DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/rajasingh63509071-b18b-4dfc-8ea9-e03fee0269ae-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/rajasingh63509071-b18b-4dfc-8ea9-e03fee0269ae-415x250-IndiaHerald.jpgఈటల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన ఉద్యమం చేసి బీఆర్ఎస్ మంత్రిగా కొనసాగి.. తర్వాత సీఎం కేసీఆర్ తో పొసగక ఆయన బయటకు వచ్చి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి మరీ గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ చేరిక కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గోషా మహాల్ స్థానం లో రాజాసింగ్ ప్లేస్ లో విక్రమ్ గౌడ్ ను బరిలో దింపేందుకు ఈటల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే పార్టీ లో మొదటి నుంచి అసెంబ్లీలో 2019 లో బీజేపీ నుంచి గెలిచిన ఒకే ఒక్క వ్యక్తి రాజా సింగ్. బీఆర్ ఎస్ లో చేరినా రాజRAJASINGH{#}MIM Party;raja;Hanu Raghavapudi;Backward Classes;vikram;Elections;Bharatiya Janata Party;Party;CM;Congressఈటల, రాజాసింగ్‌ పేచీ.. బీజేపీకి లాస్‌?ఈటల, రాజాసింగ్‌ పేచీ.. బీజేపీకి లాస్‌?RAJASINGH{#}MIM Party;raja;Hanu Raghavapudi;Backward Classes;vikram;Elections;Bharatiya Janata Party;Party;CM;CongressFri, 25 Aug 2023 07:00:00 GMTఈటల రాజేందర్ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఈయన ఉద్యమం చేసి బీఆర్ఎస్ మంత్రిగా కొనసాగి.. తర్వాత సీఎం కేసీఆర్ తో పొసగక ఆయన బయటకు వచ్చి బీజేపీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేసి మరీ గెలుపొందారు. ప్రస్తుతం రాష్ట్ర బీజేపీ చేరిక కమిటీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. గోషా మహాల్ స్థానం లో రాజాసింగ్ ప్లేస్ లో విక్రమ్ గౌడ్ ను బరిలో దింపేందుకు ఈటల ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


అయితే పార్టీ లో మొదటి నుంచి అసెంబ్లీలో 2019 లో బీజేపీ నుంచి గెలిచిన ఒకే ఒక్క వ్యక్తి రాజా సింగ్. బీఆర్ ఎస్ లో చేరినా రాజాసింగ్ కు ఇబ్బంది తప్పదు. ఎందుకంటే అక్కడ ఎంఐఎం పార్టీ ఉంది కాబట్టి రాజాసింగ్ హిందూత్వ వాదిగా, గో సంరక్షకుడిగా ఆయన మాట్లాడే విధానం వివాదాలకు దారి తీసే అవకాశం ఉంది.


అయితే బీఆర్ ఎస్ లో టికెట్ రాని వారు ముందుగా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. తప్ప బీజేపీ ప్రత్యామ్నాయం అని ఆలోచించడం లేదు.  ఈటల చేరికల కమిటీ సభ్యుడై ఉండి.. కాంగ్రెస్ లోకి మిగతా వారు వెళుతున్నా కూడా ఎందుకు ఆపలేకపోతున్నారని ప్రశ్న తలెత్తుతుంది. బీజేపీలో  వారిని చేర్చుకోవడంలో విఫలం అవుతున్నారనే సందేహం తలెత్తుతోంది. మరీ ఈటల సాధిస్తున్నదేమిటి?


చేరికల కమిటీలో అధ్యక్షుడిగా ఉండి బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి పార్టీలో సభ్యులను చేర్చుకోకపోవడం, ఎన్నికలు కూడా దగ్గరపడుతుండటంతో బీజేపీ పరిస్థితి ఏమిటనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. మూడు నెలల ముందుగానే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమరంలోకి గులాబీ దళం దూకింది. ఇప్పటి నుంచే ప్రచారం ప్రారంభించేశారు. ఇంకా సభ్యులను చేర్చుకోవడంలోనే బీజేపీ ఉంది. ఇలాంటి తరుణంలో బీజేపీ ఏ విధంగా ముందుకు సాగుతుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలవడం అంతా ఈజీ కాదు. ఏ మాత్రం ఆలస్యం చేసిన వారికే నష్టం కలిగే అవకాశం ఉంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

2021 నేషనల్ అవార్డులలో తెలుగు సినిమాలకి వచ్చిన అవార్డ్స్ ఇవే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>