EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/gurumurthycd3d9dfb-3573-4d00-8102-59e508c7de2c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/gurumurthycd3d9dfb-3573-4d00-8102-59e508c7de2c-415x250-IndiaHerald.jpgగతంలో రాజకీయంలోకి తీసుకోవాలంటే వాళ్లకి మంచి పేరు ఉందా లేదా అనేది చూసే వారు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది అనేది మాత్రమే చూస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడు అంటే అధికారం కోసం ప్రాకులాడుతూ ఉండాలని, అహంకారంతో ప్రవర్తించాలని అన్నట్లుగా తయారైంది ఇప్పుడు వాతావరణం‌. అంతే కాకుండా డబ్బులు ఉన్న వాళ్ళని ఇలా నాయకుడిగా నిలబెట్టడం వల్ల అవసరం వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు వెదజల్లి మరీ పనులు సజావుగా సాగేలా చూస్తారు. అంతే కాకుండా పార్లమెంటు సభ్యుడు అంటే ఇప్పుడు తనకంటూ ఎమ్మెల్యేలను చెప్పుచేతల్లో పెట్టుకోgurumurthy{#}Chittoor;Parliment;Tirupati;Parliament;YCP;MP;Partyఆ వైసీపీ ఎంపీ పని తీరు శభాష్‌?ఆ వైసీపీ ఎంపీ పని తీరు శభాష్‌?gurumurthy{#}Chittoor;Parliment;Tirupati;Parliament;YCP;MP;PartyFri, 25 Aug 2023 00:00:00 GMTగతంలో రాజకీయంలోకి తీసుకోవాలంటే  వాళ్లకి మంచి పేరు ఉందా లేదా అనేది చూసే వారు. కానీ ఇప్పుడు వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంది అనేది మాత్రమే చూస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడు అంటే అధికారం కోసం  ప్రాకులాడుతూ ఉండాలని, అహంకారంతో ప్రవర్తించాలని అన్నట్లుగా తయారైంది ఇప్పుడు వాతావరణం‌. అంతే కాకుండా డబ్బులు ఉన్న వాళ్ళని ఇలా నాయకుడిగా నిలబెట్టడం వల్ల అవసరం వచ్చినప్పుడు వాళ్ళు డబ్బులు వెదజల్లి మరీ పనులు సజావుగా సాగేలా చూస్తారు.


అంతే కాకుండా పార్లమెంటు సభ్యుడు అంటే ఇప్పుడు తనకంటూ ఎమ్మెల్యేలను చెప్పుచేతల్లో పెట్టుకోవాలని, మాట వినకపోతే వారికి ప్రత్యామ్నాయ వ్యక్తులను తయారు చేయాలని ఒక లెక్క ఉంది. ఇప్పటి వరకు  పార్లమెంట్ సభ్యుడు అంటే లెక్క ఇలాగే ఉంది. అంతేకాకుండా ఇప్పుడు ఎమ్మెల్యేలు కూడా పోటాపోటీగా డబ్బులు వెదజల్లుతూ ఉండడం వల్ల ఇప్పుడు వాళ్ళిద్దరికీ పోటీ అనేది  ఏర్పడుతుంది.


అయితే వీళ్ళు అందరిలోనూ ఒకే ఒక్క ఎంపీ మాత్రం తన ప్రత్యేకతను చాటుకుంటున్నారు. ఆయనే చిత్తూరు జిల్లా తిరుపతికి సంబంధించిన ఎంపీ గురుమూర్తి. అయితే ఆయన తన జేబులోని  ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా కేవలం పార్టీ సొమ్మును ఖర్చుపెట్టి మరి గెలిచాడట. అదే ఇప్పుడు ఆయన్ని ప్రత్యేక స్థానంలో నిలబెట్టేలా చేస్తుంది.  


అలాగే ఈ గురుమూర్తి తన నియోజక వర్గ అభివృద్ధి కోసం కేంద్రం దగ్గరకు వెళ్లడం.. వారి దగ్గరుండి అనుమతులు తెచ్చుకోవడం చేస్తున్నారు. అంతే కాదు.. అలాంటి వారికి తిరుపతి శ్రీవారి దర్శనం కూడా చేయిస్తున్నారు. మామూలుగా వైసిపి వాళ్లు దర్శనాలకు అడిగినా సరే టిక్కెట్లు లేని పరిస్థితి ఉంటుందట ఒక్కోసారి. ఒకవేళ పర్మిషన్ ఇచ్చినా, టిక్కెట్లు ఇచ్చినా బ్రేక్ దర్శనాలకు వెళ్లిన వారిని కూడా విగ్రహాలకు ముందే దింపేయడం చేస్తున్నారట. గతంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒక మనిషిని సిఫారసు చేస్తే డైరెక్ట్ గా దేవుడి ఎదురుగా తీసుకువెళ్లి హారతులు ఇచ్చే విధంగా ఉండేది. అంతే కాదు ఈ గురుమూర్తి మిగిలిన నేతలకంటే భిన్నంగా ఈఎస్ఐ ఆసుపత్రిని కూడా సందర్శించారు. ఇలాంటి నేతలను మెచ్చుకోవాల్సిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ కారణంగా అమెరికా వెళ్లిన శర్వానంద్....!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>