HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf4bb7a3f-53e5-4ce9-a98c-f29645a9114f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthf4bb7a3f-53e5-4ce9-a98c-f29645a9114f-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. వీలైతే వాకింగ్, జిమ్ ఇంకా యోగా కూడా చేస్తున్నారు. ఒక వేళ వారికి సమయం లేకపోతే.. వారు తినే ఆహారాలతోనే ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.ఇందులో భాగంగానే చాలా మంది ఉదయాన్నే నీళ్లు తాగడం ఇంకా అల్పాహారంగా మంచి ఫ్రూట్స్ తీసుకోవడం చేస్తుంటారు. అయితే కారణంగా వారి ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది.నిజానికి నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది ప్రజలు ఇంటి భోజనానికి ఎక్కువగా దూరం అవుతున్నారు.బయటి ఆహారం చాలHEALTH{#}Yoga;Sugar;Manam;Cholesterol;oilపొద్దున్నే ఈ నీళ్లు తాగితే హెల్త్ కి చాలా ప్రయోజనాలు?పొద్దున్నే ఈ నీళ్లు తాగితే హెల్త్ కి చాలా ప్రయోజనాలు?HEALTH{#}Yoga;Sugar;Manam;Cholesterol;oilFri, 25 Aug 2023 14:53:00 GMTఈ మధ్య కాలంలో ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి చాలా ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. వీలైతే వాకింగ్, జిమ్ ఇంకా యోగా కూడా చేస్తున్నారు. ఒక వేళ వారికి సమయం లేకపోతే.. వారు  తినే ఆహారాలతోనే ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు.ఇందులో భాగంగానే చాలా మంది ఉదయాన్నే నీళ్లు తాగడం ఇంకా అల్పాహారంగా మంచి ఫ్రూట్స్ తీసుకోవడం చేస్తుంటారు. అయితే కారణంగా వారి ఆరోగ్యం చాలా బాగా మెరుగుపడుతుంది.నిజానికి నేటి ఉరుకులు పరుగుల జీవితంలో చాలా మంది ప్రజలు ఇంటి భోజనానికి ఎక్కువగా దూరం అవుతున్నారు.బయటి ఆహారం చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు. అంటే ప్రాసెస్‌డ్ ఫుడ్, జంక్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ చాలా ఎక్కువగా తింటున్నారు. దాని ఫలితంగా స్థూలకాయం, అధిక బరువు, మధుమేహం వంటి ఇతర సమస్యల బారిన పడుతున్నారు. చెడు జీవనశైలి వల్ల శరీరంలో వ్యర్థ పదార్థాలు భారీగా పెరుకుపోవడంతో వ్యాధుల నిలయంగా మారుతున్నారు. మరి శరీరంలో ఈ వ్యర్థ పదార్థాలను బయటపంపించే డ్రింక్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.ఒక గ్లాస్ గోరువెచ్చని నీటితో మనం రోజును ప్రారంభించాలని ఆయుర్వేదం సూచిస్తుంది. అయితే, ఈ నీళ్లలో కూడా అజ్వైన్, వామును కలిపి తాగితే చాలా ప్రయోజనం ఉంటుందని చెబుతున్నారు. ఇక క్రమ రహిత పీరియడ్స్‌తో ఇబ్బంది పడేవారు.. వామును మరిగించిన నీటిని ప్రతి రోజూ ఉదయం పూట తాగడం వలన రుతుక్రమం సక్రమంగా జరుగుతుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.


క్రమం తప్పకుండా వామును తిన్నా లేదా వాము నీటిని తాగినా చాలా వ్యాధుల నుంచి బయటపడొచ్చని చెబుతున్నారు. అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు గురికాకుండా ఉండొచ్చని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఇది జీర్ణ వ్యవస్థ ఆరోగ్యాన్ని కూడా ఖచ్చితంగా కాపాడుతుంది. అలాగే గ్యాస్, గుండెల్లో మంట ఇంకా హర్మోన్ల సమస్యతో బాధపడేవారు.. ఈ వాము మరిగించిన నీటిని ప్రతి రోజూ తీసుకుంటే ఖచ్చితంగా ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అధిక బరువు సమస్యతో బాధపడేవారు  స్థూలకాయాన్ని నివారించడానికి వాము వాటర్ చాలా అద్భుతంగా పని చేస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. ఒత్తిడి, బ్లడ్ షుగర్ ఇంకా కొలెస్ట్రాల్ సహా చాలా వ్యాధులు నియంత్రణలో ఉంటాయని చెబుతున్నారు.ఇది శరీరంలో అదనపు కొవ్వును కూడా కరిగిస్తుంది. ఇక జలుబు, జ్వరం సమస్య నుంచి కూడా ఇది మంచి ఉపశమనం కలిగిస్తుంది. నీటిలో ఒక టీస్పూన్ వామును వేసి దానిని మరిగించి.. ఆ నీటిని తాగితే ఇక దగ్గు సమస్య కూడా క్రమంగా తగ్గిపోతుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మూవీకి నో నేషనల్ అవార్డ్.. బాధలో నాని?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>