Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0dd8eee3-1ce6-4948-83dd-36c497423f7d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood0dd8eee3-1ce6-4948-83dd-36c497423f7d-415x250-IndiaHerald.jpgగత కొంతకాలం నుంచి మెగాస్టార్ అభిమానులందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. దీనికంతటికి కారణం మెగాస్టార్ చిరంజీవి. అభిమానులు కోరుకున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలైతే చేస్తూ ఉన్నారు. కానీ ఇలా చేస్తున్నవన్నీ కూడా రిమేక్ సినిమాలే కావడం గమనార్హం. ఇక రిమేక్ సినిమాలు చిరంజీవికి అస్సలు కలిసి రావడం లేదు. ఏకంగా ఇప్పటివరకు చిరంజీవి చేసిన మూడు రిమెక్ సినిమాలు కూడానే ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి . ఇక వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ తర్వాత ఇటీవలే బోళా శంకర్ తో ప్రేక్షకుల ముందTollywood{#}Chiranjeevi;producer;Producer;shankar;Remake;Audience;Tamil;Tollywood;Telugu;Cinemaచిరంజీవి షాకింగ్ డెసిషన్.. అభిమానులు ఫుల్ హ్యాపీ?చిరంజీవి షాకింగ్ డెసిషన్.. అభిమానులు ఫుల్ హ్యాపీ?Tollywood{#}Chiranjeevi;producer;Producer;shankar;Remake;Audience;Tamil;Tollywood;Telugu;CinemaTue, 29 Aug 2023 09:00:00 GMTగత కొంతకాలం నుంచి మెగాస్టార్ అభిమానులందరూ కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అన్న విషయం తెలిసిందే. దీనికంతటికి కారణం మెగాస్టార్ చిరంజీవి. అభిమానులు కోరుకున్నట్లుగా మెగాస్టార్ చిరంజీవి వరుస సినిమాలైతే చేస్తూ ఉన్నారు. కానీ ఇలా చేస్తున్నవన్నీ కూడా రిమేక్ సినిమాలే కావడం గమనార్హం. ఇక రిమేక్ సినిమాలు చిరంజీవికి అస్సలు కలిసి రావడం లేదు. ఏకంగా ఇప్పటివరకు చిరంజీవి చేసిన మూడు రిమెక్ సినిమాలు కూడానే ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి . ఇక వాల్తేరు వీరయ్య లాంటి సూపర్ హిట్ తర్వాత ఇటీవలే బోళా శంకర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తే ఈ సినిమా కూడా బోల్తా పడింది.


 తమిళ హిట్ మూవీ వేదాలంకు తెలుగు రిమేక్ గా ఈ సినిమా తెరకెక్కింది అన్న విషయం తెలిసిందే. దీంతో మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికైనా రీమేక్ సినిమాలను చేయడం.. ఆపాలని అభిమానులు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. అయితే బోలా శంకర్ ఫ్లాప్ తో అటు చిరంజీవి కూడా రీమేక్స్ సినిమాల విషయంలో కాస్త ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇతర భాషల సినిమాలను రీమేక్ చేయడం విషయంలో మెగాస్టార్ చిరంజీవి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి ఇక రిమేక్ సినిమాల జోలికి పోవద్దు అని చిరంజీవి అనుకుంటున్నారట.


 ఈ విషయం కాస్త ప్రస్తుతం టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇటీవల ఒక నిర్మాత మలయాళ సూపర్ హిట్ సినిమా రీమేక్ రైట్స్ ని పట్టుకుని చిరంజీవిని కలిశారట. అయితే ఇప్పటికే భోళాశంకర్ తో ఫ్లాప్ చవిచూసిన చిరంజీవి.. ఇక మరో రీమేక్ చేయడానికి సిద్ధంగా లేరు. దీంతో ఆ నిర్మాతకు నిర్మొహమాటంగా నో చెప్పేసారట చిరంజీవి. ఇకపై రీమెక్ సినిమాలను చేయను అని నిర్మాతకు చెప్పేశారట. ఇక ఈ విషయం తెలిసి అభిమానుల ఆనందానికైతే అవధులు లేకుండా పోయాయి. ఒకప్పటిలా చిరంజీవి మళ్లీ కొత్త కథలతో ప్రేక్షకులు ముందుకు వస్తే సూపర్ హిట్ సాధించడం ఖాయమని ఎంతో మంది ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

జానీ మూవీ డిజాస్టర్ తర్వాత.. పవన్ కళ్యాణ్ ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>