EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/metrob14caf75-5e5c-4b8b-837a-536fbe745d4f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/metrob14caf75-5e5c-4b8b-837a-536fbe745d4f-415x250-IndiaHerald.jpgమెట్రో వస్తే దేశంలోని మహా నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీరుతుందని అంతా భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మెట్రో పరిసర ప్రాంతాల్లో ఆటోలు, క్యాబ్ లు ఎక్కువగా వస్తున్నాయి. కారణం మెట్రోలో ప్రయాణించి ఇళ్లకు చేరుకునే వారు.. లేదా మెట్రో స్టేషన్లకు చేరుకునే వారికి వీటి అవసరం ఎక్కువ. ఇలా కూడా ట్రాఫిక్ కారణం అవుతుంది. అయితే మెట్రో వల్ల లాభాలు కూడా ఉన్నాయి. ఏదైనా గమ్యస్థానం చేరాలంటే అనుకున్నదాని కంటే ముందే చేరొచ్చు. బస్సులు, ఆటోలు, బైక్ ల కంటే ముందే మెట్రో లో గమ్యం చేరొచ్చుMETRO{#}Bike;India;Hyderabad;Mahaమెట్రో రైళ్లు ఇండియా ముఖచిత్రం మార్చనున్నాయా?మెట్రో రైళ్లు ఇండియా ముఖచిత్రం మార్చనున్నాయా?METRO{#}Bike;India;Hyderabad;MahaThu, 24 Aug 2023 00:00:00 GMTమెట్రో వస్తే దేశంలోని మహా నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీరుతుందని అంతా భావించారు. అయితే అలాంటిదేమీ జరగలేదు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో మెట్రో పరిసర ప్రాంతాల్లో ఆటోలు, క్యాబ్ లు ఎక్కువగా వస్తున్నాయి. కారణం మెట్రోలో ప్రయాణించి ఇళ్లకు చేరుకునే వారు.. లేదా మెట్రో స్టేషన్లకు చేరుకునే వారికి వీటి అవసరం ఎక్కువ. ఇలా కూడా ట్రాఫిక్ కారణం అవుతుంది.


అయితే మెట్రో వల్ల  లాభాలు కూడా ఉన్నాయి. ఏదైనా గమ్యస్థానం చేరాలంటే అనుకున్నదాని కంటే ముందే చేరొచ్చు. బస్సులు, ఆటోలు, బైక్ ల కంటే ముందే మెట్రో లో గమ్యం చేరొచ్చు. మరీ ముఖ్యంగా క్యాబ్, ఆటోలో కంటే తక్కువ ధరకే మెట్రో లో ఛార్జీలు ఉండటం కలిసొచ్చే అంశం. ప్రస్తుతం ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మెట్రో రైళ్లు నడుస్తున్నాయి. వీటిల్లో ప్రయాణించే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది. అయితే దేశంలో మెట్రో రైల్వే స్టేషన్ల నిర్మాణం రైళ్ల పెంపుదలను చేపట్టాల్సిన అవసరం ఉంది.


ఇప్పటి వరకు భారత్ లో 846 కిలోమీటర్ల వరకు మెట్రో రైలు నడుస్తోంది. ఇంకా 450 కిలోమీటర్ల వరకు మెట్రో నిర్మాణ పనులు సాగుతున్నాయి. ఆమోదించబడిన రైల్వే నెట్ వర్క్ 370 కిలోమీటర్లు. అతి పెద్ద నిర్ణయం భారత మెట్రో నెట్ వర్క్ అధికారులు తీసుకోబోతున్నారు. మెట్రో సామర్థ్యాన్ని దాదాపు 10 వేల కిలోమీటర్లకు పైగా పెంచేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు.


అయితే కొత్తగా చేపట్టే ఈ ప్రాజెక్టు పూర్తయితే దాదాపు దేశ వ్యాప్తంగా ఎంతో మంది కి లాభం చేకూరనుంది. దీంతో ప్రపంచంలో మెట్రోను ఎక్కువగా ఉపయోగించే దేశం అమెరికాతో కూడా సరి సమానంగా పోటీ పడే స్థాయికి భారత్ చేరుకుంటుంది. అమెరికాను దాటినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రజలు మాత్రం మెట్రో సేవలపై చాలా ఆనందంగానే ఉన్నారు. ప్రయాణంలో ట్రాఫిక్ ఉండకపోవడం సమయానికి చేర్చడంతో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లెహంగాలో దేవకన్యల మెరిసిపోతున్న శ్రీయ..!!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>