MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood325c381f-a96a-4f4d-9508-12173b316c76-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood325c381f-a96a-4f4d-9508-12173b316c76-415x250-IndiaHerald.jpgమలయాళ స్టార్ మోహన్ లాల్, సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వృషభ'. నందకిషోర్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఏవీఎస్ స్టూడియోస్ అధినేతలు అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహీ పరేఖ్ మెహతా... ఫస్ట్ స్టెప్ మూవీస్ అధినేత శ్యామ్ సుందర్... బాలాజీ టెలీ ఫిలిమ్స్ అధినేతలు ఏక్తా కపూర్, శోభా కపూర్... కంటెంట్ మీడియా వరుణ్ మాథుర్ సంయుక్తంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు tollywood{#}Mohanlal;editor mohan;roshan;shyam;vishal krishna;Sri Venkateswara swamy;Kannada;Master;abhishek;Pooja Hegde;Music;Success;India;sree;Chitram;media;Heroine;Hindi;Hero;Cinemaఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'వృషభ'ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'వృషభ'tollywood{#}Mohanlal;editor mohan;roshan;shyam;vishal krishna;Sri Venkateswara swamy;Kannada;Master;abhishek;Pooja Hegde;Music;Success;India;sree;Chitram;media;Heroine;Hindi;Hero;CinemaThu, 24 Aug 2023 20:20:43 GMTమలయాళ స్టార్ మోహన్ లాల్, సీనియర్ హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వృషభ'. నందకిషోర్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో ఏవీఎస్ స్టూడియోస్ అధినేతలు అభిషేక్ వ్యాస్, విశాల్ గుర్నాని, జుహీ పరేఖ్ మెహతా... ఫస్ట్ స్టెప్ మూవీస్ అధినేత శ్యామ్ సుందర్... బాలాజీ టెలీ ఫిలిమ్స్ అధినేతలు ఏక్తా కపూర్, శోభా కపూర్... కంటెంట్ మీడియా వరుణ్ మాథుర్ సంయుక్తంగా పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నట్లు తెలుస్తోంది. 

సినిమాలో రోషన్ సరసన షనాయ కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. సీనియర్ హీరో శ్రీకాంత్, కన్నడ నటి రాగిణి ద్వివేది, ఒకప్పటి హిందీ నటి సల్మా కుమార్తె జహ్రా ఎస్ ఖాన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా షూటింగ్ మొదలుపెట్టిన చిత్ర యూనిట్ తాజాగా ఫస్ట్ షెడ్యూల్ ని కంప్లీట్ చేశారు. ఇదే విషయాన్ని తెలియజేస్తూ మోహన్లాల్ సోషల్ మీడియా వేదికగా పలు ఫోటోలను పంచుకున్నారు. అందులో మోహన్ లాల్ కత్తి దూస్తున్న ఫోటో ఆకట్టుకుంటుంది. దీన్నిబట్టి సినిమాలో మోహన్లాల్ ఓ చారిత్రాత్మక నేపథ్యం ఉన్న పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫస్ట్ షెడ్యూల్ మైసూర్ లో జరిగినట్లు సమాచారం. 

ఈ షెడ్యూల్లో భారీ యాక్షన్ ఘట్టాలను చిత్రీకరించారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ పీటర్ హెయిర్ ఆధ్వర్యంలో ఈ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించినట్లు తెలుస్తోంది. మరోవైపు హీరో రోషన్ సైతం ఫస్ట్ షెడ్యూల్ పూర్తయినట్లు సెట్స్ లో మూవీ మొత్తం తో దిగిన ఓ పిక్ ని తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఫస్ట్ షెడ్యూల్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసిన 'వృషభ' టీం ఆలస్యం చేయకుండా త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ని కూడా ప్లాన్ చేస్తున్నారు. 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రయాన్-3 సక్సెస్, పట్టించుకోని రణ్ వీర్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>