PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-lokesh-pawan-ys-rajareddyb736e84c-300d-41de-8c10-1a1e3e42c6aa-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-lokesh-pawan-ys-rajareddyb736e84c-300d-41de-8c10-1a1e3e42c6aa-415x250-IndiaHerald.jpgకారణం ఏమిటంటే పై ముగ్గురికి రాజారెడ్డి అంటే చాలా ఇష్టంలాగుంది. తమ మనసంతా రాజారెడ్డి రాజ్యాంగం అమలుపై పెట్టుకుని ఆరోపణలను మాత్రం జగన్ మీద చేస్తున్నారు. కొడాలినాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని కట్ డ్రాయర్ మీద పరిగెట్టిస్తానని, మోకాళ్ళపైన కూర్చోబెతానని, ఉచ్చపోయిస్తామని, చంపేస్తామని, జైళ్ళల్లో పెడతామని, బట్టలూడదీసి తరిమి తరిమి కొడతామని తరచూ చెబుతున్నది ఎవరు ?chandrababu lokesh pawan ys rajareddy{#}Lokesh;Jagan;Nara Lokesh;Yevaru;Lokesh Kanagaraj;Reddy;Redఅమరావతి : రాజారెడ్డి రాజ్యాంగమంటే అంతిష్టమా ?అమరావతి : రాజారెడ్డి రాజ్యాంగమంటే అంతిష్టమా ?chandrababu lokesh pawan ys rajareddy{#}Lokesh;Jagan;Nara Lokesh;Yevaru;Lokesh Kanagaraj;Reddy;RedFri, 01 Sep 2023 03:00:00 GMT



రాజారెడ్డి రాజ్యాంగం అంటే నారా లోకేష్ కు చాలా ఇష్టంలాగుంది. అందుకే పదేపదే రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం అంటు కలవరిస్తున్నారు. జంగారెడ్డి గూడెంలో నిర్వహించిన సభలో మాట్లాడుతు రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగానికి బదులుగా రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని ఆరోపించారు. నిజానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అమలవుతున్నది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే. కానీ రాజారెడ్డి రాజ్యాంగం అమలవుతోందని చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, లోకేష్ తో పాటు తమ్ముళ్ళు, ఎల్లోమీడియా పదేపదే ప్రచారం చేస్తున్నారు. తన తాత రాజారెడ్డి గురించి జగన్ ఒక్కసారి ఎక్కడా ప్రస్తావించలేదు. అలాంటిది వీళ్ళముగ్గురు కొన్ని వందలసార్లు రాజారెడ్డిని తలచుకునుంటారు .





కారణం ఏమిటంటే పై ముగ్గురికి రాజారెడ్డి అంటే చాలా ఇష్టంలాగుంది.  తమ మనసంతా రాజారెడ్డి రాజ్యాంగం అమలుపై పెట్టుకుని ఆరోపణలను మాత్రం జగన్ మీద చేస్తున్నారు. కొడాలినాని, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డిని కట్ డ్రాయర్ మీద పరిగెట్టిస్తానని, మోకాళ్ళపైన కూర్చోబెతానని, ఉచ్చపోయిస్తామని, చంపేస్తామని, జైళ్ళల్లో పెడతామని, బట్టలూడదీసి తరిమి తరిమి కొడతామని తరచూ చెబుతున్నది ఎవరు ?





నేతలందరి పేర్లను రెడ్ బుక్ లో నోట్ చేసుకుంటున్నామని, అధికారుల పేర్లను రాసుకుంటున్నామని తాము అధికారంలోకి రాగానే ఏ ఒక్కరినీ వదిలిపెట్టమని వార్నింగుల మీద వార్నింగులిస్తున్నది ఎవరు ? వీళ్ళమాటలు, వార్నింగులు అంబేద్కర్ రాజ్యాంగంలో ఎక్కడున్నాయో చూపగలరా ? తాము రాజారెడ్డి రాజ్యాంగాన్ని అమలు చేయాలని బలంగా కోరుకుంటున్న నేతలు కూడా పైకి జగన్ను ఇదే విషయంలో బురదచల్లేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి ప్రతిపక్షాల్లో ఎవరినీ కొట్టమని, చంపమని, కట్ డ్రాయర్ మీద నిలబెట్టాలని, చంపేస్తానని, మోకాళ్ళపై నిలబెడతానని వార్నింగులివ్వలేదు.





అంటే అధికారంలో ఉన్న జగనేమో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారు. కానీ ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు, పవన్, లోకేష్ మాత్రం రాజారెడ్డి రాజ్యాంగాన్నే నమ్ముకున్నట్లున్నారు. అందుకనే రాజారెడ్డి రాజ్యంగం అంటు పదేపదే కలవరిస్తున్నారు. అసలు రాజారెడ్డి రాజ్యాంగం అంటే ఏమిటో కూడా ఎవరికీ తెలీదు. వీళ్ళ ముగ్గురే రాజారెడ్డిని జగన్ కన్నా ఎక్కువగా తలచుకుంటున్నారు. చూస్తుంటే వీళ్ళకి రాజారెడ్డి అంటే చాలా ప్రేమున్నట్లు అర్ధమవుతోంది.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌ట్యాప్‌లు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>