DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/revanth-reddy934386b9-01c4-47e5-a9c3-0c0807d0e23b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/revanth-reddy934386b9-01c4-47e5-a9c3-0c0807d0e23b-415x250-IndiaHerald.jpgపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య గాంధీ భవన్ లో ఇటీవల వాగ్వాదం జరిగింది. టికెట్ల విషయంలో వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఇద్దరు రెండు టికెట్లు అడుగుతున్నారు. అయితే ఆ మధ్య కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ ఇవ్వాలని అనుకున్నారు. అందుకే రాహుల్ గాంధీ పోటీ చేస్తే ప్రియాంక కూడా పోటీకి దూరంగా ఉంది. అయితే తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో దాదాపు 119 స్థానాలకు గాను మొత్తం 1000 అఫ్లికేషన్లు వచ్చాయి. దీREVANTH REDDY{#}Kumaar;priyanka;revanth;Uttam Kumar Reddy Nalamada;Rahul Gandhi;Mohandas Karamchand Gandhi;Revanth Reddy;Congress;Janareddy;Kodangal;Applicationరేవంత్ రెడ్డి.. మరీ రెచ్చిపోతున్నారా?రేవంత్ రెడ్డి.. మరీ రెచ్చిపోతున్నారా?REVANTH REDDY{#}Kumaar;priyanka;revanth;Uttam Kumar Reddy Nalamada;Rahul Gandhi;Mohandas Karamchand Gandhi;Revanth Reddy;Congress;Janareddy;Kodangal;ApplicationSat, 02 Sep 2023 00:00:00 GMTపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య గాంధీ భవన్ లో ఇటీవల వాగ్వాదం జరిగింది. టికెట్ల విషయంలో వీరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి ఇద్దరు రెండు టికెట్లు అడుగుతున్నారు. అయితే ఆ మధ్య కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయం ఒక కుటుంబం నుంచి ఒక్కరికే టికెట్ ఇవ్వాలని అనుకున్నారు. అందుకే రాహుల్ గాంధీ పోటీ చేస్తే ప్రియాంక కూడా పోటీకి దూరంగా ఉంది.


అయితే తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో దాదాపు 119 స్థానాలకు గాను మొత్తం 1000 అఫ్లికేషన్లు వచ్చాయి. దీనికి సంబంధించి పెద్ద చర్చే జరుగుతుంది. కేవలం కొడంగల్ లో మాత్రమే కాంగ్రెస్ నుంచి ఒకే ఒక్క అప్లికేషన్ రావడం అది కూడా రేవంత్ రెడ్డి కావడం గమనార్హం. అయితే తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ఎలాగైన గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ సారి కచ్చితంగా బీఆర్ఎస్ ను ఓడించాలనే ప్రణాళిక రచిస్తోంది. అయితే హస్తం పార్టీలో ఎప్పటిలాగానే సీనియర్లు, జూనియర్ల మధ్య రోజూ ఏదో వివాదం కొనసాగుతూనే ఉంది.


ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి టికెట్ విషయంలో రెండు స్థానాల్లో తనకు, తన భార్యకు కావాలని పట్టుబడుతున్నారు. ఈ విషయంలో రేవంత్, ఉత్తమ్ మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగినట్లు ప్రచారం జరుగుతోంది. టికెట్ విషయంలో తనను డిక్టేట్ చేయవద్దని రేవంత్ ఉత్తమ్ పై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.


ముఖ్యంగా టికెట్ పంచాదిలో వాడీవేడీగా చర్చ సాగినట్లు తెలుస్తోంది. సీనియర్లే రెండు టికెట్లే అడుగుతే ఎలా వ్యాఖ్యానించినట్లు తెలుస్తుంది. ఉత్తమ్ ముందు నుంచి కాంగ్రెస్ లో ఉండగా రేవంత్ కాంగ్రెస్ లో చేరిన కొన్ని రోజులకే పీసీసీ అధ్యక్షుడిగా ప్రమోషన్ సాధించారు. కాంగ్రెస్ లో టికెట్ల పంపకంలో పీసీసీ అధ్యక్షుడి మాటే ఫైనల్ ఉంటుంది. మరి ఉత్తమ్ కు రెండు టికెట్లు ఇస్తారా లేదా చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాయలసీమ : అఖిల నిర్ణయం తీసేసుకున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>