Crimepraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/village-e9352551-e16e-4553-97da-77f48b0aeb4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/village-e9352551-e16e-4553-97da-77f48b0aeb4f-415x250-IndiaHerald.jpgనెంబర్ 2 బర్దనారా.....ఇది అస్సాం లోని నల్బరి పట్టణం, గోగ్రాపారా సర్కిల్ లోని ఒక ఊరు. ఈ ఊరు ఒకప్పుడు పంట పొలాలతో, వందలమంది జనం తో కళకళలాడుతూ ఉండేది. ఏళ్ళు గడిచే కొద్దీ ప్రజలు ఒకరి తరువాత ఒకరు ఊరు విడిచి వెళ్లడం మొదలు పెట్టారు. ఒకసారి ఊరు విడిచి వెళ్లిన వారు మళ్ళి తిరిగి రాలేదు. ఇప్పుడు ఈ ఊరిలో కేవలం ఒకే ఒక్క కుటుంబ మిగిలింది. చివరిసారిగా 2011లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం ఈ ఊర్లో 16 మంది ఉండేవారు. కానీ ఇప్పుడు బిమల్ దేక కుటుంబ మాత్రమే ఉంది. ఈ కుటుంబంలో ఐదుగురు ఉన్నారు. బిమల్ దేక, ఆయన భార్య యానిమVillage.{#}prithy;Assam;vidya;electricity;Wife;Telangana Chief Minister;District;vehicles;CM;Populationఒక గ్రామంలో ఒక్కటే కుటుంబం.. కారణం ఏమిటో తెలుసా?ఒక గ్రామంలో ఒక్కటే కుటుంబం.. కారణం ఏమిటో తెలుసా?Village.{#}prithy;Assam;vidya;electricity;Wife;Telangana Chief Minister;District;vehicles;CM;PopulationMon, 28 Aug 2023 11:30:00 GMTనెంబర్ 2 బర్దనారా.....ఇది అస్సాం లోని నల్బరి పట్టణం, గోగ్రాపారా సర్కిల్ లోని ఒక ఊరు. ఈ ఊరు ఒకప్పుడు పంట పొలాలతో, వందలమంది జనం తో కళకళలాడుతూ ఉండేది. ఏళ్ళు గడిచే కొద్దీ ప్రజలు ఒకరి తరువాత ఒకరు ఊరు విడిచి వెళ్లడం మొదలు పెట్టారు. ఒకసారి ఊరు విడిచి వెళ్లిన వారు మళ్ళి తిరిగి రాలేదు. ఇప్పుడు ఈ ఊరిలో కేవలం ఒకే ఒక్క కుటుంబ మిగిలింది. చివరిసారిగా 2011లో జరిగిన జనాభా లెక్కల ప్రకారం ఈ ఊర్లో 16  మంది ఉండేవారు. కానీ ఇప్పుడు బిమల్ దేక కుటుంబ మాత్రమే ఉంది. ఈ కుటుంబంలో ఐదుగురు ఉన్నారు. బిమల్ దేక, ఆయన భార్య యానిమ, వారి ముగ్గురు పిల్లలు నరేన్, దీపాలి, సియుతిలు.

ఈ ఊరికి వెళ్ళటానికి సరైన మార్గం లేదు. వర్షాకాలం లో ఊరంతా వర్షపు నీటితో నిండిపోతుంది. ఆ సమయంలో వారు బయటకు వెళ్లాలంటే పాడవే మార్గం. అందుకే వారు ఒక చిన్న పడవను తయారు చేసుకున్నారు. మిగిలిన కాలంలో నెలంతా చిత్తడిగా, బురద తో నిండి ఉంటుంది. కనీసం ఊరి నుంచి రెండు మైళ్ళ దూరం వెళ్తే గాని వాహనాలు నడవడానికి అనువైన నెల దొరకదు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా ఈ దంపతులు తమ పిల్లలకు సరైన విద్య అందించడంలో రాజి పడలేదు. తమ ఇద్దరు పిల్లలు నరేన్, దీపాలి లు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసారు. సియుతిలు హయ్యర్ సెకండరీ చదువుతోంది. ఈ గ్రామానికి కరెంటు సదుపాయం కూడా లేదు. పిల్లలంతా తమ చదువును కిరోసిన్ దీపాల దగ్గరే చదువుతారు.

ఇంతటి దీన పరిస్థితిలో ఉన్న ఈ 162 హెక్టార్ల విస్తీర్ణం ఉన్న ఊరుని ఆ రాష్ట్ర మాజీ ముఖ్య మంత్రి బిష్ణురం మీది కొన్ని ఏళ్ళ క్రితం పర్యటించారట. ఆ ఊరికి రోడ్ కూడా ప్రారంభించారట. కానీ కాంట్రాక్టర్లు పని పూర్తి చెయ్యకుండా వేల్లోపోయారట. అక్కడ జిల్లా పరిషద్, గ్రామా పంచాయతీ, బ్లాక్ అభివృద్ధి అధికారులు ఆ ఊరిలో అభివృద్ధి చెయ్యడానికి ఎలాంటి ఆసక్తి చూపలేదట. ప్రతి ఏడాది వరదలకు గురయ్యే ఈ ఊరు ఏటికెటికి దిగజారిపోతూ...చివరకు పశువుల పెంపకం తప్ప మరేపనికి పనికిరాకుండా ఐపోయిందని వివరించారు దేక దంపతులు. ఇప్పుడు అక్కడికి ఒక ఎన్జిఓ వచ్చి అగ్రికల్చరల్ ఫార్మ్ ప్రారంభించింది. ఫార్మ్ చైర్మన్ ప్రీతి భూషణ్ దేక మాట్లాడుతూ, ఈ గ్రామానికి రోడ్ నిర్మించి, ప్రాధమిక వసతులు కల్పిస్తే మళ్ళి ఈ నెల సాగుకు పనికొస్తుందని అన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్ 7 కాన్సెప్ట్ లీక్.. నిజంగానే ఉల్టా ఫల్టా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>