Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoof0729a9c4-be11-4d14-947a-468bacae5d9b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywoof0729a9c4-be11-4d14-947a-468bacae5d9b-415x250-IndiaHerald.jpgకోవిడ్ తర్వాత టాలీవుడ్ ప్రేక్షకుల టెస్ట్ పూర్తిగా మారిపోయింది. అదేంటి టాలీవుడ్ ప్రేక్షకుల టేస్ట్ మారడానికి కరోనా కి సంబంధం ఏంటి అంటారా.. కరోనా సమయంలో సినిమా షూటింగులు ఆగిపోయాయి. ఇక షూటింగ్ లు ఆగిపోయాక సినిమాలు ఎలా విడుదలవుతాయి. దీంతో అవి కూడా ఆగిపోయాయి. అలాంటి సమయంలోనే ఓటిపీకి భారీ క్రేజ్ వచ్చేసింది. ఇక ఓటీటిలో విడుదలైన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ అన్నిటిని కూడా చూసేశారు ప్రేక్షకులు. దీంతో సినిమాలు కూడా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది అని తమ టేస్ట్ మొత్తం మార్చుకున్నారు. దీంతో ఒకప్పటిలా కమర్షియల్ సినిమTollywoof{#}Thriller;Tollywood;Coronavirus;Posters;Akkineni Nagarjuna;Audience;Mass;Hero;shankar;Chiranjeevi;Cinemaరూటు మార్చిన సీనియర్ హీరోలు.. హిట్టు కోసం పాట్లు?రూటు మార్చిన సీనియర్ హీరోలు.. హిట్టు కోసం పాట్లు?Tollywoof{#}Thriller;Tollywood;Coronavirus;Posters;Akkineni Nagarjuna;Audience;Mass;Hero;shankar;Chiranjeevi;CinemaThu, 24 Aug 2023 11:00:00 GMTకోవిడ్ తర్వాత టాలీవుడ్ ప్రేక్షకుల టెస్ట్ పూర్తిగా మారిపోయింది. అదేంటి టాలీవుడ్ ప్రేక్షకుల టేస్ట్ మారడానికి కరోనా కి సంబంధం ఏంటి అంటారా.. కరోనా సమయంలో సినిమా షూటింగులు ఆగిపోయాయి. ఇక షూటింగ్ లు ఆగిపోయాక సినిమాలు ఎలా విడుదలవుతాయి. దీంతో అవి కూడా ఆగిపోయాయి. అలాంటి సమయంలోనే ఓటిపీకి భారీ క్రేజ్ వచ్చేసింది. ఇక ఓటీటిలో విడుదలైన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీస్ అన్నిటిని కూడా చూసేశారు ప్రేక్షకులు. దీంతో సినిమాలు కూడా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుంది అని తమ టేస్ట్ మొత్తం మార్చుకున్నారు. దీంతో ఒకప్పటిలా కమర్షియల్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తే హిట్ కావడం లేదు. సినిమాలో ఏదైనా కొత్తదనం ఉంటేనే హిట్ అవ్వగలుగుతుంది. దీంతో స్టార్ హీరోలకు కూడా ఇప్పుడు తిప్పలు తప్పడం లేదు.


 మరీ ముఖ్యంగా టాలీవుడ్ లో సీనియర్ హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి, వెంకటేష్, నాగార్జునలు అయితే హిట్టు కొట్టడానికి చాలా కష్టపడి పోతున్నారు. ఇక బాలయ్యకు స్పెషల్ ఆడియన్స్ ఉండడంతో మాస్ యాక్షన్ సినిమాలు తీయడంతో సూపర్ హిట్ లు సాధిస్తున్నారు. అయితే ఇక ఇప్పుడూ సీనియర్ హీరోలు కూడా రూటు మార్చారు అన్నది తెలుస్తుంది. ప్రేక్షకుల టేస్ట్ కి తగ్గట్టుగానే వినూత్నమైన కథలతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల బోళా శంకర్ తో డిజాస్టర్ చవిచూసిన మెగాస్టార్ చిరంజీవి.. ఇటీవల తన 150 సినిమాను ప్రకటించారు.


 బింబిసార  ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో ఈ మూవీ ఉండబోతుంది. ఇక ఒక సోషియో ఫాంటసీ మూవీ గానే ఈ మూవీ ఉంటుందని తెలుస్తోంది. ఇక 157 వ సినిమాకు సంబంధించిన పోస్టర్ విడుదల చేసిన పోస్టర్ లోనే  దీనికి సంబంధించి చిన్న హింట్ ఇచ్చారు మేకర్స్. దీంతో ఇక పోస్టర్ ఇంత థ్రిల్లింగ్  గా ఉంటే సినిమా ఎలా ఉంటుందో అని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి. అదే సమయంలో బింబిసారా లాంటి హిట్ తర్వాత వశిష్టకు రెండో మూవీ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు పెరుగుతున్నాయి. హీరో వెంకటేష్ సైతం సస్పెన్స్ థ్రిల్లర్  సినిమాలకు కేరఫ్ అడ్రస్  అయినా శైలేష్ కొలనుతో సైంధవ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాపై కూడా అంచనాలు ఉన్నాయి. ఇక నాగార్జున సైతం ఇలాంటి సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు అన్న టాక్ వినిపిస్తుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రాజకీయాల్లోకి అనసూయ ఎంట్రీ.. వేణు స్వామి చెప్పింది నిజమేనా..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>