EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan8f3b3148-c1dc-4197-ae26-1dce02c247cc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jagan8f3b3148-c1dc-4197-ae26-1dce02c247cc-415x250-IndiaHerald.jpgతెలుగు మీడియాలో పద్ధతి ప్రకారం.. ఏహ్యభావం కలిగేలా చేయడం ఎల్లో మీడియా నేర్చుకుంది. ప్రస్తుతం మోదీని తక్కువ చేసి చూపించాలి. రాహుల్ గాంధీని గొప్పగా చూపించే ప్రయత్నం మొదలెట్టారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్సాఆర్ లాంటి నాయకులను తక్కువ చేసి చూపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఏకంగా ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచే దించేయగల శక్తిమంతమైన వార్తా కథనాలు ప్రచురించారు. ప్రజల్లోకి ఏదో జరిగిపోతుందని చెప్పడంలో సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం చంద్రబాబును శక్తిమంతుడిగా, జగన్ ను రాక్షసుడిగా చూపించడంలో కూడా విశ్వప్రయత్JAGAN{#}bhavana;Success;NTR;Jagan;CBN;Industry;media;News;rahul;Rahul Sipligunj;Telangana Chief Ministerమోదీ, జగన్‌.. ఏం చేసినా తప్పే?మోదీ, జగన్‌.. ఏం చేసినా తప్పే?JAGAN{#}bhavana;Success;NTR;Jagan;CBN;Industry;media;News;rahul;Rahul Sipligunj;Telangana Chief MinisterThu, 31 Aug 2023 00:00:00 GMTతెలుగు మీడియాలో పద్ధతి ప్రకారం.. ఏహ్యభావం కలిగేలా చేయడం ఎల్లో మీడియా నేర్చుకుంది. ప్రస్తుతం మోదీని తక్కువ చేసి చూపించాలి. రాహుల్ గాంధీని గొప్పగా చూపించే ప్రయత్నం మొదలెట్టారు. గతంలో ఎన్టీఆర్, వైఎస్సాఆర్ లాంటి నాయకులను తక్కువ చేసి చూపించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఏకంగా ఎన్టీఆర్ ను ముఖ్యమంత్రి పదవి నుంచే దించేయగల శక్తిమంతమైన వార్తా కథనాలు ప్రచురించారు. ప్రజల్లోకి ఏదో జరిగిపోతుందని చెప్పడంలో సక్సెస్ అయ్యారు.


ప్రస్తుతం చంద్రబాబును శక్తిమంతుడిగా, జగన్ ను రాక్షసుడిగా చూపించడంలో కూడా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. గంగవరం పోర్టు సమీపంలోని 1100 భూములపై కన్ను పడింది. ఎన్ఏండీసీ జాయింట్ వెంచర్ గా ఉక్కు భూముల కోసం ప్రతిపాదనలు అదానీ కంపెనీ చేసిందని వార్తలు రాశాయి. అయితే  కంపెనీ స్టీల్ ప్లాంట్ కోసం ల్యాండ్ తీసుకున్నారు. ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉండగా దానికి సంబంధించిన వేల ఎకరాల భూమి ఖాళీగా ఉంది.


అయితే ఆ ఖాళీ భూమిని తీసుకుని వేరే కంపెనీ పెట్టాలని అదాని కంపెనీ ఆలోచన చేసింది. అయితే ఇండస్ట్రీ రావాలని చెబుతున్న చంద్రబాబు టీమ్ చివరకు ఇలా ఏదైనా కంపెనీ వచ్చి భూములను కొనాలని చూస్తే మాత్రం అడ్డుపడుతున్నారు. ఇండస్ట్రీలు రాకపోతే తీసుకురాలేదని అంటున్నారు. ఇలా అదానీ లాంటి కంపెనీలు వస్తే ఎందుకిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. చిన్న పరిశ్రమలకు ఇస్తే చోటా మోటా వారికి ఇస్తున్నారని విమర్శిస్తూ కథనాలు రాస్తున్నారు. అయితే చంద్రబాబు ఇక్కడ ఇండస్ట్రీని తీసుకురాలేదు కాబట్టి ఎలాగైన వ్యతిరేకంగా రాయాలని డిసైడ్ అయ్యారు.


ప్రస్తుతం ఎల్లో మీడియా పరిస్థితి ఎలా తయారైందంటే చంద్రబాబు ఏదీ చేసినా ఒప్పు.. అదే ఇతరులు మోదీ, జగన్ లాంటి వారు ఏదీ చేసినా తప్పుగా అభివర్ణిస్తూ ప్రజల్లోకి కథనాలు తీసుకెళ్లేలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా వార్తలు రాయడం వల్ల వచ్చే కంపెనీలు రాకుండా పోతాయనే భావన కూడా లేకుండా ఏకపక్షంగా రాసుకొస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : చంద్రబాబు మళ్ళీ తిరిగేశారా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>