Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan539efbb0-77cf-41fa-ac21-a44c471e7681-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/charan539efbb0-77cf-41fa-ac21-a44c471e7681-415x250-IndiaHerald.jpgనేషనల్ అవార్డ్స్ ప్రకటన మొదలైంది అంటే చాలు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చ జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. నేషనల్ అవార్డు దక్కించుకున్న తమ అభిమాన సినీ హీరో హీరోయిన్ల గురించి అభిమానులు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అదే సమయంలో అవార్డు రేసులో ఉన్నప్పటికీ ఇక చివరికి అవార్డు దక్కించుకోలేకపోయిన హీరో హీరోయిన్ల అభిమానులు కాస్త నిరాశలో మునిగిపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల నేషనల్ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్నడు లేని విధంగా టాలీవుడ్ కి ఏకంగా 10 అవార్డులు దక్Charan{#}Ram Charan Teja;ramaraju;Tollywood;Rangasthalam;Allu Arjun;Pawan Kalyan;Heroపాపం.. చరణ్ కి నేషనల్ అవార్డు బాకీ లేనట్టుంది.. ఎందుకంటే?పాపం.. చరణ్ కి నేషనల్ అవార్డు బాకీ లేనట్టుంది.. ఎందుకంటే?Charan{#}Ram Charan Teja;ramaraju;Tollywood;Rangasthalam;Allu Arjun;Pawan Kalyan;HeroSat, 26 Aug 2023 09:15:00 GMTనేషనల్ అవార్డ్స్ ప్రకటన మొదలైంది అంటే చాలు ఫిలిం ఇండస్ట్రీలో ఎక్కడ చూసినా కూడా ఇదే విషయం గురించి చర్చ జరుగుతూ ఉంటుంది అని చెప్పాలి. నేషనల్ అవార్డు దక్కించుకున్న తమ అభిమాన సినీ హీరో హీరోయిన్ల గురించి అభిమానులు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు. అదే సమయంలో అవార్డు రేసులో ఉన్నప్పటికీ ఇక చివరికి అవార్డు దక్కించుకోలేకపోయిన హీరో హీరోయిన్ల అభిమానులు కాస్త నిరాశలో మునిగిపోతూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇటీవల  నేషనల్ అవార్డు ప్రధానోత్సవం జరిగింది. ఈ క్రమంలోనే ఎన్నడు లేని విధంగా టాలీవుడ్ కి ఏకంగా 10 అవార్డులు దక్కాయ్. అయితే ఉత్తమ నటుడిగా పుష్ప సినిమాకు గాను అటు అల్లు అర్జున్ అవార్డు దక్కించుకున్నాడు.


 అంతా బాగానే ఉంది. కానీ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు మాత్రం తీవ్రంగా నిరాశలో మునిగిపోయారు. ఎందుకంటే తమ అభిమాని హీరోకి అవార్డు రాలేదు అన్న కారణం. ఎందుకంటే టాలీవుడ్ నుంచి రెండుసార్లు నేషనల్ అవార్డుకి నామినేట్ అయిన ఏకైక హీరోగా రామ్ చరణ్ చరిత్ర సృష్టించాడు. 2018లో అద్భుతమైన నటన ప్రదర్శించినందుకుగాను రంగస్థలం చిత్రానికి.. 2022 సంవత్సరంలో నాచురల్ గా నటించి  త్రిబుల్ ఆర్ సినిమాకు గాను నామినేట్ అయ్యాడు. అప్పట్లో రంగస్థలం సినిమాకి రాంచరణ్ కు అవార్డు రాకపోవడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం అసంతృప్తి వ్యక్తం చేసింది.


 ఎందుకంటే రంగస్థలం సినిమాలో రాంచరణ్ నటన ఆ రేంజ్ లో ఉంటుంది. అయితే త్రిబుల్ ఆర్ సినిమాలో అంతకుమించిన నట విశ్వరూపం చూపించాడు ఈ మెగా పవర్ స్టార్. వివిధ రకాల షేడ్స్ ఉన్న రామరాజు పాత్రని తన సహజ నటనతో  వేరే లెవెల్ కి తీసుకెళ్లాడు. దీంతో రామ్ చరణ్ కు తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుందని అందరూ అంచనాలు పెట్టుకున్నారు. కానీ అవార్డు రాలేదు. దీంతో ఫాన్స్ నిరాశలో మునిగిపోయారు. నేషనల్ అవార్డు దక్కించుకునే రేంజ్ పెర్ఫార్మన్స్ ఇచ్చినప్పటికీ.. దానికి తగ్గ క్యాంపైన్ చేయకపోవడం వల్లే రామ్ చరణ్ కి నేషనల్ అవార్డు మిస్ అయిందని విశ్లేషకులు కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ విషయంలో అల్లు అర్జున్-చరణ్ మధ్య కోల్డ్ వార్.. మరోసారి బయటపడ్డ నిజాలు..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>