TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/actress-reshma-prasad1cf9b76b-d2be-4afa-94da-d6384dce5bb3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/actress-reshma-prasad1cf9b76b-d2be-4afa-94da-d6384dce5bb3-415x250-IndiaHerald.jpgసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీమణులు ఎక్కువగా ఎదుర్కొనే అతి సాధారణ సమస్య క్యాస్టింగ్ కౌచ్.. నీకు ఛాన్స్ ఇస్తే.. మాకేం ఇస్తావ్.. కాంప్రమైజ్ కాకపోతే నీకు అవకాశాలే రావు అంటూ ఇండస్ట్రీలో ఉండే పెద్దలు ఆడవారిని ఇలాంటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎదగాలి అంటే ఇలాంటి సూటి పోటీ మాటలు అడుగడుగునా ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పటికే ఎంతోమంది నటీనటులు ఇటువంటి అడ్డంకుల దాటుకుని ముందుకు వెళ్తున్నారు. ఇక అలాంటి వారిలో బుల్లితెర నటి రేష్మ ప్రసాద్ కూడా ఒకరు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై మాట్ACTRESS; RESHMA PRASAD{#}reshma;Application;Heroine;Cinemaటీవీ: కెరియర్ కోసం నేను కూడా కాంప్రమైజ్ అయ్యా - నటిటీవీ: కెరియర్ కోసం నేను కూడా కాంప్రమైజ్ అయ్యా - నటిACTRESS; RESHMA PRASAD{#}reshma;Application;Heroine;CinemaFri, 01 Sep 2023 02:00:00 GMTసాధారణంగా సినిమా ఇండస్ట్రీలో నటీమణులు ఎక్కువగా ఎదుర్కొనే అతి సాధారణ సమస్య క్యాస్టింగ్ కౌచ్.. నీకు ఛాన్స్ ఇస్తే.. మాకేం ఇస్తావ్.. కాంప్రమైజ్ కాకపోతే నీకు అవకాశాలే రావు అంటూ ఇండస్ట్రీలో ఉండే పెద్దలు ఆడవారిని ఇలాంటి మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. ముఖ్యంగా ఇండస్ట్రీలోకి వచ్చి ఎదగాలి అంటే ఇలాంటి సూటి పోటీ మాటలు అడుగడుగునా ఎదురవుతూనే ఉంటాయి. ఇప్పటికే ఎంతోమంది నటీనటులు ఇటువంటి అడ్డంకుల దాటుకుని ముందుకు వెళ్తున్నారు.

ఇక అలాంటి వారిలో బుల్లితెర నటి రేష్మ ప్రసాద్ కూడా ఒకరు. తాజాగా క్యాస్టింగ్ కౌచ్ పై మాట్లాడిన ఈమె సినిమాలలోనే కాదు సీరియల్స్ లో కూడా కమిట్మెంట్ అడుగుతారని చెప్పుకొచ్చింది. ముఖ్యంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్ అనేది ఇప్పుడు సాధారణ విషయం అయిపోయింది. గదిలోకి రావడానికి కూడా అడ్జస్ట్ అవుతావని చాలా సింపుల్ గా అడిగేస్తున్నారు. అంతేకాదు కొన్ని అప్లికేషన్ ఫామ్స్ లో అయితే ఏకంగా అడ్జస్ట్మెంట్ కి ఒప్పుకుంటున్నావా అని ప్రత్యేకంగా ఒక కాలం కూడా ఏర్పాటు చేయడం జరిగింది.

ఇక ప్రధాన పాత్రలకే కాదు సైడ్ క్యారెక్టర్లు అసలు గుర్తింపు లేని చిన్న చితకా పాత్రలకి కూడా కాంప్రమైజ్ అడుగుతున్నారు. చాలామంది కాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బంది పడుతున్నారు. అప్లికేషన్ ఫామ్ లో అడ్జస్ట్మెంట్ ఒప్పుకోవడం లేదని రాసినా సరే మళ్లీ అదే టాపిక్ తీసుకువచ్చి ఒత్తిడి చేస్తారు.  అంతేకాదు మంచి పాత్ర కోసం, ఫేమ్ కోసం కన్న కలలను సహకారం చేసుకోవడానికి ఆ ఒత్తిడికి లొంగిపోక తప్పదు.  గతంలో నేను కూడా ఆ ఒత్తిడి తట్టుకోలేక కెరియర్ కోసం అడ్జస్ట్మెంట్ కి  ఒప్పుకున్నాను. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏం జరుగుతుందో  అందరికీ తెలియాలి.  తెరపై తమను తాము చూసుకోవాలని ప్రయత్నం చేసే వారికి ఇప్పటికైనా మంచి వాతావరణం కల్పించాలని అనుకుంటున్నాను అంటూ తెలిపింది రేష్మ.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>