పడం ఆసాధ్యం. వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత చేసిన భోళా శంకర సినిమా డిజాస్టర్ గా మారింది .మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనది. కాగా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్న కూడా ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో మెగాస్టార్ నెక్స్ట్ సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ tollywood{#}ajith kumar;keerthi suresh;Good news;Ajit Pawar;Good Newwz;Chiranjeevi;Remake;Blockbuster hit;Amazon;Cinema;News;media;septemberఓటీటీ లోకి వచ్చేస్తున్న చిరంజీవి భోళాశంకర్... ఎప్పుడంటే..!?ఓటీటీ లోకి వచ్చేస్తున్న చిరంజీవి భోళాశంకర్... ఎప్పుడంటే..!?tollywood{#}ajith kumar;keerthi suresh;Good news;Ajit Pawar;Good Newwz;Chiranjeevi;Remake;Blockbuster hit;Amazon;Cinema;News;media;septemberSat, 02 Sep 2023 16:55:00 GMTమెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాల అప్డేట్ కోసం ఆయన అభిమానులు ఎంతలా ఎదురుచూస్తున్నారో అన్నది చెప్పడం ఆసాధ్యం. వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న మెగాస్టార్ చిరంజీవి ఆ తర్వాత చేసిన భోళా శంకర సినిమా డిజాస్టర్ గా మారింది .మెహర్ రమేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో విఫలమైనది. కాగా ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్న కూడా ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది. దీంతో మెగాస్టార్ నెక్స్ట్ సినిమా అయినా బ్లాక్ బస్టర్ హిట్ పడాలి అని ఆశిస్తున్నారు.

తమిళంలో సూపర్ హిట్గా నిలిచిన వేదళం సినిమాకి రీమేక్ గా ఈ సినిమాని తెరకెక్కించాడు  దర్శకుడు. అజిత్ హీరోగా నటించిన ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. కానీ ఈ సినిమాని తెలుగులో నేటివిటికి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులను చేసి తీశారు. అలాగే ఈ సినిమాలో తమన్నాని హీరోయిన్గా పెట్టారు. ఆమెతోపాటు కీర్తి సురేష్ ని ఈ సినిమాలో మెగాస్టార్ కి చెల్లెలి పాత్రలో చూపించారు. అయితే మొదటి షో నుండి ఈ సినిమాకి ఫ్లాప్టాప్ వచ్చింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం థియేటర్స్ లో చూడని ప్రేక్షకులందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు ఓటీటీ లోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పారు నిర్వాహకులు. ఈ నేపథ్యంలోనే భోళాశంకర్ సినిమాని సెప్టెంబర్ 17న ఓటీటీ లోకి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా ప్రస్తుతం సోషల్ మీడియాలో వార్తలు వినబడుతున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులని దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. కాగా సెప్టెంబర్ 17న ఈ సినిమాని ఓటీటీలోకి నేరుగా స్ట్రీమింగ్ చేసే అవకాశాలు ఉన్నట్లుగా సమాచారం. ఇక ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త కాస్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది..!!



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ప్రభాస్ అసలు పేరు ఏంటో తెలిస్తే షాక్ అవుతారు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>