LifeStyleChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/love336a0017-305f-4ac2-94bc-7826ed9c1cad-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/love336a0017-305f-4ac2-94bc-7826ed9c1cad-415x250-IndiaHerald.jpgమహిళలు తమ భర్తతోనే ఉండాలని, అదే సమయంలో అత్తమామాల నుంచి వేరుపడి జీవించాలని కోరితే ఆ మహిళకు భర్త విడాకులు ఇవ్వొచ్చని ఇటీవల ఓ కోర్టు తేల్చి చెప్పింది. సరైన కారణాలు లేకుండా భర్తతో పదే పదే అత్తమామాలతో వేరుగా ఉండాలని కోరుకోవడం క్రూరత్వం కిందకు వస్తుందని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఓ జంటకు విడాకులు మంజూరు చేస్తూ.. పాశ్చాత్య దేశాల మాదిరిగా పెళ్లి కాగానే కొడుకు తల్లిదండ్రులను విడిచి వేరుగా రావడానికి వీలు కాదని తేల్చి చెప్పింది. మేజర్ కాగానే పెళ్లి అయిపోగానే తల్లిదండ్రులను వదిలేయడం పాశ్LOVE{#}prema;Culture;Husband;Indians;marriage;Wife;Love;meena;Delhi;courtఅత్త, మామ వద్దు.. మొగుడు ఒక్కడే కావాలి?అత్త, మామ వద్దు.. మొగుడు ఒక్కడే కావాలి?LOVE{#}prema;Culture;Husband;Indians;marriage;Wife;Love;meena;Delhi;courtThu, 31 Aug 2023 07:00:00 GMTమహిళలు తమ భర్తతోనే ఉండాలని, అదే సమయంలో అత్తమామాల నుంచి వేరుపడి జీవించాలని కోరితే ఆ మహిళకు భర్త విడాకులు ఇవ్వొచ్చని ఇటీవల ఓ కోర్టు తేల్చి చెప్పింది. సరైన కారణాలు లేకుండా భర్తతో పదే పదే అత్తమామాలతో వేరుగా ఉండాలని కోరుకోవడం క్రూరత్వం కిందకు వస్తుందని ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది.


ఓ జంటకు విడాకులు మంజూరు  చేస్తూ.. పాశ్చాత్య దేశాల మాదిరిగా పెళ్లి కాగానే కొడుకు తల్లిదండ్రులను విడిచి వేరుగా రావడానికి వీలు కాదని తేల్చి చెప్పింది.  మేజర్ కాగానే పెళ్లి అయిపోగానే తల్లిదండ్రులను వదిలేయడం పాశ్చాత్య దేశాల సంస్కృతి అని, దీన్ని భారతీయులు అనుసరించరని ధర్మాసనం అభిప్రాయం వ్యక్తం చేసింది. జస్టిస్ సురేశ్, జస్టిస్ మీనా బన్సాల్ తో కూడిన ధర్మాసనం  ఈ వ్యాఖ్యలు చేసింది.


వేరు కాపురం కోసం తనను వేధించిన వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా కోర్టు తీర్పు నిచ్చింది. భార్య తన పట్టుదలే నెగ్గాలని 2007 నుంచి దాదాపు 16 సంవత్సరాలుగా పుట్టింటి వద్దే ఉంటుంది. దీంతో ఆ వ్యక్తి కి భార్య నుంచి విడాకులు మంజూరు చేసింది. వివాహాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. వేరు కాపురానికి నో చెప్పిన భర్తతో తాను కూడా ఇక కలిసి జీవించలేనని భార్య కూడా కోర్టుకు తెలిపింది.


ఒక వ్యక్తి తన భార్య కు ఎంత గౌరవం, ప్రేమ ఇస్తాడో అంతే ప్రేమ తల్లిదండ్రులు, తోబట్టువులపై ఉంటుందని, భార్య వచ్చినంతా మాత్రాన వారితో వేరుపడి ఉండాలని కోరుకోవడం సరి కాదని అభిప్రాయం వ్యక్తం చేసింది. వృద్ధాప్యం సమయంలో తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లాలని అనుకోవడం సరికాదని చెప్పింది. అయితే తల్లిదండ్రుల విషయంలో వృద్ధాప్యంలో వారిని చూసుకోవాలని బాధ్యత ఉంటుందని తెలిపింది. కాబట్టి ఈ విషయంలో అతనికి విడాకులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

త్రిష ను పదేపదే టచ్ చేసిన ప్రముఖ నటుడు.. కట్ చేస్తే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>