Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/undefinedhttps://www.indiaherald.com/ImageStore/undefinedగత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించిన సినిమాలు ఏవి అంటే చాలా సినిమాల పేర్లు తెరమీదకి వస్తూ ఉంటాయి. ఇందులో అటు చిన్న సినిమాగా విడుదలై ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన కాంతారా పేరు కూడా ఉంటుంది అని చెప్పాలి. హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా సత్తా చాటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఎవ్వరికి తెలియని సరికొత్త విషయాన్ని ఈ సినిమా ద్వారా రిశబ్ శెట్టి చూపించి సక్సెస్ అయ్యాడు. దీంKanthara{#}Indian;Blockbuster hit;Success;Hero;Kannada;Cinemaవామ్మో.. కాంతారా-2కి.. అంత భారీ బడ్జెట్టా?వామ్మో.. కాంతారా-2కి.. అంత భారీ బడ్జెట్టా?Kanthara{#}Indian;Blockbuster hit;Success;Hero;Kannada;CinemaSat, 26 Aug 2023 09:05:00 GMTగత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టించిన సినిమాలు ఏవి అంటే చాలా సినిమాల పేర్లు తెరమీదకి వస్తూ ఉంటాయి. ఇందులో అటు చిన్న సినిమాగా విడుదలై ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించిన కాంతారా పేరు కూడా ఉంటుంది అని చెప్పాలి. హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అన్ని భాషల్లో కూడా సత్తా చాటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఎవ్వరికి తెలియని సరికొత్త విషయాన్ని ఈ సినిమా ద్వారా రిశబ్ శెట్టి చూపించి సక్సెస్ అయ్యాడు.


 దీంతో ఈ సినిమాకు సీక్వెల్  తీయాలని అటు మేకర్స్ కూడా నిర్ణయించారు. ఇక సీక్వెల్ అనౌన్స్ చేయగానే ఇక కాంతార పార్ట్ 2 పై అందరిలో అంచనాలు కూడా పెరిగిపోయాయి. అయితే మొదటి పార్ట్ సూపర్ హిట్ సాధించి భారీగా లాభాలు తెచ్చి పెట్టడంతో ఇక సీక్వల్ కోసం ముందుగా అనుకున్న దాని కంటే భారీగా బడ్జెట్ కేటాయించారట మేకర్స్. కన్నడ రూట్స్ కు సంబంధించిన కథతో తెరకెక్కిన ఈ సినిమా నేషనల్ ఆడియోస్ కు బాగా కనెక్ట్ అయింది. దీంతో సినిమాకు సీక్వెల్ కావాలని ఎంతోమంది ఫాన్స్ కూడా రిక్వెస్ట్ చేసారు. దీంతో ఫాన్స్ కోరిక మేరకు అటు పార్ట్ 2 కూడా అనౌన్స్ చేసారు మేకర్స్.


 అయితే కాంతారా బడ్జెట్ కేవలం 16 కోట్లు మాత్రమే కానీ ఇప్పుడు పార్ట్ 2 బడ్జెట్ విషయంలో మాత్రం తగ్గేదేలే అంటున్నారట మేకర్స్. ఏకంగా కాంతారా మొదటి పార్ట్ 400 కోట్ల సాధించడంతో ఇప్పుడు రెండో పార్ట్ కు  120 కోట్లతో నిర్మించేందుకు రెడీ అయ్యారట దర్శకనిర్మాతలు. ఇక త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదికి తీసుకువెళ్లేందుకు కసరత్తులు కూడా చేస్తున్నారు. అయితే 2024 సెకండ్ హాఫ్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. 16 కోట్లతో తీస్తేనే అంత అద్భుతంగా వచ్చింది.. ఇప్పుడు 120 కోట్లు అంటే ఇంకా ఎంత అద్భుతంగా ఉండబోతుందో అనే అభిమానుల్లో కూడా అంచనాలు పెరిగిపోతున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో అల్లు అర్జున్-చరణ్ మధ్య కోల్డ్ వార్.. మరోసారి బయటపడ్డ నిజాలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>