Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle303ddc68-7568-4be9-9911-9e17a865ef93-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle303ddc68-7568-4be9-9911-9e17a865ef93-415x250-IndiaHerald.jpgఎంతో ప్రతిష్ఠాత్మకంగా రామాయణ కథను బాలీవుడ్‌ సినిమాగా రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నితిశ్‌ తివారి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో నటీనటుల గురించి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అయితే తాజాగా హీరోయిన్ అలియా ఈ సినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.నిర్మాతలు అల్లు అరవింద్‌, మధు మంతెన లు తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ను, సీత పాత్రలో అలియా భట్‌లను ఎంపిక చేశారని బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. నితిశ్‌ తివారి వీళ్లిద్దరికీ లుక్ టెస్ట్‌ కూడాsocialstars lifestyle{#}Alia Bhatt;Allu Aravind;seetha;Hero;Heroine;India;News;Cinemaఅలాంటి ప్రాజెక్ట్ వద్దనుకుంటున్న అలియా భట్....!!అలాంటి ప్రాజెక్ట్ వద్దనుకుంటున్న అలియా భట్....!!socialstars lifestyle{#}Alia Bhatt;Allu Aravind;seetha;Hero;Heroine;India;News;CinemaThu, 24 Aug 2023 18:20:36 GMTఎంతో ప్రతిష్ఠాత్మకంగా రామాయణ  కథను బాలీవుడ్‌ సినిమాగా రూపొందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. నితిశ్‌ తివారి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ మూవీలో నటీనటుల గురించి వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.అయితే తాజాగా హీరోయిన్ అలియాసినిమా విషయంలో ఓ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.నిర్మాతలు అల్లు అరవింద్‌, మధు మంతెన లు తాజా చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇందులో రాముడిగా రణ్‌బీర్‌ కపూర్‌ను, సీత పాత్రలో అలియా భట్‌లను ఎంపిక చేశారని బాలీవుడ్‌ మీడియాలో వార్తలు వచ్చాయి. నితిశ్‌ తివారి వీళ్లిద్దరికీ లుక్ టెస్ట్‌ కూడా నిర్వహించారట. అయితే ఇప్పుడీ బడా ప్రాజెక్ట్‌ నుంచి అలియా భట్‌ వైదొలగినట్లు సమాచారం. దీనికి ప్రధాన కారణం ఆమెకు డేట్స్ కుదరకపోవడమేనట. 

ప్రస్తుతం అలియా  హాలీవుడ్‌ సినిమాల్లోనూ నటిస్తోంది. దీంతో రామాయణానికి నో చెప్పినట్లు టాక్‌ వినిపిస్తుంది. ఇక ఈ సినిమాలో రావణాసురుడి పాత్ర కోసం 'కేజీయఫ్‌' హీరో యశ్‌కు కూడా లుక్‌ టెస్ట్‌ చేశారు. అంతా బానే ఉన్నా.. ఇప్పటి వరకు యశ్‌ కూడా ఈ సినిమాకు ఓకే చెప్పలేదట. దీనిపై ఇటీవల ఈ హీరో కూడా పరోక్షంగా స్పందించారు. 'బాలీవుడ్‌లో రూపొందుతోన్న పెద్ద ప్రాజెక్ట్‌ విషయంలో నేను ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు' అని అన్నారు. అయితే ఈ సినిమాను నటీనటులు అంగీకరించకపోవడంపై మరికొన్ని కారణాలు కూడా వినిపిస్తున్నాయి. రామాయణం ఆధారంగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఆదిపురుష్‌' ఫలితం దీనికి కారణమై ఉండొచ్చని కొందరు అనుకుంటున్నారు.

కొత్త మూవీ షూటింగ్‌ ఈ ఏడాది డిసెంబర్‌లో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సినిమాను మూడు భాగాలుగా తీసుకురావాలని మేకర్స్‌ భావిస్తున్నారట. అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా స్థాయిలో తీయాలని ప్రయత్నిస్తున్నారు. దీని గురించి గతంలో అల్లు అరవింద్ మాట్లాడుతూ నాలుగు సంవత్సరాలుగా రామాయణం సినిమాకు సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నారు. ఇది చాలా పెద్ద ప్రయత్నమని.. ఇది పూర్తయితే భారతదేశంలోనే అతి పెద్ద, అతి భారీ బడ్జెట్‌ సినిమాగా నిలిచిపోతుందని తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రయాన్-3 సక్సెస్, పట్టించుకోని రణ్ వీర్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>