LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/parentscf61e20d-5d20-4676-9746-a33c8399b5af-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/parentscf61e20d-5d20-4676-9746-a33c8399b5af-415x250-IndiaHerald.jpgతల్లిదండ్రులు కష్టపడి తమ బిడ్డల్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుతారు. నానా కష్టాలు పడి పిల్లల జీవితాలు బాగుండాలని పస్తులుండి మరీ సంపాదిస్తారు. చివరకు బిడ్డల్ని, కొడుకుల్ని ప్రయోజకుల్ని చేస్తారు. విదేశాలకు వెళ్లేందుకు డబ్బులు సమకూరుస్తారు. అంతా బాగుండి విదేశాలకు వెళ్లి వారి పిల్లలు స్థిరపడితే ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. కానీ తల్లిదండ్రులు పడిన కష్టాన్ని మాత్రం వారి పిల్లలు మాత్రం ఇట్టే మరిచిపోతున్నారు. కొంచెం మంచి ఉద్యోగం చేతినిండా డబ్బు వచ్చేస్తే చాలు ఇక తమ మించిన వారు ప్రపంచంలో ఎవరూ లేరనిPARENTS{#}prema;District;police;Love;job;Parents;Father;Smart phoneకలికాలం: కని, పెంచిన వాళ్లంటే అంత చులకనా?కలికాలం: కని, పెంచిన వాళ్లంటే అంత చులకనా?PARENTS{#}prema;District;police;Love;job;Parents;Father;Smart phoneFri, 01 Sep 2023 23:00:00 GMTతల్లిదండ్రులు కష్టపడి తమ బిడ్డల్ని ఎంతో అల్లారుముద్దుగా పెంచుతారు. నానా కష్టాలు పడి పిల్లల జీవితాలు బాగుండాలని పస్తులుండి మరీ సంపాదిస్తారు. చివరకు బిడ్డల్ని, కొడుకుల్ని ప్రయోజకుల్ని చేస్తారు. విదేశాలకు వెళ్లేందుకు డబ్బులు సమకూరుస్తారు. అంతా బాగుండి విదేశాలకు వెళ్లి వారి పిల్లలు స్థిరపడితే ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. కానీ తల్లిదండ్రులు పడిన కష్టాన్ని మాత్రం వారి పిల్లలు మాత్రం ఇట్టే మరిచిపోతున్నారు.


కొంచెం మంచి ఉద్యోగం చేతినిండా డబ్బు వచ్చేస్తే చాలు ఇక తమ మించిన వారు ప్రపంచంలో ఎవరూ లేరని విర్రవీగుతున్నారు. అయితే కర్ణాటక రాష్ట్రం బెళగావి జిల్లా చిక్కోడి గ్రామంలో ఒక విషాదకర సంఘటన చోటు చేసుకుంది. మానవత్వం మంట కలిసే ఆ ఘటనతో పోలీసులు కూడా నిర్ఘాంతపోయారు. చిక్కోడిలో రిటైర్డ్ ఆఫీసర్ మాల్ పాండ్ శర్మ అస్వస్థతకు గురయ్యారు. అయితే చివరి క్షణంలో ఉన్న ఆయన్ని పోలీసులు ఆసుపత్రిలో చేర్పించారు.


కాస్త మెరుగు పడ్డాక అతన్ని హోటల్ కు తీసుకెళ్లారు. మళ్లీ అతను అస్వస్థతకు గురై చనిపోయారు. అయితే అతను చనిపోయిన విషయాన్ని శర్మ కూతురుకు తెలియజేశారు. ఆమె ఉద్యోగ రీత్యా విదేశాల్లో స్థిరపడింది. తండ్రి చనిపోయిన విషయాన్ని ఆమెకు చెబితే మీరే తగలెట్టండి.. వీలైతే పూడ్చేయండి నాకేందుకు ఫోన్ చేశారు. నాకు రావడం వీలు కాదు అని కర్కశంగా మాట్లాడి ఫోన్ పెట్టేసింది. శర్మ కొడుకు కూడా ఆఫ్రికాలో స్థిరపడ్డారు.


అతడిని కాంటాక్టు అవుదామనుకున్న పోలీసులకు అతని నెంబర్ కలవకపోవడం కూతురు చేస్తే ఇలాంటి స్పందన వచ్చింది. ఏంటీ మరి ఇంత దారుణంగా ఉండటం ఏమిటని పోలీసులే ఆశ్చర్యపోయారు. చివరకు వారే ఆ వృద్ధుడి అంత్యక్రియలు చేశారు. ఒక్కో సారి మానవ సమాజంలో బంధాలు, బంధుత్వాలు, ఏమోషన్స్ అన్ని సచ్చిపోతున్నాయి. వీలైతే మానవుల మీద ప్రేమ పెంచే సద్గుణాలు నేర్పించాలి. లేకపోతే రాబోయే రోజుల్లో పిల్లలు మరింత కఠినంగా తయారవుతారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో హీటెక్కిస్తున్న రుహాని శర్మ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>