MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh-khan874c6bd9-a22b-4165-82ae-eb3025f185dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sharukh-khan874c6bd9-a22b-4165-82ae-eb3025f185dc-415x250-IndiaHerald.jpgబాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న షారుక్ ఈ ఏడాది 'పఠాన్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 'పఠాన్' వంటి భారీ సక్సెస్ తర్వాత షారుక్ నటిస్తున్న తాజా చిత్రం 'జవాన్'. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ తో పాటు తమిళ, తెలుగు భాషల్లో ఈ Sharukh Khan{#}Siddharth Anand;Hyderabad;Press;Kollywood;Hindi;netizens;Chitram;Badshah;News;Event;Telugu;Cinema;atlee kumar;september;Successతెలుగులో మాట్లాడి అదరగొట్టిన షారుక్ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో!తెలుగులో మాట్లాడి అదరగొట్టిన షారుక్ ఖాన్.. వైరల్ అవుతున్న వీడియో!Sharukh Khan{#}Siddharth Anand;Hyderabad;Press;Kollywood;Hindi;netizens;Chitram;Badshah;News;Event;Telugu;Cinema;atlee kumar;september;SuccessFri, 01 Sep 2023 20:39:43 GMTబాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కి ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ తో సతమతమవుతున్న షారుక్ ఈ ఏడాది 'పఠాన్' సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద 1000 కోట్లు కలెక్ట్ చేసి సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. 'పఠాన్' వంటి భారీ సక్సెస్ తర్వాత షారుక్ నటిస్తున్న తాజా చిత్రం 'జవాన్'. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ తో పాటు తమిళ, తెలుగు భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది. 

ఇక తాజాగా చెన్నైలో సినిమా ఆడియో లాంచ్ ఈవెంట్ కూడా గ్రాండ్ గా జరిగింది. ఇక ఇదిలా ఉంటే 'జవాన్' విడుదల సందర్భంగా షారుక్ కు సంబంధించిన పాత వార్తలు ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ లోకి వస్తున్నాయి. ముఖ్యంగా గతంలో షారుక్ తెలుగులో మాట్లాడిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆయన నటించిన 'జీరో' మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమయంలో షారుక్ మాట్లాడిన వీడియో ఇది. 2018లో 'జీరో' సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చెన్నైలో జరిగిన ఓ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు షారుక్ ఖాన్. ఈ ప్రెస్ మీట్ లో హైదరాబాద్కు చెందిన జర్నలిస్ట్ షారుక్ ని ఓ ప్రశ్న అడిగారు.

ఆ సమయంలో హైదరాబాద్ స్లాంగ్ లో మాట్లాడిన ఆయన, తర్వాత బాగున్నారా? అని విలేకరి అడగగా.. బాగున్నాను అని తెలుగులో బదులిచ్చాడు. అలాగే 'నా పేరు షారుక్ ఖాన్' అంటూ తెలుగులో మాట్లాడి అక్కడున్న అందరినీ ఆకట్టుకున్నాడు. షారుక్ అలా వచ్చి రాని తెలుగులో మాట్లాడటంతో ప్రెస్ మీట్ లో పాల్గొన్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వేశారు. 2018 లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు మళ్లీ నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. దీంతో ఈ వీడియోని చూసిన నెటిజన్స్ 'షారుక్ తెలుగులో భలే మాట్లాడుతున్నాడు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు.ఇక సెప్టెంబర్ 7న విడుదలవుతున్న 'జవాన్' షారుక్ కి ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఎద అందాలతో హీటెక్కిస్తున్న రుహాని శర్మ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>