DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababue7a6d15d-c1a9-4bc7-94b9-abbc11927764-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/chandrababue7a6d15d-c1a9-4bc7-94b9-abbc11927764-415x250-IndiaHerald.jpgగత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం ఏమిటంటే బీజేపీకి తెలుగుదేశం అవసరం ఉందని టీడీపీ అనుకూల ఎనలిస్టులు ప్రచారం చేసుకొచ్చారు. అయితే కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మేం ఎవరితో పొత్తు పెట్టుకోం.. మాకు కావాల్సింది విజయం. తెలంగాణలో ఓంటరిగానే పోరాటం చేస్తాం అని ప్రకటించారు. కానీ టీడీపీ అనుకూల మేధావులు మాత్రం బీజేపీకి కచ్చితంగా టీడీపీ అవసరముందని తెగ ప్రచారం చేసేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ దారుణంగా దెబ్బతింది. 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పCHANDRABABU{#}G Kishan Reddy;Congress;Assembly;Telugu Desam Party;Bharatiya Janata Party;TDP;Andhra Pradesh;CBNబీజేపీతో పొత్తు కోసం బాబు అష్ట కష్టాలు?బీజేపీతో పొత్తు కోసం బాబు అష్ట కష్టాలు?CHANDRABABU{#}G Kishan Reddy;Congress;Assembly;Telugu Desam Party;Bharatiya Janata Party;TDP;Andhra Pradesh;CBNThu, 31 Aug 2023 00:30:00 GMTగత కొన్ని రోజుల నుంచి జరుగుతున్న ప్రచారం ఏమిటంటే బీజేపీకి తెలుగుదేశం అవసరం ఉందని టీడీపీ అనుకూల ఎనలిస్టులు ప్రచారం చేసుకొచ్చారు. అయితే కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో మేం ఎవరితో పొత్తు పెట్టుకోం.. మాకు కావాల్సింది విజయం. తెలంగాణలో ఓంటరిగానే పోరాటం చేస్తాం అని ప్రకటించారు. కానీ టీడీపీ అనుకూల మేధావులు మాత్రం బీజేపీకి కచ్చితంగా టీడీపీ అవసరముందని తెగ ప్రచారం చేసేశారు.


2014 అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ దారుణంగా దెబ్బతింది. 2018 ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుని అధికారం రాకుండా దూరంగా నిలిచిపోయింది. మరి ఇలాంటి తరుణంలో బీజేపీ, టీడీపీ ఎలా పొత్తు పెట్టుకుంటాయి. తెలంగాణలో కనీసం డిపాజిట్ కూడా పొందలేని దుస్థితిలో టీడీపీ చేరిపోయింది. అంతలా క్షేత్ర స్థాయిలో ఓటర్లను పొగోట్టుకుని ఢీలా పడింది. మరి ఇలాంటి తరుణంలో బీజేపీ టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది. తెలంగాణలో అయితే అస్సలు పొత్తు ప్రసక్తే లేదు.


కానీ ఆంధ్రప్రదేశ్ మాత్రం ఓట్లు చీలకుండా బీజేపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉంది. కానీ బీజేపీ అధిష్ఠానం మాత్రం చంద్రబాబును నమ్మేందుకు వెనకాడుతున్నారు. ఎందుకంటే బీజేపీ పై అవిశ్వాస తీర్మానం పెట్టి ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడానికి కారణం కేంద్రంలోని బీజేపీనేనని ప్రజల్లోకి తీసుకెళ్లి ఆ పార్టీని డ్యామేజ్ చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. కానీ దీంతోనే విజయం సాధిస్తానని అనుకుని పొరపాటు పడ్డారు.


ప్రజలు ఈ విషయాన్ని గుడ్డిగా నమ్మకుండా నాలుగు సంవత్సరాలు పొత్తు పెట్టుకుని ఆ తర్వాత ఓడిపోతామనే భయంతోనే ఇలా నాటకాలు ఆడుతున్నారనే విషయం గ్రహించి వైసీపీకి పట్టం కట్టారు. బీజేపీని చిత్తు చిత్తుగా ఓడించారు. దీంతో ఆంధ్రలో కూడా ప్రతిపక్ష పాత్రకే పరిమితం అయింది. దీంతో టీడీపీ అటు బీజేపీకి దూరంగా అధికారం లేకుండా ప్రతిపక్ష పాత్రలో కూర్చోవాల్సి వచ్చింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : చంద్రబాబు మళ్ళీ తిరిగేశారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>