Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/chennaib97d4e20-44be-4935-9a85-0d3bcfca1896-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/chennaib97d4e20-44be-4935-9a85-0d3bcfca1896-415x250-IndiaHerald.jpg2024 ఐపీఎల్ లక్ష్యంగా ప్రస్తుతం అన్ని ఫ్రాంచైజీలు కూడా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నాయ్ అని చెప్పాలి. అయితే 2023 ఐపీఎల్ సీజన్ టైటిల్ విజేతగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే ఇలా టైటిల్ విజేతగా నిలిచిన సమయంలో మళ్ళీ అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అటు జట్టును మార్పులు చేర్పులు చేయాలని భావిస్తుందట. జట్టుకు భారంగా మారిన కొంత మంది ఆటగాళ్లను వదులుకోవడమే కాదు ఇక కొంతమంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని ఇక టీం ను మరింత పటిష్టంగా మార్చుకోవాలని ఆలోచనలో ఉందChennai{#}MS Dhoni;sam;Punjab;Sam Mendes;Ben Stokes;Cricket;Samantha;Delhi;deepak;Chennaiటార్గెట్ ఐపీఎల్ 2024.. ఆ ముగ్గురిపై కన్నేసిన చెన్నై?టార్గెట్ ఐపీఎల్ 2024.. ఆ ముగ్గురిపై కన్నేసిన చెన్నై?Chennai{#}MS Dhoni;sam;Punjab;Sam Mendes;Ben Stokes;Cricket;Samantha;Delhi;deepak;ChennaiSun, 27 Aug 2023 10:30:00 GMT2024 ఐపీఎల్ లక్ష్యంగా ప్రస్తుతం అన్ని ఫ్రాంచైజీలు కూడా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతున్నాయ్ అని చెప్పాలి. అయితే 2023 ఐపీఎల్ సీజన్ టైటిల్ విజేతగా నిలిచింది చెన్నై సూపర్ కింగ్స్. అయితే  ఇలా టైటిల్ విజేతగా నిలిచిన సమయంలో మళ్ళీ అదే జట్టుతో బరిలోకి దిగే అవకాశం ఉంటుంది. కానీ చెన్నై సూపర్ కింగ్స్ మాత్రం అటు జట్టును మార్పులు చేర్పులు చేయాలని భావిస్తుందట. జట్టుకు భారంగా మారిన కొంత మంది ఆటగాళ్లను వదులుకోవడమే కాదు ఇక కొంతమంది ఆటగాళ్లను జట్టులోకి తీసుకొని ఇక టీం ను మరింత పటిష్టంగా మార్చుకోవాలని ఆలోచనలో ఉందట.


 ఈ క్రమంలోనే తమ జట్టులో ఉన్న బలహీనతలను అధిగమించేందుకు స్పెషల్ ఫోకస్ పెట్టింది అని చెప్పాలి. అయితే చెన్నై జట్టు బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా ఉంది అన్న విషయం తెలిసిందే. గాయంతో ఒక్క మ్యాచ్ ఆడని కైల్ జమీషన్ ధారాళంగా పరుగులు ఇచ్చిన తూషార్ దేశ్పాండే తరచు గాయాల బారిన పడుతున్న దీపక్ చాహార్ లను చెన్నై రిలీజ్ చేయాలని భావిస్తుంది. మరి కొంతమంది ప్లేయర్లను కూడా జట్టులోంచి వదిలేయాలని అనుకుంటుందట. అయితే ముగ్గురు ఆటగాళ్లపై అటు చెన్నై సూపర్ కింగ్స్ కన్ను వేసింది అంటూ ప్రస్తుతం క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా చర్చించుకుంటున్నారు.


 2023 ఐపీఎల్ సీజన్లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన సామ్ కరన్ ను దక్కించుకోవాలని భావిస్తుందట చెన్నై జట్టు. అతనిపై 18.5 కోట్ల భారీ దారి పెట్టి కొనుగోలు చేసింది పంజాబ్. కానీ అతను అంచనాలను అందుకోలేకపోయాడు. అయితే ఇక పంజాబ్ అతని వదులుకుంటే చెన్నై తమ జట్టులోకి తీసుకోవాలని అనుకుంటుందట. గతంలోనూ అతను చెన్నై తరపున ఆడాడు.


 బెన్ స్టోక్స్ కు రీప్లేస్మెంట్ గా ప్యాట్ కమిన్స్ ను జట్టులోకి తీసుకోవాలని వ్యూహాలు రచిస్తుందట.  చెన్నై యాజమాన్యం కేకేఆర్ కు ప్రాతినిధ్యం వహించిన  అతను ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో మాత్రం ఆడలేదు.

 ఐపీఎల్ చరిత్రలో తొలి సెంచరీ నమోదు చేసిన భారత ఆటగడిగా రికార్డు సృష్టించిన మనిష్ పాండే గత కొన్ని సీజన్లుగా  దారుణంగా విఫలమవుతున్నాడు. అయితే గత సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడిన అతను విఫలమయ్యాడు.అయితే ఢిల్లీ అతని వదిలేస్తే అటు చెన్నై జట్టు మాత్రం అతన్ని సొంతం చేసుకొని ఇక ధోని సారథ్యంలో ఆడిస్తే అతని ఆటను మెరుగు అవుతుందని నమ్ముతుందట.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అర్జున్ రెడ్డి సినిమా దెబ్బకు ఫ్లాప్ అయిన సినిమాలు ఇవే..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>