PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp-kcreed75e7f-c2f3-4fc6-a4d6-ec7bdf6b8fae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-bjp-kcreed75e7f-c2f3-4fc6-a4d6-ec7bdf6b8fae-415x250-IndiaHerald.jpgఇంతకీ విషయం ఏమిటంటే గజ్వేలులో పోటీచేయబోతున్న కేసీయార్ కు పోటీగా హుజూరాబాద్ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ రెడీ అవుతున్నారట. ఇక కేసీయార్ పోటీచేయబోయే రెండో నియోజకవర్గం కామారెడ్డిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పోటీ చేయబోతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. అలాగే సిరిసిల్లలో కేటీయార్ పై బండి సంజయ్, సిద్ధిపేటలో హరీష్ రావుపై బూర నర్సయ్య గౌడ్ పోటీకి రెడీ అవుతున్నారట. telangana bjp kcr{#}Gangula Kamalakar;Karimnagar;Mahbubnagar;KCR;MP;MLA;Bharatiya Janata Party;Parliament;Successహైదరాబాద్ : బీఆర్ఎస్-బీజేపీ మధ్య బిగ్ ఫైట్ తప్పదా ?హైదరాబాద్ : బీఆర్ఎస్-బీజేపీ మధ్య బిగ్ ఫైట్ తప్పదా ?telangana bjp kcr{#}Gangula Kamalakar;Karimnagar;Mahbubnagar;KCR;MP;MLA;Bharatiya Janata Party;Parliament;SuccessSat, 02 Sep 2023 09:00:00 GMT



రాబోయే ఎన్నికల్లో రెండుపార్టీల మధ్య బిగ్ ఫైట్ తప్పేట్లు లేదు. గతఎన్నికల్లో ఎప్పుడూ లేనంత స్ధాయిలో రాబోయే ఎన్నికల్లో పోటీ జరగబోతోంది. దానికి కారణం ఏమిటంటే బీజేపీ అగ్రనేతల నిర్ణయమనే చెప్పాలి. ఇంతకీ విషయం ఏమిటంటే బీఆర్ఎస్ లో కేసీయార్ తో కలుపుకుని కీలకమైన మంత్రులపై బీజేపీ స్ట్రాంగ్ క్యాండిడేట్లను పోటీలోకి దింపబోతోందని సమాచారం. దాంతో తెలంగాణాలో అందరి దృష్టి ఒక ఏడెనిమది నియోజకవర్గాలపైనే ఎక్కువగా ఉంటుంది.





ఇంతకీ విషయం ఏమిటంటే గజ్వేలులో పోటీచేయబోతున్న కేసీయార్ కు పోటీగా హుజూరాబాద్ ఎంఎల్ఏ ఈటల రాజేందర్ రెడీ అవుతున్నారట. ఇక కేసీయార్ పోటీచేయబోయే రెండో నియోజకవర్గం కామారెడ్డిలో నిజామాబాద్ ఎంపీ అర్వింద్ పోటీ చేయబోతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. అలాగే సిరిసిల్లలో కేటీయార్ పై బండి సంజయ్, సిద్ధిపేటలో హరీష్ రావుపై బూర నర్సయ్య గౌడ్ పోటీకి రెడీ అవుతున్నారట.





రంగారెడ్డి జిల్లాలో మహేశ్వరం నియోజకవర్గంలో సబితా ఇంద్రారెడ్డికి వ్యతిరేకంగా కొండా విశ్వేశ్వరరెడ్డి, కరీంనగర్ లో గంగుల కమలాకర్ కు వ్యతిరేకంగా గుజ్జుల రామకృష్ణారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గంలో శ్రీనివాసగౌడ్ పై డీకే అరుణ, నిర్మల్ లో ఇంద్రకరణరెడ్డికి వ్యతిరేకంగా మహేశ్వరరెడ్డిని పోటీచేయించాలని కమలంపార్టీ అగ్రనేతలు డిసైడ్ అయ్యారట. కేసీయార్ తో పాటు మంత్రులను ఓడించటమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. మొదటి టార్గెట్ కేసీయార్ అండ్ కోను ఓడించటమే. అది సాధ్యంకాకపోతే కనీసం వాళ్ళని నియోజకవర్గాల్లోనే ఎక్కువరోజులు ఉండేట్లుగా కంట్రోల్ చేయటం రెండో టార్గెట్.





పై నియోజకవర్గాల్లో గెలిస్తే సరి లేకపోతే ఓడిపోయిన కమలనాదులను రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో ఎంపీలుగా పోటీచేయిస్తామని అగ్రనేతలు హామీ ఇచ్చారని పార్టీలో టాక్ నడుస్తోంది. అందుకనే కేసీయార్, మంత్రులపై పోటీచేయబోయే బీజేపీ కీలక నేతలు 15 మందితో మొదటిజాబితా రిలీజవ్వబోతోందని సమాచారం. ఆ తర్వాత వీలువెంబడి మిగిలిన నియోజకవర్గాల్లో అభ్యర్ధులను ప్రకటించేందుకు అగ్రనేతలు కసరత్తు మొదలుపెట్టారు. మరి కేసీయార్ అండ్ కో విషయంలో బీజేపీ అగ్రనేతలు వేసుకున్న ప్లాన్లు ఏ మేరకు సక్సెస్ అవుతాయో చూడాల్సిందే.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

OG గ్లింప్స్ తో అదరగొట్టేస్తున్న పవన్ కళ్యాణ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>