MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood76d05862-e905-41f3-9668-32777ceb333d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood76d05862-e905-41f3-9668-32777ceb333d-415x250-IndiaHerald.jpgఆగస్టు నెల పై టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ పెట్టుకున్న అంచనాలు అన్నీ తలక్రిందులు అయ్యాయి. చిరంజీవి ‘భోళాశంకర్’ వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ సినిమాలు రెండు ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో మెగా అభిమానులకు నిరాశ మిగిలింది. దీనికితోడు ఒక్క రజనీకాంత్ ‘జైలర్’ మినహా మరే సినిమా వైపు సగటు ప్రేక్షకులు కన్నెత్తి చూడకపోవడంతో ఆగష్టు నెల అంతా ఇండస్ట్రీకి నీరసంగా మారింది. ఆగష్టు నెల చివరిలో వచ్చిన ‘ఉస్తాద్’ ‘ప్రేమ్ కుమార్’ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాలతో పాటు వచ్చిన ‘బెదురులంక 2012’ పర్వాలేదని అనిపించినా ఆమూవీకిTOLLYWOOD{#}raghava lawrence;varun tej;Winner;Chiranjeevi;Prabhas;Mass;Tollywood;Industry;ram pothineni;Mister;september;August;Audience;Cinemaసెప్టెంబర్ విజేత పై పెరుగుతున్న అంచనాలు !సెప్టెంబర్ విజేత పై పెరుగుతున్న అంచనాలు !TOLLYWOOD{#}raghava lawrence;varun tej;Winner;Chiranjeevi;Prabhas;Mass;Tollywood;Industry;ram pothineni;Mister;september;August;Audience;CinemaWed, 30 Aug 2023 08:00:00 GMTఆగస్టు నెల పై టాలీవుడ్ ఫిలిమ్ ఇండస్ట్రీ పెట్టుకున్న అంచనాలు అన్నీ తలక్రిందులు అయ్యాయి. చిరంజీవి ‘భోళాశంకర్’ వరుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ సినిమాలు రెండు ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో మెగా అభిమానులకు నిరాశ మిగిలింది. దీనికితోడు ఒక్క రజనీకాంత్ ‘జైలర్’ మినహా మరే సినిమా వైపు సగటు ప్రేక్షకులు కన్నెత్తి చూడకపోవడంతో ఆగష్టు నెల అంతా ఇండస్ట్రీకి నీరసంగా మారింది.



ఆగష్టు నెల చివరిలో వచ్చిన ‘ఉస్తాద్’ ‘ప్రేమ్ కుమార్’ ‘మిస్టర్ ప్రెగ్నెంట్’ సినిమాలతో పాటు వచ్చిన ‘బెదురులంక 2012’ పర్వాలేదని అనిపించినా ఆమూవీకి కూడ కలక్షన్స్ రాలేదు. దీనితో ఆగష్టు నెల అంతా టాలీవుడ్ కు నిరాశ మిగిలింది. దీనితో ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ ఆశలు అన్నీ సెప్టెంబర్ నెల పైనే ఉన్నాయి. ఈనెల ప్రారంభంలో విడుదల కాబోతున్న ‘ఖుషీ’ మూవీతో తిరిగి ఇండస్ట్రీకి కళ వస్తుందని ఆశిస్తున్నారు. ఈమూవీ పై అంచనాలు కూడ బాగా ఉండటంతో ఈమూవీకి భారీ ఓపెనింగ్స్ వచ్చే ఆస్కారం ఉంది.



ఈమూవీ తరువాత వచ్చే వారం విడుదలయ్యే ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ పై కూడ మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఆదేవారంలో విడుదల కాబోతున్న షారూఖ్ ఖాన్ ‘జవాన్’ పై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఆతరువాత వారం వినాయకచవితిని టార్గెట్ చేస్తూ లారెన్స్  ‘చంద్రముఖి 2’ రాబోతోంది. అదే వారం రామ్ బోయపాటి ల ‘స్కంద’ కూడ రాబోతోంది. ఈమూవీ మాస్ హిట్ అవుతుందని ఇండస్ట్రీ వర్గాలు ఆశిస్తున్నాయి.



ఇక ఈనెల చివరిలో ప్రభాస్ ప్రశాంత్ నీల్ ల కలయికలో ‘సలార్’ మూవీ పై అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ప్రభాస్ అభిమానులు ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అవుతుందని ఆశలు పెట్టుకున్నారు. సెప్టెంబర్ లో విడుదల కాబోతున్న ఈసినిమాలలో కనీసం ఏ రెండు సినిమాలు హిట్ అయినా ధియేటర్లు కలకళలాడటం ఖాయం. దీనితో ఈనెల విజేత పై ఇండస్ట్రీ వర్గాలలో విపరీతమైన ఆశక్తి ఉంది..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విజయ్ దేవరకొండ ని టార్గెట్ చేసిన విశ్వక్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>