Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunnyfcc9c2b7-670c-47b9-b71f-c49ef283f0c8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bunnyfcc9c2b7-670c-47b9-b71f-c49ef283f0c8-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారిపోయాడు. దీంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో ఒకడిగా ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇంతటి క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్ ఇంతటి వాడు అవుతాడు అని మాత్రం ఎవ్వరు ఊహించలేదు. ఎందుకంటే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. అల్లు వారి వారసుడిగా మెగా మేనల్లుడు గా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. మొదటి సినిమా విజBunny{#}arya;dil raju;Gangothri;Aryaa;Father;krishna;Allu Arjun;Indian;Hero;India;Telugu;Cinemaనేను బాలేనని.. సినిమా నుంచి తీసేసారు : అల్లు అర్జున్నేను బాలేనని.. సినిమా నుంచి తీసేసారు : అల్లు అర్జున్Bunny{#}arya;dil raju;Gangothri;Aryaa;Father;krishna;Allu Arjun;Indian;Hero;India;Telugu;CinemaMon, 28 Aug 2023 12:05:00 GMTమొన్నటి వరకు తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకడిగా కొనసాగిన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హీరోగా మారిపోయాడు. దీంతో ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలలో ఒకడిగా ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇక ఇంతటి క్రేజ్ సంపాదించిన అల్లు అర్జున్ ఇంతటి వాడు అవుతాడు అని మాత్రం ఎవ్వరు ఊహించలేదు. ఎందుకంటే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన గంగోత్రి సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అల్లు అర్జున్. అల్లు వారి వారసుడిగా మెగా మేనల్లుడు గా హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు.


 మొదటి సినిమా విజయం అయితే సాధించింది. కానీ అల్లు అర్జున్ ను చూసి ఎంతో మంది విమర్శలు చేశారు. ఇతను హీరో ఏంటి బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఎవరైనా హీరో కావచ్చా అని విమర్శలు వచ్చాయి. కానీ ఇప్పుడు హీరో అంటే ఇలాగే ఉండాలి అనే స్థాయికి చేరుకున్నాడు అల్లు అర్జున్. ఇక ఇటీవల జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం కూడా అందుకొని తెలుగు సినీ పరిశ్రమకే గర్వకారణంగా నిలిచాడు. అయితే పెద్ద ఫ్యామిలీ నుంచి వచ్చినప్పటికీ తనకు కూడా అవమానాలు తప్పలేదు అంటూ చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. గంగోత్రి సినిమాకు ముందు తాను పడిన ఇబ్బందులను ఇటీవలే తెలిపాడు.


 నా అరంగేట్రం అంత సాఫీగా జరగలేదు. నా చదువు పూర్తయ్యాక పెద్ద బ్యానర్లో సినిమా ఆఫర్ వచ్చింది. కానీ నేను బాగాలేనని రిజెక్ట్ చేశారు. అప్పుడు నాన్న చిరంజీవి గారు చాలా బాధపడ్డారు. నన్ను పెట్టి సొంతంగా సినిమా తీయాలనుకున్నారు. ఆ సమయంలో రాఘవేంద్రరావు గారి నుంచి గంగోత్రి ప్రపోజల్ వచ్చింది. నాన్న అశ్విని దత్ గారు చిన్ని కృష్ణ గారు అందరు కలిసి ప్రాజెక్టుని సెట్ చేశారు. ఆ తర్వాత నా మొదటి సినిమా గంగోత్రి పెద్ద హిట్ అయింది. కానీ ఆ సినిమా సమయానికి నేను నటుడుగా సిద్ధంగా లేను. అందుకే ఆ సినిమాలో నటన విషయంలో నేను ఫెయిల్ అయ్యాను. ఇక ఆ తర్వాత దిల్ రాజు బ్యానర్ లో ఆర్య సినిమా చేశాను. ఇకపై నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఆర్య తర్వాత ముళ్ల బాటలో నుండి రోడ్డుమీదికి వచ్చా అని గుర్తు చేసుకున్నాడు..



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

'ఈగల్' మూవీ పాటలు గూర్చి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన మేకర్స్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>