PoliticsVijayaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/why-did-nara-lokesh-meet-the-governor-suddenly82d2ed39-971a-48b7-999e-b05ec77ff2f3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/why-did-nara-lokesh-meet-the-governor-suddenly82d2ed39-971a-48b7-999e-b05ec77ff2f3-415x250-IndiaHerald.jpgఇదే సమయంలో టీడీపీకి 44.99 శాతం ఓట్లొస్తాయట. అంటే నారా లోకేష్ . 84 శాతం ఓట్లతో గెలుస్తారని పొలిటికల్ క్రిటిక్ తేల్చింది. నియోజర్గంలో అర్బన్ ఓటర్లు 1,47,904 అయితే రూరల్ ఓటర్లు 1,20,525 మంది ఉన్నారు. లోకేష్ గెలుస్తారనేందుకు ఏమిటి హేతువు అంటే యావగళం పేరుతో పాదయాత్ర చేస్తుండటం, రాజధాని అమరావతే అని పదేపదే చెబుతుండటం, 2019లో ఓడిపోయిన సానుభూతి తదితరాల కారణంగా చాలా తక్కువ మార్జిన్ తో అయినా లోకేష్ గెలుస్తారని సర్వేలో బయటపడిందట. lokesh mangalagiri jagan{#}Nara Lokesh;Capital;Mangalagiri;Alla Ramakrishna Reddy;YCP;Government;Reddy;Survey;Lokesh;Lokesh Kanagaraj;Yevaruఅమరావతి : లోకేష్ గెలుపుపై సర్వే రిపోర్టుఅమరావతి : లోకేష్ గెలుపుపై సర్వే రిపోర్టుlokesh mangalagiri jagan{#}Nara Lokesh;Capital;Mangalagiri;Alla Ramakrishna Reddy;YCP;Government;Reddy;Survey;Lokesh;Lokesh Kanagaraj;YevaruTue, 29 Aug 2023 03:00:00 GMT


రాబోయే ఎన్నికల్లో మంగళగిరి నుండి పోటీచేయబోతున్న నారా లోకేష్ గెలుపు ఖాయమా ? అవుననే చెబుతోంది ఒక సర్వే. నిజానికి లోకేష్ గెలుపుపై పార్టీలోనే నమ్మకంలేదు. అందుకనే మంగళగిరిలో పోటీచేసే విషయమై ఆలోచించుకోమని పార్టీలోని సీనియర్లు పదేపదే సలహా ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ‘పొలిటికల్ క్రిటిక్’ అనే సంస్ధ ఒక సర్వే జరిపింది. ఆ సర్వే వివరాల ప్రకారం వైసీపీకి 44.15 శాతం ఓట్లు వస్తాయని తేలిందట.





ఇదే సమయంలో టీడీపీకి 44.99 శాతం ఓట్లొస్తాయట. అంటే నారా లోకేష్ . 84 శాతం ఓట్లతో గెలుస్తారని పొలిటికల్ క్రిటిక్ తేల్చింది. నియోజర్గంలో అర్బన్ ఓటర్లు 1,47,904 అయితే రూరల్ ఓటర్లు 1,20,525 మంది ఉన్నారు. లోకేష్ గెలుస్తారనేందుకు ఏమిటి హేతువు అంటే యావగళం పేరుతో పాదయాత్ర చేస్తుండటం, రాజధాని అమరావతే అని పదేపదే చెబుతుండటం,  2019లో ఓడిపోయిన సానుభూతి తదితరాల కారణంగా చాలా తక్కువ మార్జిన్ తో అయినా లోకేష్ గెలుస్తారని సర్వేలో బయటపడిందట.





ఇదే సమయంలో లోకేష్ గెలుపు వైసీపీ అభ్యర్ధి ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయితే మాత్రమేనట. మరి అభ్యర్ధి మారితే పరిస్ధితి ఏమిటి ? మంగళగిరి నుండి ఆళ్ళ స్ధానంలో మురుగుడు హనుమంతరావు, కాండ్రు కమల, గంజి చిరంజీవిలో ఎవరో ఒకరు పోటీచేయబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. ఇంట్రస్టింగ్ పాయింట్ ఏమిటంటే ముగ్గురూ స్ధానికులే. అంతేకాకుండా ముగ్గురూ చేనేత సామాజికవర్గం వాళ్ళే. ఈ నియోజకవర్గంలో చేనేత సామాజికవర్గం ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి.





ఆర్కె కాకుండా పై ముగ్గురిలో ఎవరు పోటీచేసినా ఫలితం మారిపోతుందని కూడా తేలిందట. అభ్యర్ధిని మార్చటాన్ని పక్కనపెట్టేస్తే తన ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలే వైసీపీని గెలిపిస్తాయని  జగన్మోహన్ రెడ్డి చాలా బలంగా నమ్ముతున్నారు. వీటికి అదనంగా రాజధాని ప్రాంతంలో 51 వేలమందికి పంపిణీచేసిన ఇళ్ళపట్టాల మాటేమిటి ? ఈ 51 వేలమందిలో మంగళగిరి నియోజకవర్గంలో సుమారు 25 వేలమంది కొత్తగా ఓటుహక్కును నమోదు చేసుకోబోతున్నారు. ఈ ఓట్లన్నీ వైసీపీకి పడవా ? ఏమో చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.




మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అమరావతి : హోదా పాపం చంద్రబాబుది కాదా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vijaya]]>