NRIpraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/homw6ca66a81-4c16-4ed3-8670-8282dafd5c60-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/nri/auto_videos/homw6ca66a81-4c16-4ed3-8670-8282dafd5c60-415x250-IndiaHerald.jpg12 ఏళ్లు శ్రమించి ఒక వ్యక్తి భూగర్భంలో మేడ కట్టాడు. అదెలానో ఈ స్టోరీలో మీరే చూడండి. ఒక మేడ కట్టాలంటే పెద్ద విషయం కాదు. కానీ అదే మేడని భూగర్భంలో కట్టడం అంటే మాములు విషయం కాదు. అది కూడా ఎంత మంది అని ఆలోచిస్తున్నారేమో, ఎంతో మంది కాదు ఒక్కడే శ్రమించి ఈ మేడని కట్టాడు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయీకి చెందిన ఇర్ఫాన్‌ అలియాస్‌ పప్పుబాబా ఎవ్వరి సహాయం లేకుండా ఒక్కడే కస్టపడి భూగర్భంలో రెండంతస్తుల మేడ కట్టాడు. అంతేకాదు ఈ మేడని ఎలా కట్టాడో తెలుసా? ఈ ఇంటిని తన కుటుంబానికి జీవనాధారమైన పొలంలోని మట్టితో నిర్మించHomw{#}Father;House12 ఏళ్లు శ్రమించి భూగర్భంలో మేడ కట్టాడు?12 ఏళ్లు శ్రమించి భూగర్భంలో మేడ కట్టాడు?Homw{#}Father;HouseFri, 01 Sep 2023 14:15:00 GMT12 ఏళ్లు శ్రమించి ఒక వ్యక్తి భూగర్భంలో మేడ కట్టాడు. అదెలానో ఈ స్టోరీలో మీరే చూడండి. ఒక మేడ కట్టాలంటే పెద్ద విషయం కాదు. కానీ అదే మేడని భూగర్భంలో కట్టడం అంటే మాములు విషయం కాదు. అది కూడా ఎంత మంది అని ఆలోచిస్తున్నారేమో, ఎంతో మంది కాదు ఒక్కడే శ్రమించి ఈ మేడని కట్టాడు.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని హర్దోయీకి చెందిన ఇర్ఫాన్‌ అలియాస్‌ పప్పుబాబా ఎవ్వరి సహాయం లేకుండా ఒక్కడే కస్టపడి భూగర్భంలో రెండంతస్తుల మేడ కట్టాడు. అంతేకాదు ఈ మేడని ఎలా కట్టాడో తెలుసా? ఈ ఇంటిని తన కుటుంబానికి జీవనాధారమైన పొలంలోని మట్టితో నిర్మించడం విశేషం. అసలు ఈ ఇర్ఫాన్ ఎవరు, ఎలా కట్టాడో ఇప్పుడు చూద్దాం. 2010లో ఇర్ఫాన్ తండ్రి మరణించారు. దీంతో అప్పటినుంచే ఇర్ఫాన్ కి కష్టాలు మొదలయాయ్యి. ఇర్ఫాన్ ఢిల్లీలో పనిచేసేవాడు. గ్రామానికి తిరిగి వచ్చి ఎన్నికల్లో కూడా పోటీచేశాడు. అయితే ఈ ఎన్నికల్లో ఓడిపోయాడు కూడా. ఓడిపోయాడని నిరాశతో గ్రామానికి దూరం కూడా అయ్యాడు. ఎలాగైనా ఇల్లు కట్టాలని మళ్ళీ తిరిగివచ్చాడు.

అనుకున్నట్టే 2011 లో ఇంటి నిర్మాణాన్ని మొదలు పెట్టాడు. ఇర్ఫాన్‌ ఖుర్పా (చిన్న పార లాంటిది) సాయంతో పాతకాలంలో మాదిరిగా అండాకారంలో ఇంటిగోడలను చెక్కాడు. భోజనానికి మాత్రమే ఇంటికి వెళ్లి తినివచ్చేవాడు. ఎలాగైనా పట్టుదలతో తాను అనుకున్నట్టు ఇంటిని నిర్మించాడు. ప్రార్థన మందిరం, డ్రాయింగ్‌ రూం.. ఇలా అన్ని సదుపాయాలు ఉండేలా 11 గదులతో ఈ ఇంటిని నిర్మించాడు. ఎవ్వరి సహాయం లేకుండా ఒక్కడే 12 ఏళ్ళు ఈ ఇల్లు కోసం శ్రమించాడు. 12 ఏళ్ళ తరువాత ఈ ఇంటిని చూసినవారందరు షాక్ అవుతున్నారు. అంత అద్భుతంగా ఇర్ఫాన్ ఈ ఇంటిని నిర్మించాడు. ఈ ఇంటిని చూసిన గ్రామస్థులు ఇర్ఫాన్ ని చూసి మెచ్చుకుంటున్నారు. ఎంతో మంది కలిసి చేయాల్సిన పనిని ఒక్కడే శ్రమించి సాధించడంతో నెటిజన్లు అభినందిస్తున్నారు. ఇప్పుడు ఆ ఇంటి ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి. అద్భుతంగా ఉన్న ఈ ఇంటి ఫోటోని మీరు కూడా చూసేయండి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

షాకిస్తున్న జవాన్ టికెట్ రేట్లు? ఏంటి దోపిడీనా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>