PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/magunta-ongole-mp-jagan26c3a307-b595-41f1-8ea0-5d57274916b2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/magunta-ongole-mp-jagan26c3a307-b595-41f1-8ea0-5d57274916b2-415x250-IndiaHerald.jpgఇంతకాలం జైలులో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన రాఘవ గురువారం ఒంగోలుకు వచ్చారు. ఈ సందర్భంగా రాఘవను ఎంఎల్ఏ కలిశారు. గడచిన 50 ఏళ్ళుగా మద్యం వ్యాపారం చేస్తున్న మాగుంట కుటుంబంపై ఎప్పుడూ ఎక్కడా ఒక్క ఆరోపణ కూడా లేదని బాలినేని గుర్తుచేశారు. ఇలాంటి రాఘవను కావాలనే కొంతమంది లిక్కర్ స్కామ్ లో ఇరికించినట్లు బాలినేని అనుమానించారు. కావాలని ఇరికించారు కాబట్టి పార్టీ మొత్తం మాగుంట కుటుంబానికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. magunta Ongole MP jagan{#}Yevaru;MP;Party;MLA;Delhi;thursdayకోస్తా : ఇంత కాలానికి మద్దతు దొరికిందా ?కోస్తా : ఇంత కాలానికి మద్దతు దొరికిందా ?magunta Ongole MP jagan{#}Yevaru;MP;Party;MLA;Delhi;thursdaySat, 02 Sep 2023 07:00:00 GMT


ఇంతకాలానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కుటుంబానికి పార్టీ నుండి మద్దతు దొరికింది. ఒంగోలు ఎంఎల్ఏ బాలినేని శ్రీనివాసులరెడ్డి మీడియాతో మాట్లాడుతు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కొడుకు మాగుంట రాఘవను అన్యాయంగా ఇరికించారని మండిపడ్డారు. మాగుంట ఫ్యామిలీకి ఈ విషయంలో పార్టీనుండి కావాల్సిన మద్దతు ఉంటుందని బాలినేని ప్రకటించారు.





ఇంతకాలం జైలులో ఉండి బెయిల్ మీద బయటకు వచ్చిన రాఘవ గురువారం ఒంగోలుకు వచ్చారు. ఈ సందర్భంగా రాఘవను ఎంఎల్ఏ కలిశారు. గడచిన 50 ఏళ్ళుగా మద్యం వ్యాపారం చేస్తున్న మాగుంట కుటుంబంపై ఎప్పుడూ ఎక్కడా ఒక్క ఆరోపణ కూడా లేదని బాలినేని గుర్తుచేశారు. ఇలాంటి రాఘవను కావాలనే కొంతమంది లిక్కర్ స్కామ్ లో ఇరికించినట్లు బాలినేని అనుమానించారు. కావాలని ఇరికించారు కాబట్టి పార్టీ మొత్తం మాగుంట కుటుంబానికి అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.





ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే గడచిన ఏడాదిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ దేశంలో సంచలనాలు సృష్టిస్తోంది. స్కామ్ లో డబ్బు మొత్తం చిన్నదే అయినా ఇరుక్కున్న వాళ్ళు చాలా ప్రముఖులు. అందుకనే ఈ స్కామ్ కు అంత ప్రాధాన్యత వచ్చింది. సరే ఈ విషయాన్ని వదిలేస్తే సుమారు 6 మాసాలు రాఘావ జైలులోనే గడిపారు. అంతకుముందు విచారణ సందర్భంలో కానీ జైలులో ఉన్నపుడు కానీ పార్టీ తరపున మాగుంట ఫ్యామిలీకి ఎవరు మద్దతు ప్రకటించలేదు.





నిజానికి ఎంపీ అసలు వైసీపీలోనే ఉన్నారా అన్న అనుమానాలు కూడా పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఎంపీని పార్టీ పట్టించుకోవటంలేదు. అలాగే ఎంపీ కూడా పార్టీతో సంబంధంలేదన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. పార్టీ నుండి ఏ దశలో కూడా ఎంపీకి మద్దతుగా ఎవరూ మాట్లాడలేదు. అలాంటిది ఇంతకాలానికి సడెన్ గా బాలినేని ఎందుకు మద్దతుగా మాట్లాడారన్నదే ఆశ్చర్యంగా ఉంది. బహుశా తన బావ, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డితో ఉన్న వైరాన్ని దృష్టిలో పెట్టుకునే బాలినేని వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లున్నారు. రాబోయే ఎన్నికల్లో సుబ్బారెడ్డికి ఎంపీ టికెట్ రాకుండా అడ్డుకోవటంలో భాగంగానే మాగుంటకు మద్దతుగా నిలిచి దువ్వుతున్నట్లున్నారు. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

OG గ్లింప్స్ తో అదరగొట్టేస్తున్న పవన్ కళ్యాణ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>