HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthd614eb16-399c-4342-9579-1768bcb00a7a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/healthd614eb16-399c-4342-9579-1768bcb00a7a-415x250-IndiaHerald.jpgమనలో చాలా మంది కూడా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో ఎంతగానో బాధపడుతూ ఉంటారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, నీటిని తక్కువగా తాగడం, అధిక బరువు, ఉప్పు ఇంకా పంచదార కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడడం వంటి కారణాల వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తలెత్తుతుంది.మూత్రపిండాల్లో రాళ్ల వల్ల కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం రావడం ఇంకా మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన బాధకలగడం, జ్వరం, మూత్రంలో మంట ఇంకా తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం ఇలా ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుhealth{#}salt;Calcium;Manamమూత్రపిండాల్లో రాళ్లని పోగొట్టే సింపుల్ టిప్?మూత్రపిండాల్లో రాళ్లని పోగొట్టే సింపుల్ టిప్?health{#}salt;Calcium;ManamThu, 24 Aug 2023 15:48:00 GMTమనలో చాలా మంది కూడా మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో ఎంతగానో బాధపడుతూ ఉంటారు. మారిన మన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, నీటిని తక్కువగా తాగడం, అధిక బరువు, ఉప్పు ఇంకా పంచదార కలిగిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం అలాగే ఇతర అనారోగ్య సమస్యలకు మందులు వాడడం వంటి కారణాల వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తలెత్తుతుంది.మూత్రపిండాల్లో రాళ్ల వల్ల కడుపులో నొప్పి, మూత్రంలో రక్తం రావడం ఇంకా మూత్రవిసర్జన సమయంలో తీవ్రమైన బాధకలగడం, జ్వరం, మూత్రంలో మంట ఇంకా తరచూ మూత్రవిసర్జనకు వెళ్లడం ఇలా ఇతర సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది.సాధారణంగా ఈ సమస్య నుండి బయటపడడానికి వైద్యులు శస్త్రచికిత్సను ఇంకా మందులను సూచిస్తూ ఉంటారు. అయితే ఇవేకాకుండా ఆయుర్వేదం ద్వారా కూడా మనం మూత్రపిండాల్లో రాళ్లను ఈజీగా తొలగించుకోవచ్చు. మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు అలాగే ఈ సమస్య మరింత తీవ్రతరం కాకూడదు అనుకునే వారు రణపాలాకును తీసుకోవడం వల్ల ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.


ఈ రణపాలాకులో ఫైటో కెమికల్స్ తో పాటు 12 రకాల ఇతర రసాయన సమ్మేళనాలు ఉంటాయి. సాధారణంగా మూత్రపిండాల్లో పేరుకుపోయిన క్యాల్షియం ఇంకా ఆక్సలైట్స్ తో కలిసి రాళ్లలాగా మారతాయి.ఈ రణపాలాకును తీసుకోవడం వల్ల వీటిలో ఉండే రసాయన సమ్మేళనాలు క్యాల్షియం ఇంకా ఆక్సలైట్స్ కలవకుండా చేసి రాళ్లు ఏర్పడకుండా నిరోదించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఇంకా అలాగే రాళ్ల కణాల దెబ్బతిన్న కణజాలాన్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడంలో కూడా రణపాల ఆకు చాలా బాగా సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక మూత్రపిండాలల్లో రాళ్ల సమస్యతో బాధపడే వారు 4 రణపాలాకులను తీసుకుని 200 ఎమ్ ఎల్ నీటిలో వేసి 100 ఎమ్ ఎల్ అయ్యే దాకా మరిగించాలి.ఆ తరువాత ఈ కషాయాన్ని వడకట్టి తేనె కలిపి తీసుకోవాలి.ఇంకా అలాగే ఈ ఆకులను నేరుగా నమిలి తినవచ్చు. ఈ విధంగా రణపాలాకును తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ల సమస్య నుండి చాలా ఈజీగా బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

చంద్రయాన్-3 సక్సెస్, పట్టించుకోని రణ్ వీర్




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>