TVDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jaberdst-rohini579df77a-ce59-4acb-9dbb-34cb37778d03-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/tv/122/jaberdst-rohini579df77a-ce59-4acb-9dbb-34cb37778d03-415x250-IndiaHerald.jpgసాధారణంగా ఎవరికైనా సరే ప్రేమ అనేది ఎప్పుడు ఎలా మొదలవుతుందో చెప్పడం చాలా కష్టం. అది సెలెబ్రిటీలైనా.. సామాన్యులైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక స్పెషల్ పర్సన్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అది ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా లవర్ అయినా ఇలా ఎవరైనా సరే అయి ఉండవచ్చు. ముఖ్యంగా వాళ్లు లైఫ్ లో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో అదే మనుషులు తమ లైఫ్ లో నుండి వెళ్ళిపోతే అంతే బాధను అనుభవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్ , బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. అయితే ఇప్పుడు ఆ విషయంలో తానేమి మినహాJABERDST;ROHINI{#}kali;Nijam;rohini;Comedian;Jabardasth;Lover;prema;Loveటీవీ: వాడు నాకు కాలి కింద మట్టికి కూడా సరిపోడు - రోహిణి..!టీవీ: వాడు నాకు కాలి కింద మట్టికి కూడా సరిపోడు - రోహిణి..!JABERDST;ROHINI{#}kali;Nijam;rohini;Comedian;Jabardasth;Lover;prema;LoveSun, 27 Aug 2023 02:00:00 GMTసాధారణంగా ఎవరికైనా సరే ప్రేమ అనేది ఎప్పుడు ఎలా మొదలవుతుందో చెప్పడం చాలా కష్టం. అది సెలెబ్రిటీలైనా.. సామాన్యులైనా ప్రతి ఒక్కరి జీవితంలో ఒక స్పెషల్ పర్సన్ అనేవాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అది ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా లవర్ అయినా ఇలా ఎవరైనా సరే అయి ఉండవచ్చు. ముఖ్యంగా వాళ్లు లైఫ్ లో ఉన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటారో అదే మనుషులు తమ లైఫ్ లో నుండి వెళ్ళిపోతే అంతే బాధను అనుభవించాల్సి ఉంటుంది. ముఖ్యంగా గర్ల్ ఫ్రెండ్ , బాయ్ ఫ్రెండ్ తో బ్రేకప్ అయినప్పుడు ఆ బాధ వర్ణనాతీతం. అయితే ఇప్పుడు ఆ విషయంలో తానేమి మినహాయింపు కాదని చెబుతోంది జబర్దస్త్ లేడీ కమెడియన్ రోహిణి.

సీరియల్ నటిగా కెరియర్ ను మొదలుపెట్టి ఆ తర్వాత జబర్దస్త్ కామెడీ షో తో మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె సినిమాలలో కూడా నటిస్తోంది. ఒక ప్రమాదం కారణంగా కొన్నాళ్లు షోలు సినిమాలకు దూరమైన రోహిణి ఇప్పుడు మళ్లీ రీఎంట్రీ ఇచ్చి అలరిస్తోంది. ఇదిలా ఉండగా ఒక షోలో భాగంగా తన ఫస్ట్ లవ్ బ్రేకప్ గురించి పెదవి విప్పి అందరికీ షాక్ ఇచ్చింది. ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ కనిపించే రోహిణి జీవితంలో కూడా ఇన్ని కష్టాలు ఉన్నాయని అందరూ ఆశ్చర్యపోతున్నారు.

రోహిణి మాట్లాడుతూ.. నాకు కూడా ఒకప్పుడు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడు. కానీ కొన్నాళ్లకే అతనితో బ్రేకప్ అయిపోయింది. ఆ బ్రేకప్ తర్వాత ఎంతో నరకం చూసాను. ఆ టైంలో నాకు ఫ్రెండ్స్ మాత్రమే అండగా నిలిచారు.. అసలు వాడెవడు.. నీ కాలి కింద మట్టికి కూడా వాడు సరిపోడు అంటూ ధైర్యం చెప్పేవాళ్లు. ఆ తర్వాత నాకు కూడా అదే నిజం అనిపించింది. ఇక వాడొక ఆఫ్ట్రాల్ అని, వాడి గురించి ఆలోచించడం తగ్గించాను. నా స్నేహితుల వల్లే నేను ఈ స్టేజ్ లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం రోహిణి చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ బికినీలో అందాల విస్ఫోటనం చేస్తున్న లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>