Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pujara0c265186-84a0-47c3-ad55-c241ed604a50-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/pujara0c265186-84a0-47c3-ad55-c241ed604a50-415x250-IndiaHerald.jpgఇటీవల కాలంలో టీమ్ ఇండియాలో యంగ్ ప్లేయర్స్ హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రతిభ తీర మీదికి వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే యంగ్ పేస్ అందరు కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక టీమిండియాలో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. దీంతో ఇక సీనియర్ ప్లేయర్స్ కెరియర్ ప్రమాదంలో పడిపోతుంది. అప్పటివరకు జట్టుకు ఎంతలా సేవ చేశారు అన్నది కాదు అప్పుడు ఫామ్ లో ఉన్నారా లేదా అని పరిగణలోPujara{#}West Indies;BCCI;Service;Indianనాపై నాకే డౌట్ వస్తుంది.. సెలక్టర్లపై పూజార ఆగ్రహం?నాపై నాకే డౌట్ వస్తుంది.. సెలక్టర్లపై పూజార ఆగ్రహం?Pujara{#}West Indies;BCCI;Service;IndianThu, 24 Aug 2023 14:00:00 GMTఇటీవల కాలంలో టీమ్ ఇండియాలో యంగ్ ప్లేయర్స్ హవా ఎంతలా పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బిసిసిఐ ప్రతి ఏడాది నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ కారణంగా ఎప్పటికప్పుడు కొత్త ప్రతిభ తీర మీదికి వస్తూనే ఉంది. ఈ క్రమంలోనే యంగ్ పేస్ అందరు కూడా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇక టీమిండియాలో చోటు దక్కించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతూ ఉన్నారు. దీంతో ఇక సీనియర్ ప్లేయర్స్ కెరియర్ ప్రమాదంలో పడిపోతుంది. అప్పటివరకు జట్టుకు ఎంతలా సేవ చేశారు అన్నది కాదు అప్పుడు ఫామ్ లో ఉన్నారా లేదా అని పరిగణలోకి తీసుకుంటున్నారు సెలెక్టర్లు.



 ఈ క్రమంలోనే సీనియర్లు ఒకవేళ ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడ్డారు అంటే చాలు నిర్మొహమాటంగా వారిని జట్టు నుంచి తప్పించి యంగ్ ప్లేయర్స్ కు అవకాశం ఇస్తూ ఉండడం చూస్తూ ఉన్నాం. దీంతో ఎంతో మంది సీనియర్ ప్లేయర్స్ ఎన్నో నెలల నుంచి ఇక టీమిండియాలో సరైన అవకాశాలను అందుకోలేకపోతున్నారు. ఇలా ఇక టీమిండియా సెలెక్టర్ల నుంచి ఉద్వాసనకు గురైన ఆటగాళ్లలో అటు టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ అయినా చటేశ్వర్ పూజార కూడా ఒకరు అని చెప్పాలి. అప్పట్లో భారత జట్టు టెస్ట్ మ్యాచ్ ఆడుతుంది అంటే చాలు అందులో పూజార తప్పక చోటు సంపాదించుకునేవాడు. కానీ ఇక బిసిసిఐ అతనికి ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు.


 దీంతో అతన్ని పక్కన పెట్టేసింది భారత సెలక్షన్ కమిటీ. అయితే ఇలా టెస్టు జట్టు నుంచి ఉద్వాసనకు గురి కావడం పట్ల పూజార ఇటీవల అసహనం వ్యక్తం చేశాడు. 90 టెస్టులు ఆడిన తర్వాత కూడా నన్ను నేను నిరూపించుకోవాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు. గత కొన్నేళ్లలో నేను ఎన్నో ఎత్తుపల్లాలను  చూసాను. ఇలాంటి పరిస్థితి అహాన్ని దెబ్బతీస్తుంది. మన సామర్థ్యం పై మనకే సందేహం కలిగిలా చేస్తుంది అంటూ పూజార షాకింగ్ కామెంట్స్ చేశాడు. కాగా వెస్టిండీస్ లో జరిగిన రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో ఇక ఈ టెస్ట్ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ని సెలెక్టర్లు పక్కన పెట్టేశారు అన్న విషయం తెలిసిందే.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ.. వేణు స్వామి చెప్పింది నిజమేనా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>