SatireChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/moon244abfd0-06d8-4efc-8b0f-1651bc8d746a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/satire/129/moon244abfd0-06d8-4efc-8b0f-1651bc8d746a-415x250-IndiaHerald.jpgచంద్రయాన్ 3 విజయం తర్వాత అందరూ ఆనందంలో మునిగిపోయారు. ముఖ్యంగా దేశంలోని సైంటిస్టుల కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశానికెత్తేశారు. ఇలా చందమామ గురించి ఎన్నో రకాలుగా ఎంతో మంది వివిధ దేశాల ప్రముఖులు, న్యూస్ మీడియా చానళ్లు, ప్రజలు విశేషంగా స్పందించారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఎక్కువ మంది వీక్షించిన కారణంగా రికార్డుల్లో కెక్కింది. అయితే తెలుగులో కవులు, రచయితలు ఇంతకు ముందు ఒక అమ్మాయిని గానీ ఆమె అందాన్ని పొగడాలంటే చందమామా లాంటి చక్కని రూపం అని, చంద్రబింబం వెలుగులా మెరిసిపోతుందని అని రాసేవారు. చంద్రవంకMOON{#}Narendra Modi;Chandrayaan 3;Moon;media;Prime Ministerచందమామ.. మన ఊహలన్నీ అబద్దాలేనా?చందమామ.. మన ఊహలన్నీ అబద్దాలేనా?MOON{#}Narendra Modi;Chandrayaan 3;Moon;media;Prime MinisterMon, 28 Aug 2023 23:00:00 GMTచంద్రయాన్ 3 విజయం తర్వాత అందరూ ఆనందంలో మునిగిపోయారు. ముఖ్యంగా దేశంలోని సైంటిస్టుల కృషిని ప్రధాని నరేంద్ర మోదీ ఆకాశానికెత్తేశారు. ఇలా చందమామ గురించి ఎన్నో రకాలుగా ఎంతో మంది వివిధ దేశాల ప్రముఖులు, న్యూస్ మీడియా చానళ్లు, ప్రజలు విశేషంగా స్పందించారు. చంద్రయాన్ 3 ప్రయోగాన్ని ఎక్కువ మంది వీక్షించిన కారణంగా రికార్డుల్లో కెక్కింది.


అయితే తెలుగులో కవులు, రచయితలు ఇంతకు ముందు ఒక అమ్మాయిని గానీ ఆమె అందాన్ని పొగడాలంటే చందమామా లాంటి చక్కని రూపం అని, చంద్రబింబం వెలుగులా మెరిసిపోతుందని అని రాసేవారు. చంద్రవంక లాంటి నడుము అని కీర్తించేవారు. ఇలా చంద్రుడి మీద పాటలు, మాటలు కీర్తనలు ఎన్నో ఎన్నెన్నో రాశారు. చందమామా అంటే అంత క్రేజీ మరి..


అయితే చంద్రయాన్ 3 సాప్ట్ ల్యాండింగ్ తర్వాత చందమామాపై అన్ని గుంతలు కనిపిస్తున్నాయి. చదునుగా ఎక్కడా కనిపించడం లేదు. ఎందుకు అలా ఉందో ఇప్పటికీ ఎవరికీ తెలియడం లేదు. ల్యాండర్ ల్యాండ్  అయిన చోటు నుంచి రోవర్ దిగి కిందకు వెళ్లిన ప్రాంతం కూడా గుంతలు పడి ఉన్నట్లు తెలిసింది. మరి ఇలాంటి గుంతలు ఎందుకున్నాయి. అసలు గుంతలు ఎలా పడ్డాయి. ఎందుకు పడ్డాయి. అసలు వాతావరణమే లేని ప్లేస్ లో గుంతలకు గల కారణం ఏమిటి?  ఎన్నో ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే చందమామ పైన ఉన్న ప్రగ్యాన్ రోవర్ తన పని చేయాల్సి ఉంది.


అయితే చందమామ ఉపరితలం గరుకుగా ఉండటంతో ఇప్పుడు అందరూ దాన్ని అమ్మాయితో పోల్చవద్దని అంటున్నారు. మొన్నటి వరకు చందమామా లాంటి ముఖం అంటే ఇప్పుడు గతుకులు ఉన్నాయని అంటారేమోనని భయపడుతున్నారు. కానీ చందమామా దూరం నుంచి చూసినంతా అందంగా మాత్రం లేడు. గతుకులు, గుంతలతో గట్టి నేలగా ఉన్నట్లు తెలుస్తుంది. మరి కవులు, రచయితలు ఇప్పుడు తమ అభిప్రాయాలను మార్చుకుని పాటలు , మాటలు రాస్తారో వేచి చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఒంటిమీద బట్టలు లేకుండా మట్టి పూసుకుని ఫోటోలు షేర్ చేసిన పూనమ్ కౌర్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>