Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-sinimapai-vishwak1769a9e3-0900-4f67-9157-bf74cf6796cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/vijay-devarakonda-sinimapai-vishwak1769a9e3-0900-4f67-9157-bf74cf6796cd-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్న హీరోలలో విశ్వక్సేన్ కూడా ఒకరు అని చెప్పాలి. రైటర్ గా, డైరెక్టర్ గా, నటుడిగా, నిర్మాతగా కూడా సత్తా చాటుతూ తన కెరియర్ను తానే నిలబెట్టుకోగలుగుతున్నాడు విశ్వక్సేన్. ఇక ఇటీవల కాలంలో మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్హిట్ లు సాధిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇలా ప్రస్తుతం యంగ్ హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్సేన్.. ఇక ఇప్పుడు ఏకంగా హోస్ట్ గా అవతారం ఎత్తేందుకు సిద్ధం అయ్యాడు. తెలుగు ఓటిటి ఆహా నిర్వVishwak{#}Friday;Reality Show;Manam;Devarakonda;Hero;Press;India;Director;Telugu;september;Cinemaవిజయ్ దేవరకొండ సినిమాపై.. విశ్వక్ సేన్ సెటైర్లు?విజయ్ దేవరకొండ సినిమాపై.. విశ్వక్ సేన్ సెటైర్లు?Vishwak{#}Friday;Reality Show;Manam;Devarakonda;Hero;Press;India;Director;Telugu;september;CinemaFri, 01 Sep 2023 08:00:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్న హీరోలలో విశ్వక్సేన్ కూడా ఒకరు అని చెప్పాలి. రైటర్ గా, డైరెక్టర్ గా, నటుడిగా, నిర్మాతగా కూడా సత్తా చాటుతూ తన కెరియర్ను తానే నిలబెట్టుకోగలుగుతున్నాడు విశ్వక్సేన్. ఇక ఇటీవల కాలంలో మంచి కథలను ఎంచుకుంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్హిట్ లు సాధిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఇలా ప్రస్తుతం యంగ్ హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్సేన్.. ఇక ఇప్పుడు ఏకంగా హోస్ట్ గా అవతారం ఎత్తేందుకు  సిద్ధం అయ్యాడు. తెలుగు ఓటిటి  ఆహా నిర్వహిస్తున్న ఫ్యామిలీ ధమాకా అనే షో ద్వారా ఇక ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యాడు.


 సెప్టెంబర్ నుంచి ప్రతి శుక్రవారం ఈ షో ప్రసారం కాబోతుంది అని చెప్పాలి. ఇక ఇందుకు సంబంధించిన ప్రోమోలు ఇప్పటికే బయటకి కూడా వచ్చాయి. అయితే ఈ రియాల్టీ షో గురించి ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని వెల్లడించడానికి.. ఇటీవలే హైదరాబాదులో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రెస్ మీట్ లో హీరో విశ్వక్సేన్ చేసిన కామెంట్స్ మాత్రం వైరల్ గా మారిపోయాయి అని చెప్పాలి. ప్రస్తుతం హీరోలు అందరూ పాన్ ఇండియా లెవెల్లో సినిమాలను ప్లాన్ చేస్తుంటే.. మీరేమో ఓటిటి పోస్టుగా చేస్తున్నారు. ఇమేజ్ పరంగా మీ అభిప్రాయం ఏంటి అని ఒక రిపోర్టర్ ప్రశ్నించగా ఆసక్తికరమైన సమాధానంచెప్పాడు.


 ఇమేజ్ పరంగా మనం ఎన్నో లెక్కలు వేస్తూ ఉంటాం. అయితే కొన్నిసార్లు పాన్ ఇండియా అంటూ లెక్కలు వేసి వేస్తే అది గల్లి సినిమా అవుతుంది. ఏకంగా 200 కోట్లు 300 కోట్లు కలెక్ట్ చేస్తుంది అని చెప్పుకున్న సినిమా రిలీజ్ అయ్యాక డిజాస్టర్ గా మిగిలిపోతూ ఉంటుంది. అదే సమయంలో ఒక్కోసారి చిన్న సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతూ ఉంటాయి. అయితే పాన్ ఇండియా మూవీస్ గా కూడా గుర్తింపు సంపాదించుకుంటాయి. నా దృష్టిలో అయితే సినిమాలపరంగా ప్లానింగ్ అంటే.. చేసుకుంటూ పోవడమే. అంటూ విశ్వక్సేన్ చెప్పుకొచ్చాడు. అయితే ఈ యంగ్ హీరో ఇండైరెక్టుగా రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా గురించే సెటైర్లు వేసాడు అని అందరూ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన లైగర్ సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది అన్న విషయం తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హృతిక్ రోషన్,ఎన్టీఆర్ ‛వార్ 2' సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>