EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ap94e558b2-56d3-4a2e-aedf-6b6d52a86e7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/ap94e558b2-56d3-4a2e-aedf-6b6d52a86e7c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో న్యాయవ్యవస్థకు అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ లు పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూ కాశ్మీర్ కు ఆర్టికల్ 370 వ్యవస్థ ఎలా ఉందో.. ఆంధ్రప్రదేశ్ కు కూడా అలానే 371(డి) ఉంది. జోనల్ వ్యవస్థ ఉండగా ఆంధ్రప్రదేశ్ ను విభజించకూడదని సుప్రీం కోర్టులో కేసు వేశారు. రాజ్యాంగ సవరణ చేయకుండా రాష్ట్రాన్ని విభజించడం సరైనది కాదని అన్నారు. అప్పుడు పార్లమెంట్ బిల్లులను ఆపలేం. బిల్లు చట్టం వచ్చిన తర్వాత చూడొచ్చని అన్నారు. చట్టం అయింది రాష్ట్రపతి దగ్గరకు బిల్లు వెళుతుంది ఆపమని AP{#}Kumaar;Jammu and Kashmir - Srinagar/Jammu;Vundavalli Aruna Kumar;MP;Parliment;Article 370;Andhra Pradesh;Supreme Court;CMవిభజన జరిగి పదేళ్లు.. ఇంకా ఏపీకి అన్యాయమేనా?విభజన జరిగి పదేళ్లు.. ఇంకా ఏపీకి అన్యాయమేనా?AP{#}Kumaar;Jammu and Kashmir - Srinagar/Jammu;Vundavalli Aruna Kumar;MP;Parliment;Article 370;Andhra Pradesh;Supreme Court;CMSun, 27 Aug 2023 00:00:00 GMTఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో న్యాయవ్యవస్థకు అప్పటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, ఉండవల్లి అరుణ్ కుమార్ లు పిటిషన్ దాఖలు చేశారు. జమ్మూ కాశ్మీర్ కు ఆర్టికల్ 370 వ్యవస్థ ఎలా ఉందో.. ఆంధ్రప్రదేశ్ కు కూడా అలానే 371(డి) ఉంది. జోనల్ వ్యవస్థ ఉండగా ఆంధ్రప్రదేశ్ ను విభజించకూడదని సుప్రీం కోర్టులో కేసు వేశారు. రాజ్యాంగ సవరణ చేయకుండా రాష్ట్రాన్ని విభజించడం సరైనది కాదని అన్నారు.


అప్పుడు పార్లమెంట్ బిల్లులను ఆపలేం. బిల్లు చట్టం వచ్చిన తర్వాత చూడొచ్చని అన్నారు. చట్టం అయింది రాష్ట్రపతి దగ్గరకు బిల్లు వెళుతుంది ఆపమని చెప్పండి అని సుప్రీంను కోరినా రాష్ట్రపతికి సుప్రీం కోర్టు ఆదేశాలు ఎలా ఇస్తుందని ఇవ్వలేమని చెప్పింది.  దీంతో రాష్ట్రపతి దగ్గరకు బిల్లు వెళ్లిపోయింది. అక్కడ కూడా సంతకం అయిపోయింది.


అప్పటి నుంచి ఇప్పటి వరకు  10 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు వరకు దానిపై విచారణ జరగడం లేదు. విభజన చట్టం ప్రకారం ఆంధ్రకు రావాల్సిన బకాయిలు ఇవ్వలేదు. విభజన చట్టం ప్రకారం ఆస్తులను విడదీయలేదు. పెద్ద ఎత్తున అన్యాయం జరిగింది. ప్రస్తుతం వీటిపై ఎంపీ రఘురామ కృష్ణంరాజు పిటిషన్ వేశారు. దానిపై సుప్రీం కోర్టు విచారిస్తుంది. ఇది అన్యాయమో కాదో మేం చెప్పం. భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు మాత్రం మార్గదర్శకాలు జారీ చేస్తామని సుప్రీం తెలిపింది.


మార్గదర్శకాలు జారీ చేయడం కోసం న్యాయ స్థానం ఉందా అనే ప్రశ్న తలెత్తుతుంది. కానీ ఆయా మార్గదర్శకాలను ప్రభుత్వాలు పాటిస్తాయా? లేదా అన్నది ప్రశ్నార్థకం. కాశ్మీర్ విషయంలో వాదనలు వింటున్న సుప్రీం కోర్టు ఆంధ్రప్రదేశ్ విభజన విషయంలో మాత్రం ఎందుకు న్యాయం చేయలేకపోతుందని ఆయా రాజకీయ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశంలో ఒక భాగమైన ఆంధ్రప్రదేశ్ కు మాత్రం రాజ్యాంగం ప్రకారం న్యాయం చేయాలని అడిగితే సరిగా స్పందించడం లేదని ఇక్కడి వారు వాపోతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బ్లాక్ బికినీలో అందాల విస్ఫోటనం చేస్తున్న లక్ష్మీరాయ్..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>