Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india23475764-a518-49bd-b43a-8123d92feecf-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/india23475764-a518-49bd-b43a-8123d92feecf-415x250-IndiaHerald.jpgఈ ఏడాది టీమిండియా రెండు మెగా టోర్నీలు ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటే పాకిస్తాన్ శ్రీలంక వేదికగా జరగబోయే ఆసియా కప్ అయితే.. ఇంకొకటి భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్. కాగా వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఆసియా కప్ జరగబోతుంది. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే అటు బీసీసీఐ ఆసియా కప్ లో అడుగుపెట్టబోయే భారత జట్టు వివరాలను కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ ఆసియా కప్ కోసం శ్రీలంక వెళ్లబోయే ఆటగాళ్లు ఎవరు అనే విషయంపై కూడా ఇప్పటికే కాస్త క్లారిటీ వచ్చIndia{#}Ireland;Sri Lanka;West Indies;World Cup;VIRAT KOHLI;BCCI;Yevaru;Cricket;Pakistan;Indiaఆసియా కప్ ప్రారంభానికి ముందే.. టీమిండియా ప్లేయర్లకు మరో పరీక్ష?ఆసియా కప్ ప్రారంభానికి ముందే.. టీమిండియా ప్లేయర్లకు మరో పరీక్ష?India{#}Ireland;Sri Lanka;West Indies;World Cup;VIRAT KOHLI;BCCI;Yevaru;Cricket;Pakistan;IndiaThu, 24 Aug 2023 15:00:00 GMTఈ ఏడాది టీమిండియా రెండు మెగా టోర్నీలు ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇందులో ఒకటే పాకిస్తాన్ శ్రీలంక వేదికగా జరగబోయే ఆసియా కప్ అయితే.. ఇంకొకటి భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్. కాగా వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఆసియా కప్ జరగబోతుంది. ఈ నెల 30వ తేదీ నుంచి ప్రారంభం కాబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇప్పటికే అటు బీసీసీఐ ఆసియా కప్ లో అడుగుపెట్టబోయే భారత జట్టు వివరాలను కూడా ప్రకటించింది. ఈ క్రమంలోనే ఈ ఆసియా కప్ కోసం శ్రీలంక వెళ్లబోయే ఆటగాళ్లు ఎవరు అనే విషయంపై కూడా ఇప్పటికే కాస్త క్లారిటీ వచ్చింది అని చెప్పాలి.



 ఈ క్రమంలోనే ఆసియా కప్ లో పాల్గొనడానికి ముందే ప్రస్తుతం టీమిండియా ప్లేయర్స్ అందరూ కూడా ఒక పెద్ద పరీక్ష ఎదుర్కోవాల్సి ఉంది అని చెప్పాలి. ఆసియా కప్ కంటే ముందు ఆటగాళ్లందరూ కూడా ఫిట్నెస్ పరీక్షలు ఉత్తీర్ణులు కావాలి. ఐర్లాండ్ పర్యటనలో పాల్గొనని.. వెస్టిండీస్ పర్యటన తర్వాత తిరిగి వచ్చిన ఆటగాళ్లకు 13 రోజుల ఫిట్నెస్ రొటీన్ ఇవ్వబడింది. ఇప్పుడు ఆసియా కప్ కు మొత్తం జట్టు తిరిగి వచ్చింది. ఈ క్రమంలోనే ప్లేయర్స్ అందరూ కూడా బాడీ చెకప్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఇక నేషనల్ క్రికెట్ అకాడమీ లో ఉన్న ఫిజియోల్ అందరూ కూడా ఆయా ఆటగాళ్లకు ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తారు.


 ఆ భారత ఆటగాళ్ల కోసం ప్రత్యేకంగా రూపొందించిన కార్యక్రమం. ఎందుకంటే రాబోయే రెండు నెలల పాటు ప్లేయర్లు ఫిట్గా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని ఎవరు అనుసరించారు ఎవరు అనుసరించలేదు అన్న విషయం కూడా గుర్తిస్తాం. ప్రోగ్రాం ని అనుసరించని ఆటగాడితో ఏం చేయాలి అన్నది కూడా టీం మేనేజ్మెంట్ నిర్ణయిస్తుంది అంటూ తెలిపారు.

 ఇంతకీ ఆసియా కప్ కోసం ఎన్సీఏ ప్రోగ్రాం ఏంటో తెలుసా..

 ఫిట్నెస్ రొటీన్ అనేది మొబిలిటీ. షోల్డర్ కేర్, బ్లుమ్ కండరాలకు సంబంధించినది. ఇది కాకుండా ఆటగాళ్ల బలంపై కూడా శ్రద్ధ చూపుతాం. ఎన్సీఏ ప్రతి ఆటగాడికి ప్రత్యేక దినచర్యను సిద్ధం చేసింది. ప్రతి క్రీడాకారుడు నిర్దిష్టమొత్తంలో ప్రోటీన్ తీసుకోవాల్సి ఉంటుంది. పూర్తిగా జిమ్ సెషన్ కూడా తీసుకోవాలి. నడవాలి, పరిగెత్తాలి, ఆపై స్విమ్మింగ్ సెక్షన్ కూడా తీసుకోవాలి. కోహ్లీ రోహిత్ లాంటి కీలక ఆటగాలైతే యోగతో పాటు తొమ్మిది గంటల పాటు నిద్ర పోవాల్సి ఉంటుంది. ఇది కాకుండా ప్రత్యేకంగా ఎన్సీఏ ప్రతి ఆటగాడికి కసరత్తులను కూడా సిద్ధం చేసింది అంటూ బిసిసిఐ అధికారి ఒకరు తెలిపారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రయాన్-3 సక్సెస్, పట్టించుకోని రణ్ వీర్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>