MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd1403edf-7ffe-4040-a7a4-e688c9ee5ffb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoodd1403edf-7ffe-4040-a7a4-e688c9ee5ffb-415x250-IndiaHerald.jpgఅగ్ర దర్శకుడు నితీష్ తివారి బిగ్ స్కేల్లో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి నటీనటుల విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణంలో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీతగా ఆలియా భట్, రావణుడిగా కేజిఎఫ్ హీరో యశ్ నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం నితీష్ తివారి రామాయణంలో అలియా భట్ భాగం కాదని తెలుస్తోంది. మొదట్లో తన భర్త రణబీర్ తో కలిసి రామాయణంలో సీత పాత్ర పోషించేందుకు ఓకే tollywood{#}Yash;Husband;KGF;bollywood;producer;Producer;Alia Bhatt;seetha;Darsakudu;Director;Cinema;News'రామాయణం' నుండి తప్పుకున్న అలియా భట్.. ?'రామాయణం' నుండి తప్పుకున్న అలియా భట్.. ?tollywood{#}Yash;Husband;KGF;bollywood;producer;Producer;Alia Bhatt;seetha;Darsakudu;Director;Cinema;NewsThu, 24 Aug 2023 20:07:20 GMT అగ్ర దర్శకుడు నితీష్ తివారి బిగ్ స్కేల్లో రామాయణాన్ని తెరకెక్కిస్తున్నారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి నటీనటుల విషయంలో రకరకాల వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. నితీష్ తివారి తెరకెక్కిస్తున్న రామాయణంలో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, సీతగా ఆలియా భట్, రావణుడిగా కేజిఎఫ్ హీరో యశ్ నటిస్తున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. కానీ తాజా సమాచారం ప్రకారం నితీష్ తివారి రామాయణంలో అలియా భట్ భాగం కాదని తెలుస్తోంది. మొదట్లో తన భర్త రణబీర్ తో కలిసి రామాయణంలో సీత పాత్ర పోషించేందుకు ఓకే చెప్పిన ఆలియా భట్, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు సమాచారం. 

ఈ ప్రాజెక్టు కోసం ఆలియా భట్ దగ్గర సరిపడా డేట్స్ లేవట. అందుకే ఆమె ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు బాలీవుడ్ మీడియా వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు ఈ ప్రాజెక్టు కోసం దర్శకులు నితీష్ తివారి ఆలీయాని ఎంతగా కన్విన్స్ చేయాలని చూస్తున్నా ఆమె అందుకు ఒప్పుకోవడం లేదట. ఆలియాతోపాటు కేజీఎఫ్ హీరో యష్ కూడా ఈ ప్రాజెక్టులో రావణుడిగా నటించేందుకు అటు ఎస్ అని చెప్పక ఇటు నో అని చెప్పక మేకర్స్ ను కన్ఫ్యూజన్లో పడేసాడని, మరోవైపు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు ఇంకా పెండింగ్ లో ఉండటంతో డిసెంబర్లో మొదలు పెట్టాలనుకున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు సాధ్యమయ్యేలా కనిపించడం లేదని అంటున్నారు. 

ఈ ప్రాజెక్టు కోసం యశ్ తో మేకర్స్ ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నారు. రీసెంట్ గానే యష్ కు సంబంధించి లుక్ టెస్ట్ కూడా చేశారట. అయినా యశ్ ఈ ప్రాజెక్టు ఇంకా సైన్ చేయలేదు. అందుకు కారణం యష్ ఇప్పటికే నేషనల్ అవార్డు విన్నింగ్ డైరెక్టర్ మోహన్ దాస్ ఓ యాక్షన్ మూవీ చేయడం కోసం కమిట్ అయ్యాడు. అందుకే రామాయణాన్ని హోల్డ్ లో పెట్టినట్టు తెలుస్తోంది. నితీష్ తివారితోపాటు నిర్మాత మధు వంతెన రామాయణాన్ని ఏకంగా మూడు భాగాలుగా తెరకెక్కించాలని కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రయాన్-3 సక్సెస్, పట్టించుకోని రణ్ వీర్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>