MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/movies-IndiaHerald.jpgప్రముఖ నిర్మాత దిల్ రాజ్ తాను తీసే సినిమాల విషయంలో చాల ప్లానింగ్ తో ఉంటాడు. అందువల్లనే ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనప్పటికి సక్సస్ ఫుల్ నిర్మాతగా అతడు ఇండస్ట్రిలో ఇంతకాలంగా కొనసాగ గలుగుతున్నాడు. రామ్ చరణ్‌ తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్ లో దిల్ రాజ్ ప్రారంభించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు ముందే సెట్స్ పైకి వెళ్ళింది. ఈసినిమాకు సంబంధించిన కొన్ని షెడ్యూళ్లు పూర్తి చేశారు. ఈ సినిమాను ఈఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజ్ భావించాడు. అయితే పరిస్థితులు వేరే విధంగా మారడdil raaj{#}Ram Charan Teja;shankar;Dil;producer;Producer;Athadu;raj;Darsakudu;Hero;media;Tamil;ram pothineni;Cinema;Director;Newsదిల్ రాజ్ ను టార్చర్ పెడుతున్న గేమ్ ఛేంజర్ !దిల్ రాజ్ ను టార్చర్ పెడుతున్న గేమ్ ఛేంజర్ !dil raaj{#}Ram Charan Teja;shankar;Dil;producer;Producer;Athadu;raj;Darsakudu;Hero;media;Tamil;ram pothineni;Cinema;Director;NewsSat, 26 Aug 2023 10:00:00 GMTప్రముఖ నిర్మాత దిల్ రాజ్ తాను తీసే సినిమాల విషయంలో చాల ప్లానింగ్ తో ఉంటాడు. అందువల్లనే ఎన్ని ఒడుదుడుకులు ఎదురైనప్పటికి సక్సస్ ఫుల్ నిర్మాతగా అతడు ఇండస్ట్రిలో ఇంతకాలంగా కొనసాగ గలుగుతున్నాడు. రామ్ చరణ్‌ తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ ల కాంబినేషన్ లో దిల్ రాజ్ ప్రారంభించిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ  ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదలకు ముందే సెట్స్ పైకి వెళ్ళింది.



ఈసినిమాకు సంబంధించిన కొన్ని షెడ్యూళ్లు పూర్తి చేశారు. ఈ సినిమాను ఈఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని దిల్ రాజ్ భావించాడు. అయితే పరిస్థితులు వేరే విధంగా మారడంతో ‘గేమ్ ఛేంజర్’ మూవీ సమస్యలలో పడింది అంటూ ఇండస్ట్రీలో గాసిప్పులు వస్తున్నాయి. దర్శకుడు శంకర్ అప్పటికే మొదలుపెట్టి మధ్యలో ఆపిన  ‘ఇండియన్ 2’ను ముందుకు తీసుకురావడంతో ‘గేమ్ ఛేంజర్’ వెనక్కు వెళ్ళిపోయింది అంటున్నారు.



ఈరెండు సినిమాలను సమాంతరంగా పూర్తి చేసేలా ముందు ప్లానింగ్ జరిగినా అది వాస్తవ రూపం దాల్చలేదు. ‘ఇండియన్ 2’ శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్. ఈమూవీని ఏదోవిధంగా వీలైనంత త్వరలో విడుదలచేయాలని శంకర్ భావిస్తూ ఉండటంతో అతడు ‘గేమ్ ఛేంజర్’ ను పక్కకు పెట్టాడు అని అంటారు. ఇది ఇలా ఉంటే రామ్ చరణ్ అభిమానులు అవకాశం దొరికినప్పుడల్లా ‘గేమ్ ఛేంజర్’ మూవీ అప్ డేట్స్ గురించి తరుచు దిల్ రాజ్ ను సోషల్ మీడియా ద్వారా ప్రశ్నిస్తున్నారు.



సినిమాలను పక్కా ప్లానింగ్ తో చేసే దిల్ రాజ్ కు ఇలాంటి అనుభవం ఎప్పుడూ ఎదురుకాలేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. లేటెస్ట్ గా దిల్ రాజ్ ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ హీరో అశిష్ కొత్త సినిమా మొదలైన సందర్భంగా ‘గేమ్ చేంజర్’ అప్‌డేట్స్ కోసం మీడియా వాళ్లు అతడిని ప్రశ్నించడం జరిగింది. దీనికి అతడు వ్యూహాత్మకంగా స్పందిస్తూ ‘‘మనమేం చేయలేం. డైరెక్టర్ గారి చేతుల్లోనే అంతా ఉంది. ఆయన ఇచ్చినపుడు మాత్రమే అప్‌ డేట్స్ బయటికి వస్తాయి’’ అంటూ తెలివిగా దాటవేసినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో ‘గేమ్ ఛేంజర్’ దిల్ రాజ్ ను పూర్తిగా కన్ఫ్యూజ్ చేస్తోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు..





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో అల్లు అర్జున్-చరణ్ మధ్య కోల్డ్ వార్.. మరోసారి బయటపడ్డ నిజాలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>