Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bigboss7ab1b8ce-0bf0-462b-9777-46deb61d828d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/bigboss7ab1b8ce-0bf0-462b-9777-46deb61d828d-415x250-IndiaHerald.jpgఇంగ్లీషులో బిగ్ బ్రదర్ అనే పేరుతో మొదలైన షో.. ఇక భారత్లో బిగ్ బాస్ పేరుతో ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. అయితే హిందీలో ఎప్పుడో ప్రారంభమైన ఈ షో తెలుగులో ఏడేళ్ల క్రితం ప్రారంభమైంది. అయితే ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్న విధంగా ఇక చాలా లేటుగా వచ్చినప్పటికీ ఊహించని రీతిలో రేటింగ్స్ సొంతం చేసుకుంది. కాగా ఈ ఏడాది ఏడవ సీజన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువ సీజన్ల పాటు నాగార్జున బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. ఇక ఏడవ సBigboss{#}Akkineni Nagarjuna;Tollywood;Bigboss;Audience;Leader;Hero;Houseబిగ్ బాస్ హౌస్ లోకి హీరో కమ్ పొలిటీషియన్.. ఇది కదా ట్విస్ట్ అంటే?బిగ్ బాస్ హౌస్ లోకి హీరో కమ్ పొలిటీషియన్.. ఇది కదా ట్విస్ట్ అంటే?Bigboss{#}Akkineni Nagarjuna;Tollywood;Bigboss;Audience;Leader;Hero;HouseSat, 26 Aug 2023 09:30:00 GMTఇంగ్లీషులో బిగ్ బ్రదర్ అనే పేరుతో మొదలైన షో.. ఇక భారత్లో బిగ్ బాస్ పేరుతో ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే. అయితే హిందీలో ఎప్పుడో ప్రారంభమైన ఈ షో  తెలుగులో ఏడేళ్ల క్రితం ప్రారంభమైంది. అయితే ఎప్పుడు వచ్చామన్నది కాదు బుల్లెట్ దిగిందా లేదా అన్న విధంగా ఇక చాలా లేటుగా వచ్చినప్పటికీ ఊహించని రీతిలో రేటింగ్స్ సొంతం చేసుకుంది. కాగా ఈ ఏడాది ఏడవ సీజన్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధం అవుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఎక్కువ సీజన్ల పాటు నాగార్జున బిగ్ బాస్ కార్యక్రమానికి హోస్ట్ గా వ్యవహరించారు. ఇక ఏడవ సీజన్ కి ఆయన బిగ్ బాస్ హోస్ట్ గా తప్పుకుంటారు అని ప్రచారం జరిగింది.


 కానీ అదంతా కేవలం పుకార్లు మాత్రమే అన్న విషయం ఇటీవల విడుదలైన ప్రోమోతో అందరికీ అర్థమైంది. అయితే ఈసారి ఉల్టా పల్టా అంటూ సరికొత్తగా బిగ్ బాస్ కార్యక్రమము ఉండబోతుంది అని ప్రోమో ద్వారా నాగార్జున అందరిలో మరింత ఆసక్తిని పెంచేశాడు. అయితే బిగ్ బాస్ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటన విడుదలైందో లేదో ఇక హౌస్ లోకి వెళ్ళబోయే కంటెస్టెంట్స్ వీళ్లే అంటూ ఎన్నో పేర్లు తెర మీదకి వచ్చాయి. ఇప్పటికి అటు సోషల్ మీడియాలో చాలా పేర్లు వైరల్ గా మారిపోతున్నాయ్ అని చెప్పాలి. అయితే ఇప్పుడు ఏకంగా సినీ హీరో పొలిటీషియన్ గా కొనసాగుతున్న వ్యక్తి కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లబోతున్నారట.


 ప్రస్తుతం ఈ టాక్ ప్రతి ఒక్కరి దృష్టిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఇలా హౌస్ లోకి వెళ్ళబోతున్న హీరో కం పొలిటీషియన్ ఎవరో కాదు.. టాలీవుడ్ లో ప్రముఖ నటుడు పొలిటికల్ లీడర్ శివాజీ. బిగ్ బాస్ షోను మరింతగా రక్తి కట్టించే బాధ్యతను అతనిపై నిర్వాహకులు వేసినట్లు సమాచారం. అయితే ఎన్నో సినిమాలలో హీరోగా నటించిన శివాజీ.. సపోర్టింగ్ ఆర్టిస్టుగా కూడా చేశాడు. కొన్ని నెలల క్రితం రాజకీయాల్లోకి సైతం ఎంట్రీ ఇచ్చాడు. ఆపరేషన్ గరుడ అంటూ సెన్సేషన్ సృష్టించాడు. అలాంటి వ్యక్తి బిగ్ బాస్ లోకి వస్తే ఏడవ సీజన్ మరింత ఉత్కంఠగా ఆసక్తికరంగా సాగుతుందని ప్రేక్షకులు కూడా భావిస్తూ ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో అల్లు అర్జున్-చరణ్ మధ్య కోల్డ్ వార్.. మరోసారి బయటపడ్డ నిజాలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>