MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే వెంటనే అందరూ రెహమాన్ పేరు చెప్పేవారు. అయితే ఇప్పుడు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రి లో అనిరుధ్ పేరు మారుమ్రోగి పోతోంది. ‘జైలర్’ సినిమాతో అనిరుధ్ మ్యానియా మరింత పెరిగిపోయింది. ఈసినిమా సాధించిన ఘనవిజయంలో అనిరుధ్ కు కూడ ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఈమూవీని తన బ్యాగ్రౌండ్ స్కోర్ పాటలతో అతను ఎలివేట్ చేసి బ్లాక్‌ బస్టర్‌ను చేశాడంటూ అతడి పైప్రశంసలు వస్తున్నాయి. సెప్టెంబర్ లో విడుదలకాబోతున్న ‘జవాన్’ తో అనిరుధ్ మ్యానియా మరింత పెరిగే ఆస్కారం ఉంది అన్నఅNAGACHAITANYA{#}chandu;Geetha Arts;Wanted;Chaitanya;Yuva;kirti;Director;News;Indian;Naga Chaitanya;september;Heroine;Cinemaనాగచైతన్యకు బ్రేక్ ఇవ్వబోతున్న అనిరుధ్ !నాగచైతన్యకు బ్రేక్ ఇవ్వబోతున్న అనిరుధ్ !NAGACHAITANYA{#}chandu;Geetha Arts;Wanted;Chaitanya;Yuva;kirti;Director;News;Indian;Naga Chaitanya;september;Heroine;CinemaFri, 01 Sep 2023 13:09:26 GMTఇండియాలో మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే వెంటనే అందరూ రెహమాన్ పేరు చెప్పేవారు. అయితే ఇప్పుడు ఇండియన్ ఫిలిమ్ ఇండస్ట్రి లో అనిరుధ్ పేరు మారుమ్రోగి పోతోంది. ‘జైలర్’ సినిమాతో అనిరుధ్ మ్యానియా మరింత పెరిగిపోయింది. ఈసినిమా సాధించిన ఘనవిజయంలో అనిరుధ్ కు కూడ ఎక్కువ మార్కులు  పడుతున్నాయి.  



ఈమూవీని తన బ్యాగ్రౌండ్ స్కోర్ పాటలతో అతను ఎలివేట్ చేసి బ్లాక్‌ బస్టర్‌ను చేశాడంటూ అతడి పైప్రశంసలు వస్తున్నాయి. సెప్టెంబర్ లో విడుదలకాబోతున్న ‘జవాన్’ తో  అనిరుధ్ మ్యానియా మరింత పెరిగే ఆస్కారం ఉంది అన్నఅంచనాలు వస్తున్నాయి. ప్రస్తుతం ఇతడికి  ఏర్పడిన క్రేజ్ తో చాలమంది దర్శక నిర్మాతలు అనిరుధ్‌ ను తమ సినిమాలోకి తీసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ అత్యంత భారీ పారితోషికాలు ఆఫర్ చేస్తున్నారు.



అయితే ఇప్పటికే చాలా బిజీగా ఉన్న అనిరుధ్ అంత ఈజీగా కొత్త  సినిమాలను  ఒప్పుకోవడంలేదు అన్నవార్తలు వస్తున్నాయి. ఇలాంటి  పరిస్థితుల మధ్య అనిరుధ్‌ నాగచైతన్య కొత్త సినిమా కోసం ఒప్పించినట్లుగా  వస్తున్న వార్తలు విని ఇండస్ట్రి వర్గాలు  షాక్ అవుతున్నాయి. ఒక ఫిషర్ మ్యాన్ బయోగ్రఫీ ఆధారంగా తెరకెక్కబోతున్న ఈచిత్రాన్ని యువ దర్శకుడు చందు మొండేటి  దర్శకతీయం వహిస్తున్న విషయం తెలిసిందే.  



గీతా ఆర్ట్స్ బేనర్లో ఈమూవీని భారీ బడ్జెట్ తో తీస్తున్నారు.  కీర్తి సురేష్‌ హీరోయిన్ ఎంపిక అయింది అంటున్నారు. ఒకవైపు భారీ సినిమాలు చేస్తున్న అనిరుధ్ నాగచైతన్య సినిమాకు ఓకె చేయడంతో ఈమూవీ షూటింగ్ ప్రారంభయం కాకుండానే అంచనాలు పెరిగి పోతున్నాయి. ఈమూవీ అనిరూత్ కు బాగా నచ్చి ఉండవచ్చు అన్న అభిప్రాయాలు కూడ వ్యక్తం అవుతున్నాయి. గతంలో అనిరుధ్ ‘జెర్సీ’ ‘గ్యాంగ్ లీడర్’ లాంటి మిడ్ రేంజ్ సినిమాలకు కూడ అతను అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన నేపధ్యంలో చైతన్య కొత్త సినిమాకు కూడ మంచి ట్యూన్స్ ఇవ్వగలిగితే నాగచైతన్య కోరుకుంటున్న ప్రేక అతడికి వచ్చి తీరుతుంది అని అంటున్నారు..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాకిస్తున్న జవాన్ టికెట్ రేట్లు? ఏంటి దోపిడీనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>