EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan0eb06e55-718e-4a3d-be59-69e3f5d88376-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan0eb06e55-718e-4a3d-be59-69e3f5d88376-415x250-IndiaHerald.jpgవైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీం సచివాలయ వ్యవస్థ. ఉద్యోగులను నియమించి గ్రామాల్లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపేందుకు జగన్ తీసుకున్న నిర్ణయమే సచివాలయ వ్యవస్థ. దీని ద్వారా ప్రతి సమస్యను పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలని భావించారు. అయితే ఈ వ్యవస్థలో కూడా ఇప్పుడు అవినీతి రాజ్యమేలుతుంది. అయితే సచివాలయానికి ఒక వ్యక్తి వెళ్లి తన భూమి సర్వే పేపర్ ఇవ్వమని అడిగితే తనకున్న భూమి కంటే ఎకరంన్నర ఎక్కువగానే సచివాలయ ఉద్యోగులు రాసిచ్చారు. అయితే ఆ 80 ఏళ్ల వృద్ధుడు నJAGAN{#}CM;Survey;Application;YCP;Jaganఈ వ్యవస్థను దిద్దకపోతే జగన్‌ కొంపముంచుతుంది?ఈ వ్యవస్థను దిద్దకపోతే జగన్‌ కొంపముంచుతుంది?JAGAN{#}CM;Survey;Application;YCP;JaganFri, 01 Sep 2023 13:00:00 GMTవైసీపీ అధికారంలోకి వచ్చాక సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన స్కీం సచివాలయ వ్యవస్థ. ఉద్యోగులను నియమించి గ్రామాల్లో ఉన్న అనేక సమస్యలకు పరిష్కార మార్గం చూపేందుకు జగన్ తీసుకున్న నిర్ణయమే సచివాలయ వ్యవస్థ. దీని ద్వారా ప్రతి సమస్యను పరిష్కరించి ప్రజలకు మేలు చేయాలని భావించారు. అయితే ఈ వ్యవస్థలో కూడా ఇప్పుడు అవినీతి రాజ్యమేలుతుంది.


అయితే సచివాలయానికి ఒక వ్యక్తి వెళ్లి తన భూమి సర్వే పేపర్ ఇవ్వమని అడిగితే తనకున్న భూమి కంటే ఎకరంన్నర ఎక్కువగానే సచివాలయ ఉద్యోగులు రాసిచ్చారు. అయితే ఆ 80 ఏళ్ల వృద్ధుడు నాకున్న భూమి తక్కువని ఇంత ఉండదని చెప్పాడు. కావాలంటే ఆధార్ అనుసంధానం ద్వారా చూడాలని కోరాడు. అయితే ఈయన ఆధార్ నెంబర్ కు వేరే మహిళ భూమి యాడ్ అయి ఉంది.


దీంతో కంగుతిని సచివాలయ ఉద్యోగిని ప్రశ్నిస్తే ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లాలని చెప్పారు. ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లి అడిగితే అక్కడ సచివాలయంలో నే డాటా ఉంటుంది అక్కడికి వెళ్లాలని అన్నారు. ఇలా అంటున్నారని తెలిసిన వ్యక్తిని సంప్రదిస్తే మీ సేవకు వెళ్లి దరఖాస్తు చేయాలని సూచించారు. అయితే ఆ భూమిపై పేరు మార్చాలంటే వీఆర్ఓ మార్చాలని చెప్పాడు. అయితే ఆ వీఆర్ఓకు డబ్బులివ్వకపోతే పని జరగదని అన్నారు. మొత్తం మీద అక్కడ ముగ్గురు ఆధార్ లు మార్చాల్సి వస్తుంది.


మొత్తం వ్యవస్థను నాశనం చేసేశారు. పూర్వం ఊళ్లలో ప్రెసిడెంట్, నాయకులు అంటే కాస్త భయపడేవారు. ఇప్పుడు ఆ భయం కూడా లేకుండా చేస్తున్నారు. సచివాలయాల దగ్గర కూడా పని జరగడం లేదు. అయితే పని కోసం వెళితే ఒకరి మీద ఒకరు పని మాది కాదని తప్పించుకుంటున్నారు. దీన్ని అడ్డుపెట్టుకుని కొంతమంది అక్రమార్కులు డబ్బులు సంపాదించుకుంటున్నారు. దీనిపై వైసీపీ సర్కారు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాకిస్తున్న జవాన్ టికెట్ రేట్లు? ఏంటి దోపిడీనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>