Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raasi261d4c87-c915-44dd-af0a-6e7e7e5770a1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/raasi261d4c87-c915-44dd-af0a-6e7e7e5770a1-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్ తమ్ముడుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు పవర్ స్టార్. ఇక హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా అభిమానుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు. మిగతా హీరోలతో పోల్చి చూస్తే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు తక్కువ హిట్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. కానీ అభిమానులు మాత్రం మిగతా హీరోల కంటే ఎక్కువగానే ఉన్నారూ. ఇక ఇప్పుడు ఒక వైపు రాజకీయాలను మరRaasi{#}Driver;Gokulamlo Sita;Gokulamlo Seeta;Pawan Kalyan;kalyan;Chiranjeevi;Yevaru;Car;Telugu;Heroineపవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి.. రాసి ఆసక్తికర వ్యాఖ్యలు?పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి.. రాసి ఆసక్తికర వ్యాఖ్యలు?Raasi{#}Driver;Gokulamlo Sita;Gokulamlo Seeta;Pawan Kalyan;kalyan;Chiranjeevi;Yevaru;Car;Telugu;HeroineThu, 24 Aug 2023 08:24:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మెగాస్టార్ తమ్ముడుగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైనప్పటికీ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు పవర్ స్టార్. ఇక  హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా అభిమానుల సంఖ్యను అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు. మిగతా హీరోలతో పోల్చి చూస్తే ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ కు తక్కువ హిట్ సినిమాలు మాత్రమే ఉన్నాయి. కానీ అభిమానులు మాత్రం మిగతా హీరోల కంటే ఎక్కువగానే ఉన్నారూ.


 ఇక ఇప్పుడు ఒక వైపు రాజకీయాలను మరోవైపు సినిమాలను కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్.  అయితే ఈ రేంజ్ లో క్రేజీ ఉన్న పవన్ కళ్యాణ్ గురించి ఎవరు ఎలాంటి వ్యాఖ్యలు చేసిన అది సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే గతంలో పవన్ కళ్యాణ్ తో నటించిన సీనియర్ హీరోయిన్ రాసి ఇటీవలే పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.పవన్ కళ్యాణ్, రాసి జంటగా గోకులంలో సీత సినిమా వచ్చి మంచి విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.


 అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ గురించి రాసి మాట్లాడుతూ.. గోకులంలో సీత సినిమా తర్వాత మళ్లీ పవన్ కళ్యాణ్ ని కలిసాను. అయితే ఇప్పుడు పవర్ స్టార్ పెద్ద స్టార్ అయిపోయారు ఆయన. ఇప్పుడు కలవాలంటే చుట్టూ చాలామంది ఉంటారు. వాళ్ళందరిని దాటుకొని వెళ్లాల్సి ఉంటుంది. అయితే నా కూతురు పుట్టిన రోజుకు పిలవడానికి ఓసారి పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్లాను. నా కోస్టార్ కదా అపాయింట్మెంట్ అవసరం ఉండదులే అనుకున్న. నేను డైరెక్ట్ గా ఆయన ఉన్న షూటింగ్ లోకేషన్ కు వెళ్ళిపోయా. నేను వెళ్లకుండా కారులో కూర్చొని మా డ్రైవర్ ని పంపించాను. ఒకవేళ అపాయింట్మెంట్ లేకపోతే వెనక్కి వెళ్ళిపోదాం అని ముందే చెప్పా. మా డ్రైవర్ వెళ్లి చెప్పగానే.. పవన్ కళ్యాణ్ ఆవిడని వెంటనే పిలవండి.. నాకు చెప్పకుండా ఎందుకు ఆమెని వెయిట్ చేయించారు అని డ్రైవర్తో అన్నాడట. తర్వాత నాకు వెల్కమ్ చెప్పి కూర్చోబెట్టి 20 నిమిషాలు మాట్లాడారు. గోకులంలో సీత సినిమా విషయాలను మాట్లాడుకున్నాం. మళ్లీ నన్ను కార్ వరకు  వచ్చి పంపించారు.ఎంత గొప్ప సంస్కారం. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే గొప్ప వ్యక్తిత్వం పవన్ కళ్యాణ్ ది అంటూ చెప్పుకొచ్చారు రాసి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లోకేశ్‌ బూతులు మాను.. దమ్ముంటే చర్చకు రా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>