EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/brahmin952058fa-ebbb-4a35-8297-c40ce67de1fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/brahmin952058fa-ebbb-4a35-8297-c40ce67de1fb-415x250-IndiaHerald.jpgహిందుత్వం మీద ద్వేషం ఉన్న వారు రగిలించిన కుల చిచ్చు తప్పించి దాదాపు కొన్ని ఆలయాల్లో బ్రహ్మణులు కాకుండా వేరే కులానికి చెందిన వ్యక్తులు కూడా అర్చకులుగా ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు చాలా మందికి గుడిలో అర్చకుడు అంటే బ్రాహ్మణుడు అనే భావన చాలా మందిలో ఉండిపోయింది. అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడి ఆచార సంప్రదాయాల ప్రకారం.. ఆలయాల్లో పూజలు చేసే వారు బీసీలు, ఎస్సీలు కూడా ఉన్నారు. అయితే మనం చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో, చరిత్రలో ఎక్కడ వీటి గురించి కనిపించదు. ముఖ్యంగా పత్రికల్లో కూడా రాయరు. దీంతో పBRAHMIN{#}bhavana;Salem;Chennai;Muthu;Manam;courtఈ తీర్పు బ్రాహ్మణుల ఉపాధి దెబ్బ తీస్తుందా?ఈ తీర్పు బ్రాహ్మణుల ఉపాధి దెబ్బ తీస్తుందా?BRAHMIN{#}bhavana;Salem;Chennai;Muthu;Manam;courtSat, 26 Aug 2023 10:00:00 GMTహిందుత్వం మీద ద్వేషం ఉన్న వారు రగిలించిన కుల చిచ్చు తప్పించి దాదాపు కొన్ని ఆలయాల్లో బ్రహ్మణులు కాకుండా వేరే కులానికి చెందిన వ్యక్తులు కూడా అర్చకులుగా ఉంటున్నారు. అయితే ఇప్పటి వరకు చాలా మందికి గుడిలో అర్చకుడు అంటే బ్రాహ్మణుడు అనే భావన చాలా మందిలో ఉండిపోయింది. అయితే కొన్ని కొన్ని ప్రాంతాల్లో అక్కడి ఆచార సంప్రదాయాల ప్రకారం.. ఆలయాల్లో పూజలు చేసే వారు బీసీలు, ఎస్సీలు కూడా ఉన్నారు.


అయితే మనం చదువుకున్న పాఠ్య పుస్తకాల్లో, చరిత్రలో ఎక్కడ వీటి గురించి కనిపించదు. ముఖ్యంగా పత్రికల్లో కూడా రాయరు. దీంతో ప్రజల దృష్టిలో అందరూ బ్రాహ్మణులే అన్న విషయం మదిలో గుర్తుండిపోయింది. దీని వల్ల బ్రాహ్మణ ద్వేషం పెరిగిపోయింది. అయితే ఈ విషయంపై ఇటీవల సుప్రీంకోర్టు ఒక కీలక తీర్పునిచ్చింది. ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం... అన్ని కులాల వారు అర్చక వృత్తి చేయవచ్చని పేర్కొంది.


సేలం సుగణేశ్వర స్వామి ఆలయంలో స్వామి వారికి పూజలు చేసే అర్చకులు అప్లై చేసుకోవాలని 2018 లో ఆలయ కమిటీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రకటన ఆగమ శాస్త్ర నిబంధనలకు అనుగుణంగా లేదని అర్చకుడు ముత్తు సుబ్రమణ్యన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన జస్టిస్ వెంకటేశ్ ఆలయ ఆగమ నియమాలు, పూజ విధానాలు తెలిసిన ఎవరైనా ఉత్తీర్ణులు కావొచ్చని తీర్పు వెలువరించారు.


అయితే ఈ తీర్పును సమర్థిస్తూ మద్రాసు హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం కూడా తీర్పునిచ్చింది. దీంతో అర్చకుడు ముత్తు సుబ్రమణ్యన్ గురుకుల్ సుప్రీం కోర్టులో కేసు దాఖలు చేశారు. దీన్ని పూర్తిగా విచారించిన సుప్రీం కోర్టు, మద్రాస్ హై కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే విధించడానికి నిరాకరించింది. ఆగమ శాస్త్ర నిబంధనల మేరకు నడుచుకునే వారు శిక్షణ పొందిన వారు ఏ కులం వారైన అర్చక వృత్తికి అర్హులని చెప్పింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో అల్లు అర్జున్-చరణ్ మధ్య కోల్డ్ వార్.. మరోసారి బయటపడ్డ నిజాలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>