PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-special-status-modide5a6e4e-5c24-44ff-a690-2f97f488842d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu-special-status-modide5a6e4e-5c24-44ff-a690-2f97f488842d-415x250-IndiaHerald.jpgఏపీకి ప్రత్యేకహోదా రాకపోవటానికి అసలు కారణాన్ని కనుక్కుందట. ఇంతకీ ఆ కారణం ఏమిటంటే రెవిన్యుశాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న రజత్ భార్గవట. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ప్లానింగ్ కమీషన్ మీటింగుకు రజత్ హాజరుకాకపోవటంతో ఏపీకి ప్రత్యేకహోదా పోయిందట. ఎల్లమీడియా ఎంత కన్వీనియంటుగా ఒక ఐఏఎస్ అధికారిమీదకి తోసేసిందో ఆశ్చర్యంగా ఉంది. ప్రత్యేకహోదా రాకపోవటానికి చంద్రబాబు కారణం కాదు రజత్ భార్గవే అని ఇపుడు అందరినీ నమ్మించాలని ప్రయత్నిస్తోంది. chandrababu special status modi{#}CBN;ashok;rajath;Narendra Modi;U Turn;Jagan;Government;Reddy;TDP;Andhra Pradeshఅమరావతి : హోదా పాపం చంద్రబాబుది కాదా ?అమరావతి : హోదా పాపం చంద్రబాబుది కాదా ?chandrababu special status modi{#}CBN;ashok;rajath;Narendra Modi;U Turn;Jagan;Government;Reddy;TDP;Andhra PradeshTue, 29 Aug 2023 05:00:00 GMT


ప్రత్యేకహోదా సాదనలో చంద్రబాబునాయుడు ఫెయిలయ్యారు. ఇందులో రెండో మాటకు తావులేదు. విభజన హామీలను అమలుచేయాలని నరేంద్రమోడీ అనుకోలేదు. హామీలన్నింటినీ మోడీ ప్రభుత్వం తుంగలో తొక్కేసింది. అప్పట్లో మోడీ ప్రభుత్వం చెప్పినట్లుగా చంద్రబాబు తలాడించారు. హోదా ఇచ్చేది లేది అంతకన్నా ఘనమైన ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అంటే అందుకు సరేనని చెప్పి చంద్రబాబు సంతకం చేసింది వాస్తవం. దాని దెబ్బకు చంద్రబాబు ఇమేజి ఎంత డ్యామేయ్యిందో అందరికీ తెలిసిందే.





ఇదే సమయంలో ప్రత్యేకహోదా కోసం జగన్మోహన్ రెడ్డి డిమాండ్లు మొదలుపెట్టి, ఆందోళనలు చేసి, ఏపీ భవన్లో ఎంపీలతో  నిరాహార దీక్ష చేయించారు. ఎన్నికల్లో జగన్ కు ఎక్కడ లబ్దికలుగుతుందో అని వెంటనే చంద్రబాబు ప్రత్యేకప్యాకేజీ కాదు హోదాయే కావాలని యూటర్న్ తీసుకున్నది అందరికీ తెలిసిన నిజం. ఇలా చాలాసార్లు యూటర్న్ లు తీసుకున్నారు కాబట్టే చంద్రబాబుకు యూటర్న్ బాబు అనే నిక్ నేమ్ స్ధిరపడిపోయింది. అంతా అయిపోయిన తర్వాత ఇపుడు తీరిగ్గా ఎల్లోమీడియా ఒక పరిశోధన జరిపిందట.





ఏపీకి ప్రత్యేకహోదా రాకపోవటానికి అసలు కారణాన్ని కనుక్కుందట. ఇంతకీ ఆ కారణం ఏమిటంటే రెవిన్యుశాఖలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి హోదాలో పనిచేస్తున్న రజత్ భార్గవట. రాష్ట్ర విభజన సమయంలో జరిగిన ప్లానింగ్ కమీషన్ మీటింగుకు రజత్ హాజరుకాకపోవటంతో ఏపీకి ప్రత్యేకహోదా పోయిందట.  ఎల్లమీడియా ఎంత కన్వీనియంటుగా ఒక ఐఏఎస్ అధికారిమీదకి తోసేసిందో ఆశ్చర్యంగా ఉంది. ప్రత్యేకహోదా రాకపోవటానికి చంద్రబాబు కారణం కాదు రజత్ భార్గవే అని ఇపుడు అందరినీ నమ్మించాలని ప్రయత్నిస్తోంది.





ప్రత్యేకహోదా అన్నది రాజకీయ నిర్ణయం. ఒక మీటింగుకు రజత్ హాజరుకాలేదంటే అక్కడితో రాష్ట్ర తలరాత మారిపోతుందా ? మరి చంద్రబాబు ఏమిచేస్తున్నట్లు ? మిగిలిన సీనియర్ ఐఏఎస్ అధికారులంతా ఏమిచేస్తున్నట్లు ? కేంద్రమంత్రులుగా పనిచేసిన టీడీపీ ఎంపీలు అశోక్ గజపతిరాజు, సుజనాచౌధరి ఏమిచేస్తున్నారు ? ప్రత్యేకహోదాను మోడీ ఇవ్వదలచుకోలేదన్నది వాస్తవం. ఈ విషయంలో చంద్రబాబు ఫెయిలయ్యారన్నది ఇంకా వాస్తవం. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని హోదా అంశం మళ్ళీ చర్చకు వస్తుందని, చంద్రబాబు సమాధానం చెప్పుకోవాల్సొస్తుందన్న భయంతోనే ఆ పాపాన్ని రజత్ భార్గవ్ మీదకు తోసేసింది ఎల్లోమీడియా. కొద్దిరోజుల పాటు జనాలంతా నమ్మేట్లుగా ఇదే విషయాన్ని ప్రచారం చేస్తారు. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : హోదా పాపం చంద్రబాబుది కాదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>