EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdp924459ec-935e-4b8c-9154-078241b93df5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/tdp924459ec-935e-4b8c-9154-078241b93df5-415x250-IndiaHerald.jpgటీడీపీ కొన్ని నియోజకవర్గాల్లో ఎప్పటికీ గెలవలేనివి ఉన్నాయి. ముఖ్యంగా పులివెందులలో ఇప్పటి వరకు గెలవలేదు. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు ఎంపీలు పార్టీ దగ్గరికి రాకపోవడం, లోకేశ్ పాదయాత్రను పట్టించుకోకపోవడం జరుగుతోంది. తెలుగు దేశంకి కీలకమైన నియోజకవర్గం గన్నవరం. ఇక్కడ కేవలం ఒకే ఒక్కసారి టీడీపీ ఓడిపోయింది. గత సారి ఎన్నికల్లో గెలిచినా కూడా అక్కడే కేవలం 980 ఓట్లతోనే గెలవడం అనేది టీడీపీకి నిజంగా ఎదురు దెబ్బ లాంటిదే. అయితే గన్నవరంలో గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ పార్టీకి అనుకూలంగా మారడం కూడా ఇప్పుడు ఇబ్బందికరTDP{#}Sridevi Kapoor;Krishna River;Nara Lokesh;Vijayawada;Guntur;Vallabhaneni Vamsi;Prathipadu;TDP;Jaleel Khan;Nuziveedu;Prathipati Pullarao;Telugu;Capital;Partyటీడీపీని ఇబ్బంది పెట్టే నియోజక వర్గాలివే?టీడీపీని ఇబ్బంది పెట్టే నియోజక వర్గాలివే?TDP{#}Sridevi Kapoor;Krishna River;Nara Lokesh;Vijayawada;Guntur;Vallabhaneni Vamsi;Prathipadu;TDP;Jaleel Khan;Nuziveedu;Prathipati Pullarao;Telugu;Capital;PartySat, 26 Aug 2023 06:04:00 GMTటీడీపీ కొన్ని నియోజకవర్గాల్లో ఎప్పటికీ గెలవలేనివి ఉన్నాయి. ముఖ్యంగా పులివెందులలో ఇప్పటి వరకు గెలవలేదు. ప్రస్తుతం కృష్ణా, గుంటూరు ఎంపీలు పార్టీ దగ్గరికి రాకపోవడం, లోకేశ్ పాదయాత్రను పట్టించుకోకపోవడం జరుగుతోంది. తెలుగు దేశంకి కీలకమైన నియోజకవర్గం గన్నవరం. ఇక్కడ కేవలం ఒకే ఒక్కసారి టీడీపీ ఓడిపోయింది. గత సారి ఎన్నికల్లో గెలిచినా కూడా అక్కడే కేవలం 980 ఓట్లతోనే గెలవడం అనేది టీడీపీకి నిజంగా ఎదురు దెబ్బ లాంటిదే.


అయితే గన్నవరంలో గెలిచిన వల్లభనేని వంశీ వైసీపీ పార్టీకి అనుకూలంగా మారడం కూడా ఇప్పుడు ఇబ్బందికరమైన అంశం. పట్టాభి వంటి వారు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వీరి దగ్గర ఎన్నికలకు వెళ్లే డబ్బులు లేవని తెలుస్తోంది. విజయవాడ వెస్ట్ లాంటి ప్లేస్ లో 1983 లో మాత్రమే టీడీపీ గెలిచింది. అంతకుముందు ఏనాడు కూడా టీడీపీ అక్కడ విజయం సాధించలేదు.


ఇప్పుడు అక్కడ జలీల్ ఖాన్ కు టికెట్ ఇస్తారా? ఆయన కూతురుకు ఇస్తారా అనే చర్చ జరుగుతుంది. నూజివీడు లో నాలుగేళ్ల నుంచి టీడీపీకి ఇన్ చార్జి లేడు. గుంటూరు ఈస్ట్, వెస్ట్ లో ఎవరూ లేరన్నట్లే కనిపిస్తుంది. ఆంధ్ర రాజధాని నుంచి గెలిచిన శ్రీదేవి ప్రస్తుతం టీడీపీలోకి చేరింది. ఇక్కడ శ్రవణ్, శ్రీదేవి, శ్రీనివాస్, కృష్ణాంజనేయులు వీరిలో ఎవరికి టికెట్ ఇస్తారని చర్చ నడుస్తుంది.


ప్రత్తిపాడు నియోజకవర్గంలో ఇప్పటి దాకా ఎటూ తేల్చడం లేదు. చిలకలూరిపేటలో ప్రత్తిపాటి పుల్లారావు ప్లేస్ లో ఆయనకే ఇస్తారా.. లేదా భాష్యం ప్రవీణకు ఇస్తారా అంటే ఇంకా తేల్చుకోలేరని తెలుస్తోంది. అయితే ముందు నుంచి గుంటూరు, కృష్ణా లాంటి ప్లేస్ లో ఎక్కువగా పట్టు ఉన్న టీడీపీకి, ప్రస్తుతం నియోజకవర్గాల్లో సమస్యలు పెద్ద తలనొప్పిగా మారాయి. మరి ఇలాంటి సంఘటనలు ఎలా ఎదుర్కొని రాబోయే ఎన్నికల్లో టీడీపీ ముందుకెళుతుందో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

హైదరాబాద్‌లో ఓటు నమోదుకు చివరి అవకాశం?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>