PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrbabu-it-black-money1625afcd-4b4f-44ed-b107-cf2e42bb7a94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrbabu-it-black-money1625afcd-4b4f-44ed-b107-cf2e42bb7a94-415x250-IndiaHerald.jpgఅందుబాటులోని సమాచారం ప్రకారం అమారవతి రాజధానిలో తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు భవనాలను నిర్మించిన షాపూర్ జీ పల్లోంజి సంస్ధ నుండే ముడుపులు అందినట్లు ప్రచారం ఎప్పటినుండో జరుగుతోంది. షాపూర్ జీ సంస్ధకు ఆర్ధికంగా డైరెక్టుగా లబ్ది చేకూర్చుందుకే చంద్రబాబు చాలాసార్లు భవనాల అంచనా వ్యయాలను ఇష్టం వచ్చినట్లు పెంచేశారనే ఆరోపణలు ఎప్పటినుండో ఉన్నాయి. అంచనాలు పెంచినందుకే ముడుపులు అందాయట. చంద్రబాబుకు ముడుపులు ఇచ్చినట్లుగా షాపూర్ కంపెనీకి సంబంధించిన డైరీల్లో కూడా ఉన్నట్లు సమాచారం. chandrbabu IT black money{#}118;Ishtam;High court;Delhi;Industry;CBN;Newsఢిల్లీ : చంద్రబాబు దగ్గర ఇంత బ్లాక్ మనీ ఉందా ? సంచలనంఢిల్లీ : చంద్రబాబు దగ్గర ఇంత బ్లాక్ మనీ ఉందా ? సంచలనంchandrbabu IT black money{#}118;Ishtam;High court;Delhi;Industry;CBN;NewsSat, 02 Sep 2023 03:00:00 GMT



ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుకు ఆదాయపు పన్నుశాఖ (ఐటి) నోటీసులు జారీచేసినట్లు సమాచారం. ఢిల్లీలోని ఐటి శాఖ ఆగస్టు 4వ తేదీన చంద్రబాబుకు నోటీసులు జారీచేసినట్లు ఢిల్లీ మీడియా తెలిసింది. ఇన్ ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ నుండి చంద్రబాబుకు రు. 118 కోట్లు అందినట్లు ఐటి శాఖకు విశ్వసనీయ వర్గాల నుండి ఉప్పందిందట. ఉప్పదంటమే కాకుండా అందుకు కావాల్సిన ఆధారాలు సైతం అందినట్లు తెలుస్తోంది.





అన్నీ విషయాలను పరిశీలించి, 118 కోట్ల రూపాయలు అందిన విషయం వాస్తవమే అని నిర్ధారించుకున్న తర్వాతే ఐటి శాఖ చంద్రబాబుకు షో కాజ్ నోటీసులు జారీచేసినట్లు సమాచారం. ఏ మార్గంలో 118 కోట్ల రూపాయలు అందుకున్నారు ? ఇచ్చిన కంపెనీలు ఏవి ? ఎందుకు ఇచ్చారనే విషయాలు వివరించాలని నోటీసులో చంద్రబాబును ఐటి శాఖ కోరిందట. సెక్షన్ 153 సీ ప్రకారం చంద్రబాబుకు నోటీసులిచ్చిన ఐటి శాఖ ముడుపులు అందుకున్న విషయంపై మరింత లోతుగా విచారణ జరపాలని నిర్ణయించుకున్నది.





అందుబాటులోని సమాచారం ప్రకారం అమారవతి రాజధానిలో తాత్కాలిక అసెంబ్లీ, తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు భవనాలను నిర్మించిన షాపూర్ జీ పల్లోంజి సంస్ధ నుండే ముడుపులు అందినట్లు ప్రచారం ఎప్పటినుండో జరుగుతోంది. షాపూర్ జీ సంస్ధకు ఆర్ధికంగా డైరెక్టుగా లబ్ది చేకూర్చుందుకే చంద్రబాబు చాలాసార్లు భవనాల అంచనా వ్యయాలను ఇష్టం వచ్చినట్లు పెంచేశారనే ఆరోపణలు ఎప్పటినుండో ఉన్నాయి.

అంచనాలు పెంచినందుకే ముడుపులు అందాయట. చంద్రబాబుకు ముడుపులు ఇచ్చినట్లుగా షాపూర్ కంపెనీకి సంబంధించిన డైరీల్లో కూడా ఉన్నట్లు సమాచారం. 




ఎందుకంటే ఒకసారి ఐటి అధికారులు షాపూర్ కంపెనీల మీద దాడులు చేసి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఆ రికార్డుల్లో ఒకదానిలో చంద్రబాబుకు ముడుపులు ఇచ్చిన విషయం బయటపడిందట. అయితే ఐటి శాఖ ఇచ్చిన నోటీసుకు చంద్రబాబు సమాధానం ఇచ్చినా ఉన్నతాధికారులు సంతృప్తి చెందలేదట . రాబోయే ఎన్నికలకు సంబంధించి బీజేపీతో పొత్తుకు చంద్రబాబు  ఒకవైపు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇంకోవైపు ఐటి శాఖ చంద్రబాబుకు నోటీసులు ఇవ్వటం ఆశ్చర్యంగానే ఉంది. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాయలసీమ : అఖిల నిర్ణయం తీసేసుకున్నారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>