LifeStyleDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/saltdc944400-db2b-4971-a93f-5117c6d9f539-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/saltdc944400-db2b-4971-a93f-5117c6d9f539-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక సవాల్ గా మారుతోంది.. ముఖ్యంగా ఉప్పు, తీపి ,పులుపు ఇలా ఏది ఎక్కువగా తిన్నా సరే అనేక రకాల సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి.. ముఖ్యంగా ఇందులో ఉప్పు ఎక్కువగా తిన్న వారు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణుల సైతం తెలియజేస్తున్నారు. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం. నిత్యం మనం తీసుకోవాల్సిన మోతాదు కంటే ఎక్కువగా తీసుకున్నట్లు అయితే బిపి పెరిగే అవకాSALT{#}salt;Sodium;kali;BP;Heart;Manamఉప్పు ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా..?ఉప్పు ఎక్కువగా తింటే ఎంత ప్రమాదమో తెలుసా..?SALT{#}salt;Sodium;kali;BP;Heart;ManamFri, 25 Aug 2023 19:00:00 GMTప్రస్తుతం ఉన్న కాలంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం అనేది ఒక సవాల్ గా మారుతోంది.. ముఖ్యంగా ఉప్పు, తీపి ,పులుపు ఇలా ఏది ఎక్కువగా తిన్నా సరే అనేక రకాల సమస్యలు కూడా చుట్టుముడుతున్నాయి.. ముఖ్యంగా ఇందులో ఉప్పు ఎక్కువగా తిన్న వారు చాలా రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారు తీవ్రమైన అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణుల సైతం తెలియజేస్తున్నారు. వాటి గురించి పూర్తి వివరాలు ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.


నిత్యం మనం తీసుకోవాల్సిన మోతాదు కంటే ఎక్కువగా తీసుకున్నట్లు అయితే బిపి పెరిగే అవకాశం ఉంటుందట. దీనివల్ల రక్తపోటు నియంత్రణలో ఉండలేకపోవచ్చు.. అందుచేతనే ఉప్పును మితంగా మాత్రమే తీసుకోవడం మంచిది.. ఉప్పు ఎక్కువగా తింటే రక్తప్రసరణలో చాలా సమస్యలు ఎదురవుతాయి. దీనివల్ల గుండెకు సరైన రక్త సరఫరా జరగకపోవడం వల్ల గుండె సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుందట. తప్పు తరచు ఎక్కువగా తినే వారు సాధారణ మూత్ర విసర్జన కంటే అధికంగా ఎక్కువసార్లు పోవలసి వస్తుందట అంతేకాకుండా ఉప్పులో ఉండే సోడియం కూడా బయటికి వెలుబడుతుంది.


ఉప్పు తరచు ఎక్కువగా తినేవాళ్లు కిడ్నీలో రాళ్లు కూడా ఏర్పడతాయి.. ఉప్పులో అధికంగా సోడియం కంటెంట్ ఉండడం వల్ల ఇది కిడ్నీలలో పేరుకుపోయి తీవ్రమైన సమస్యలను సైతం ఎదుర్కొని కిడ్నీ లోపల రాలుగా మారుతుంది. ఉప్పు మోతాదుకు మించి తినే వారి శరీరంలో వాపు సమస్య కూడా అధికంగా ఉంటుంది ముఖ్యంగా కాలి మడమ భాగంలో ఉబ్బినట్టుగా అనిపిస్తుంది.. అక్కడ వేలుతో నొక్కితే చర్మం లోపలికి వెళుతుంది దీని వలన ఆ ప్రాంతంలో నీరు చేరడమే ఆస్కారంగా మారుతుంది. ఇలాంటి దాన్ని ఏడిమా అని కూడా అంటారట. ఉప్పు ఎక్కువగా తినే వారు బాడీ నుంచి నీటిని ఎక్కువ శాతం కోల్పోయే అవకాశం ఉంటుంది దీనివల్ల డిహైడ్రేషన్ కూడా గురికావాల్సి ఉంటుంది. అందుకే ఉప్పును తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ మూవీకి నో నేషనల్ అవార్డ్.. బాధలో నాని?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>