MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bedurulanka-2012ca4c1f7f-6c54-424a-85a1-54456ce0ed33-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/bedurulanka-2012ca4c1f7f-6c54-424a-85a1-54456ce0ed33-415x250-IndiaHerald.jpgఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం ఇంకా చూస్తూనే ఉన్నాడు హీరో కార్తికేయ. కానీ ఇప్పటి దాకా అది రాలేదు.. మధ్యలో విలన్‌గా కూడా ట్రై చేసాడు ఈ కుర్ర హీరో. మళ్ళీ ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ‘బెదురులంక 2012’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆర్ఎక్స్ 100 లాగే ఇది కూడా గోదావరి నేపథ్యంలో వచ్చిన మూవీ.అలాగే ఇందులో హీరో పేరు కూడా శివ. మరి సెంటిమెంట్ ప్రకారం కార్తికేయ హిట్ కొట్టాడా లేదో తెలుసుకుందాం.యుగాంతం నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో కథలు వచ్చాయి.. కానీ బెదురులంక మాత్రం కాస్త డBEDURULANKA 2012{#}Raaj Kumar;ramana;RX100;Darsakudu;srikanth;karthikeya;kartikeya;Godavari River;neha shetty;Girl;vennela kishore;Comedy;Hero;ajay;Success;Cinema;Directorబెదురులంక 2012: డిఫరెంట్ కాన్సెప్ట్.. హిట్టు కన్ఫార్మ్?బెదురులంక 2012: డిఫరెంట్ కాన్సెప్ట్.. హిట్టు కన్ఫార్మ్?BEDURULANKA 2012{#}Raaj Kumar;ramana;RX100;Darsakudu;srikanth;karthikeya;kartikeya;Godavari River;neha shetty;Girl;vennela kishore;Comedy;Hero;ajay;Success;Cinema;DirectorFri, 25 Aug 2023 14:39:00 GMTఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఆ రేంజ్ సక్సెస్ కోసం ఇంకా చూస్తూనే ఉన్నాడు హీరో కార్తికేయ. కానీ ఇప్పటి దాకా అది రాలేదు.. మధ్యలో విలన్‌గా కూడా ట్రై చేసాడు ఈ కుర్ర హీరో. మళ్ళీ ఇప్పుడు హీరోగా వరస సినిమాలు చేస్తున్నాడు. తాజాగా ‘బెదురులంక 2012’ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఆర్ఎక్స్ 100 లాగే ఇది కూడా గోదావరి నేపథ్యంలో వచ్చిన మూవీ.అలాగే ఇందులో హీరో పేరు కూడా శివ. మరి సెంటిమెంట్ ప్రకారం కార్తికేయ హిట్ కొట్టాడా లేదో తెలుసుకుందాం.యుగాంతం నేపథ్యంలో ఇప్పటికే ఎన్నో కథలు వచ్చాయి.. కానీ బెదురులంక మాత్రం కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఆ నేపథ్యంలో కథ ఉన్నా కూడా పూర్తిగా జనాల అమాయకత్వం ఇంకా వాళ్ల మూఢ నమ్మకాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసాడు దర్శకుడు క్లాక్స్. అక్కడ్నుంచి సిచ్యువేషనల్ కామెడీని రాబట్టుకున్నాడు. అదే ఈ మూవీకి పెద్ద ప్లస్ అయింది. దేవుడి పేరుతో దోపిడీ మొదలైన తర్వాత కథలో కూడా ఆసక్తి మొదలవతుంది.. అక్కడ్నుంచే వినోదం బాగా ఊపందుకుంటుంది.ఓవరాల్ గా మూవీ కామెడీగా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది.హీరో కార్తికేయ బాగా నటించాడు.


కథలో హీరోయిజం చూపించే ఛాన్స్ ఉన్నా కూడా కేవలం కథ ప్రకారం వెళ్లాడు కానీ ఎక్కడా కూడా అనవసరపు హంగులకు వెళ్లలేదు. ఉన్నంతలో చాలా వరకు బాగా కామెడీ చేసాడు.హీరోయిన్ నేహా శెట్టి ఓకే.. తన పాత్రకు బాగానే న్యాయం చేసారు. ఇక అజయ్ ఘోష్, శ్రీకాంత్ అయ్యంగర్ ఇంకా ఆటో రాంప్రసాద్ యాక్టర్స్ బాగా పేలాయి. ప్రెసిడెంట్‌గా గోపరాజు రమణ కూడా బాగా నవ్వించారు. ఇంకా అలాగే కసిరెడ్డి పాత్రలో రాజ్ కుమార్ కసిరెడ్డి కూడా చివర్లో అదరగొట్టాడు. సత్య, వెన్నెల కిషోర్ ఉన్నది కాసేపే అయినా చాలా బాగా చేసారు.సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ పాటల కంటే ఆయన బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది. ఉన్న పాటల్లో వెన్నెల్లో ఆడపిల్ల పాట ఆకట్టుకుంటుంది. అలాగే ఎడిటింగ్ ఓకే. ఇక చివరి 40 నిమిషాలు అయితే చాలా హిలేరియస్‌గా వర్కవుట్ అయింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. డైరెక్టర్ క్లాక్స్ పదేళ్ల కింది ఇన్సిడెంట్ తీసుకున్నా కూడా చాలా ఫన్నీగా దాన్ని ప్రజెంట్ చేసాడు. ముఖ్యంగా లేనిపోని చెత్త చూపించకుండా హాయిగా కథలోని కామెడీని వర్కవుట్ చేసాడు.. మొత్తానికి ఇదో హిట్టు సినిమా అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మూవీకి నో నేషనల్ అవార్డ్.. బాధలో నాని?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>