MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgస్టార్ హీరోల సినిమా పై విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు అందుకోవడంలో ఆ సినిమాలకు దర్శకత్వం వహించే దర్శకులు ఏచిన్న పొరపాటు చేసినా ఆ పొరపాటు ఆమూవీ ఫలితం పై తీవ్ర ప్రభావాన్ని చూపించే ఆస్కారం ఉంది. ఇప్పుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’ పరిస్థితి ఇలాగే ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ ‘బ్రో’ తర్వాత పవన్ నుంచి రాబోతున్న స్ట్రెయిట్ మూవీగా ‘ఓజి’ మారడంతో అభిమానుల అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. పవన్ కళ్యాణ్ వీరభిమానులు ఈమూవీ పై పెంచుకున్న అంచనాలతో పవన్ పుట్టినpavankalyan{#}sujeeth;Gangster;kalyan;Cinema;Newsఓజి హైక్ కు సతమతమైపోతున్న సుజిత్ ?ఓజి హైక్ కు సతమతమైపోతున్న సుజిత్ ?pavankalyan{#}sujeeth;Gangster;kalyan;Cinema;NewsFri, 01 Sep 2023 09:00:00 GMTస్టార్ హీరోల సినిమా పై విపరీతమైన అంచనాలు ఉంటాయి. ఆ అంచనాలు అందుకోవడంలో ఆ సినిమాలకు దర్శకత్వం వహించే  దర్శకులు ఏచిన్న పొరపాటు చేసినా ఆ పొరపాటు ఆమూవీ ఫలితం పై  తీవ్ర ప్రభావాన్ని చూపించే ఆస్కారం ఉంది. ఇప్పుడు సుజిత్ దర్శకత్వం వహిస్తున్న ‘ఓజీ’ పరిస్థితి ఇలాగే ఉంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ‘వకీల్ సాబ్’ ‘భీమ్లా నాయక్’ ‘బ్రో’ తర్వాత పవన్ నుంచి రాబోతున్న స్ట్రెయిట్ మూవీగా ‘ఓజి’ మారడంతో  అభిమానుల  అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి.  



పవన్ కళ్యాణ్ వీరభిమానులు ఈమూవీ పై పెంచుకున్న అంచనాలతో  పవన్ పుట్టినరోజునాడు విడుదలకాబోయే టీజర్ గురించి భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ‘ఓజి’ టీజర్ కేవలం 70 సెకన్స్ మాత్రమే ఉంటుంది అన్న లీకులు వస్తున్నాయి. రెండు పవర్ ఫుల్ షాట్లు పెట్టి టైటిల్ కార్డు ఇంట్రడక్షన్ ఇలా అన్ని కలుపుకుని ఆ డెబ్భై సెకండ్ల టీజర్ లో చూపెడతారని తెలుస్తోంది.  



ఈ టీజర్ లో పవన్ చెప్పే డైలాగులు కూడ ఉండవు అని టాక్. కేవలం  వాయిస్ ఓవర్ తో ఎలివేషన్లు వచ్చేలా సుజిత్ ఈటీజర్ ను ప్లాన్ చేసినట్టు లీకులు వస్తున్నాయి. ఇంకా షూటింగ్ చాలా బ్యాలన్స్ ఉన్న పరిస్థితులలో ఈ సినిమాకు సంబంధించిన ఫుటేజ్ ఎక్కవగా  అందుబాటులో లేదు కాబట్టి ఇలా డీఫెరెంట్ గా సుజిత్ ప్రయత్నిస్తున్నాడు అని అంటున్నారు. ఈమూవీ గ్యాంగ్ స్టర్ డ్రామాగా పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే ఈమూవీ కధలో ఒకానొక కాలంలో ముంబైని వణికించిన డాన్ కథ ఆధారంగా తీస్తున్నారని టాక్.  



పవన్ ప్రస్తుతం వారాహి యాత్రలో బిజీ గా ఉన్నప్పటికీ మధ్యలో తన యాత్రకు బ్రేక్ ఇస్తూ ఈమూవీని వేగంగా పూర్తి చేయడానికి తన వంతు  సహకారం ఇస్తున్నట్లు తెలుస్తోంది. ‘సాహొ’ ఇచ్చిన పరాభవం ఈమూవీ సక్సస్  తో బ్యాలెన్స్ చేయాలని సుజిత కష్టడుతున్నాడు అనుకోవాలి..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ‛వార్ 2' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>