Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boollywood-3a4e4813-7d21-4dd2-b280-ad188dad8145-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/boollywood-3a4e4813-7d21-4dd2-b280-ad188dad8145-415x250-IndiaHerald.jpgకరోలినా బిలావాస్క్....కారిబ్బియన్ ఐలాండ్స్ లో గత ఏడాది జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో కిరీటాన్ని సొంతం చేసుకుంది పోలాండ్ కు చెందిన ఈ సుందరి. ఈ ప్రపంచ సుందరి ప్రస్తుతం కాశ్మీర్ లో పర్యటిస్తోంది. కాశ్మీర్ అందాలకు ఈ ప్రపంచ సుందరి ఫిదా అయిపోయారట. తన కాశ్మీర్ పర్యటన లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ హీరో షా రుఖ్ ఖాన్ పై సంచలన కామెంట్స్ చేసారు. కరోలినా షా రుఖ్ ఖాన్ ను ఉద్దెశించి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. షా రుఖ్ ఖాన్ ఖ్యాతి కేవలం భారత దేశంలోనే కాదు, ప్రపంచమంతా వ్యాపించి ఉంది. సెలబ్రిటీ వరల్డ్Boollywood.{#}Srinagar;Poland;Jammu and Kashmir - Srinagar/Jammu;bollywood;Hanu Raghavapudi;December;2020;Interview;Qualification;Coronavirus;Fidaaఆ స్టార్ హీరోతో నటించాలని ఉంది.. ప్రపంచ సుందరి షాకింగ్ కామెంట్స్?ఆ స్టార్ హీరోతో నటించాలని ఉంది.. ప్రపంచ సుందరి షాకింగ్ కామెంట్స్?Boollywood.{#}Srinagar;Poland;Jammu and Kashmir - Srinagar/Jammu;bollywood;Hanu Raghavapudi;December;2020;Interview;Qualification;Coronavirus;FidaaWed, 30 Aug 2023 18:50:00 GMTకరోలినా బిలావాస్క్....కారిబ్బియన్ ఐలాండ్స్ లో గత ఏడాది జరిగిన మిస్ వరల్డ్ పోటీలలో కిరీటాన్ని సొంతం చేసుకుంది పోలాండ్ కు చెందిన ఈ సుందరి. ఈ ప్రపంచ సుందరి ప్రస్తుతం కాశ్మీర్ లో పర్యటిస్తోంది. కాశ్మీర్ అందాలకు ఈ ప్రపంచ సుందరి ఫిదా అయిపోయారట. తన కాశ్మీర్ పర్యటన లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలీవుడ్ హీరో షా రుఖ్ ఖాన్ పై సంచలన కామెంట్స్ చేసారు. కరోలినా షా రుఖ్ ఖాన్ ను ఉద్దెశించి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం.

షా రుఖ్ ఖాన్ ఖ్యాతి కేవలం భారత దేశంలోనే కాదు, ప్రపంచమంతా వ్యాపించి ఉంది. సెలబ్రిటీ వరల్డ్ లో ఆయన పేరు చాలా మందికి తెలుసు. ఆయనకు ప్రపంచమంతా చాలామంది అభిమానులు కూడా ఉన్నారు. వారిలో మాజీ ప్రపంచ సుందరి కరోలినా బిలావాస్క్ కూడా ఒకరు. ఈమె ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ తనకు షా రుఖ్ ఖాన్ తో కలిసి నటించాలని ఉందని మనసులో మాట బయట పెట్టింది. ఈ కాశ్మీరు ట్రిప్ కారణంగా బాలీవుడ్ డైరెక్టరు సాజిద్ నడియాద్వాల ను కలిసే అవకాశం వచ్చిందని, అలాగే త్వరలో షా రుఖ్ ఖాన్ తో కలిసి ఒక సినిమాలో నటించే అవకాశం కూడా వస్తే బాగుందని అన్నారు కరోలినా.

కరోలినా బిలావాస్క్ 1999 లో జన్మించారు. ఈమె ఒక పోలిష్ మోడల్. ఈమె 2019 లో మిస్ పొలోని కిరీటం గెలుచుకుంది. 2020 లో జరగవలసిన మిస్ వరల్డ్ పోటీలకు అర్హత సాధించింది. కానీ కరోనా కారణంగా ఆ ఏడాది జరగవలసిన ప్రపంచ సుందరి పోటీలు రాదు చేయబడ్డాయి. 2021 లో జరిగిన పోటీలో ఆమె విజేతగా నిలిచింది. కరోలినా ప్రస్తుతం యూయెన్ గుడ్ విల్ అంబాసిడర్ గా ఉన్నారు. 2023 ప్రపంచ సుందరి పోటీలు కాశ్మిర్ లోని శ్రీనగర్ లో ఈ ఏడాది డిసెంబర్ లో జరగనున్నాయి. ఈ పోటీ భారత దేశంలో జరగడం ఇది రెండో సారి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

వాయిదా పడ్డ బాలయ్య బాబు రీ రిలీజ్ మూవీ...!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>